- నీతి ఆయోగ్ సమావేశానికి హాజరు కాకపోతే మీరు మోదీకి సపోర్ట్
- రాష్ట్రంపై ప్రధాని సీత కన్ను
- నరేంద్ర మోడీ కేసీఆర్ నానికి ఒకే వైపు ఉన్నారు
- టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి
ముఖ్యమంత్రి కేసీఆర్ గత ఎనిమిది సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వంతో కలిసి మెలిసి ఉన్నారు. నీతి ఆయోగ్ కార్యక్రమానికి హాజరై రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై అడుగుతారని అందరూ అనుకున్నాం. రాష్ట్రానికి రావలసిన నిధులపై సమావేశంలో నిలదీయవచ్చు కదా?మరోసారి కేసీఆర్ మోడీ చీకటి ఒప్పందం బయటపడింది.
నీతి ఆయోగ్ రాష్ట్రనికి అనేక ప్రాజెక్టులకు నిధులు రావాలని గతంలో చెప్పింది. రాష్ట్రానికి రావాల్సిన నిధులపై సమావేశంలో పాల్గొని మోడీ నిలదీయండి. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో పేర్కొన్న అన్ని అంశాలపై డిమాండ్ చేయండి. మిషన్ భగీరథ ఇతర పథకాలలో రావాల్సిన నిధులపై సమావేశానికి
హాజరై మోడీని నిలదీయండి. మీరు నీతిఅయోగ్ సమావేశానికి హాజరు కాకపోతే మీరు మోదీకి సపోర్ట్. గతంలో గుజరాత్లో వరదలు వస్తే ముందస్తులో భాగంగా 1000 కోట్లు మంజూరు చేశారు. కానీ రాష్ట్రంలో వర్షాలు వస్తే ఇంతవరకు ఒక్క రూపాయి కేటాయించలేదు.. రాష్ట్రంపై ప్రధాని సీత కన్ను వేశారు. ముఖ్యమంత్రి స్వయంగా కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు దుర్వినియోగం చేస్తున్నారు స్వయంగా చెప్పారు. గతంలో కేంద్ర ప్రభుత్వం ఎన్ని బిల్లులు ప్రవేశపెట్టిన టిఆర్ఎస్ పార్టీ సపోర్ట్ చేసింది.గత ఎనిమిది సంవత్సరాలుగా ప్రతిదానికి కేంద్ర ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తూ వచ్చారు.
మాటలైతే మోడీ కి వ్యతిరేకంగా ఉన్నాయి కానీ చేతులు మాత్రం అనుకూలంగా ఉన్నాయి. తెలంగాణ ప్రజలు కేసీఆర్ ను మోడీని ఒకేలా చూస్తున్నారు. గతంలో శాసనసభ సమావేశాలు 50 రోజుల పాటు జరిగేది. ముఖ్యమంత్రి కేసీఆర్ అయ్యాక అది 20 రోజుల పరిమితమైంది.విజిలెన్స్ ద్వారా ఆర్థిక నేరాలకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకునేవారు. దర్యాప్తు సంస్థలు గతంలో తప్పులు చేసిన వారిపైనే చర్య తీసుకునేవారు. ఈరోజు వాటిని అన్నింటిని విధ్వం చేసి ప్రశ్నించే వారిని వేధిస్తున్నారు. ఇంటెలిజెన్స్ గతంలో నేరాలు చేసిన వారు టెర్రరిస్టుల పైన మెగా పెట్టేవారు. కానీ ప్రస్తుతం ఈ దర్యాప్త సంస్థలను ప్రతిపక్ష నాయకులపై పెట్టారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ వినని వారిని వేధింపులకు గురి చేస్తున్నారు. కేంద్రంలో ,రాష్ట్రంలో దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తున్నారు. పోలీసు అధికారులను పార్టీ ఫిరాయింపుల కోసం వినియోగిస్తున్నారు. నరేంద్ర మోడీ కేసీఆర్ నానికి ఒకే వైపు ఉన్నారు… ఇద్దరినీ నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరు.