- గోరంట్లకు చెప్పుల దండతో స్వాగతం పలుకక, నిలువెత్తు కటౌట్లు, భారీ ర్యాలీయా?
- మహిళల మనోభావాలు దెబ్బతిన్నాయని ఆల్ పార్టీస్ ఉమెన్ లీడర్స్ నిరసన తెలిపినా స్పందన కరవు
- 75వ స్వాతంత్ర వేడుకలు జరిగే సమయంలో మహిళలకు రక్షణ కల్పించండి అని రాష్ట్ర ప్రభుత్వాన్ని అడగాల్సిన పరిస్థితి
- తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత
మహిళల మనోభావాలను కాపాడుతావా? లేక నీ ఎంపీ గోరంట్ల మాధవ్ ని కాపాడుకుంటావా? జగన్ సమాధానం చెప్పాలని తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత సూటిగా ప్రశ్నించారు. శనివారం మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ..
గోరంట్ల మాధవ్ వీడియో ఫోరెన్సిక్ రిపోర్టు తేవడం జగన్ కు చేతకాకపోవడంతో చంద్రబాబు ఆదేశాలతో మేమే తెచ్చాం, ఇప్పుడేమంటారు? 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను జరుపుకుంటున్న సమయంలో మహిళలకు రక్షణ కల్పించండి అని రాష్ట్ర ప్రభుత్వాన్ని వేడుకోవాల్సిన పరిస్థితులు వచ్చాయి. జగన్
మౌనం వీడి బయటికి వచ్చి బయటపడ్డ ఫోరెన్సిక్ రిపోర్టుపై ప్రెస్ మీట్ పెట్టాలి. ఈ రిపోర్టుపై ఏం సమాధానం చెబుతారు? ఎలా ముందుకు వెళతారు? పోర్న్ స్టార్ గోరంట్ల ఏదో సాధించినట్లుగా అనంతపురం, హిందూపూర్ లలో హోర్డింగులు? సన్మానాలా? హోర్డింగులు పెట్టినోడికి సిగ్గులేదు, పెట్టించుకున్నవాడికి బుద్దిలేదు. గోరంట్ల ఏమైనా స్వాతంత్య సమరయోధుడా? వీరుడా? పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం నుంచి నిధులు తెచ్చాడా? ఏ ఘనకార్యం చేశాడని భారీ ఏర్పాట్లు చేసి హిందూపూర్ లో సన్మానిస్తున్నారు?
గోరంట్లకు చెప్పుల దండ వేసి, చెప్పులు విసిరి స్వాగతం పలుకక, నిలువెత్తు కటౌట్లు, భారీ ర్యాలీయా? చెప్పులతో సన్మానం చేస్తేనే అతనికి తగిన శాస్తి. గోరంట్లకు సిగ్గుంటే ఇంట్లో నుంచి బయటికి రాడు. అనంతపురం ఎస్పీ ఫకీరప్ప గోరంట్ల మాధవ్ కు క్లీన్ చీట్ ఇవ్వకపోయినా నేను కడిగిన ముత్యాన్ని, పునీతుడినయ్యానని చెప్పుకు తిరుగుతున్నారు. ఆల్ పార్టీస్ ఉమెన్ లీడర్స్ అందరూ రోడ్డుపైకి వచ్చి నిరసన తెలుపుతున్నా ప్రభుత్వంలో స్పందన లేదు. గోరంట్ల స్పందించకుండా నోరుమూసుకొని కూర్చొని వున్నా బాగుండేది. గోరంట్ల మాధవ్ పైకి కోటు, బూటు, సూటు వేయడంతో ప్రొఫెషనర్ అనుకుంటున్నారు. లోపలి ఒరిజనాలిటీని తెలుసుకోలేకపోయారు. వైసీపీ నాయకులకు బూతులు మాట్లాడటం వారి మాతృభాషలా మారింది. వైసీపీ నాయకులకు బూతులు మాట్లాడడం తప్ప మంచిగా మాట్లాడటం చేతకాదు. గోరంట్ల తన నోరు అదుపులో పెట్టుకోవాలి. తప్పు చేసి బుకాయించడమేంటి? గోరంట్ల మాధవ్ వీడియో ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపాము రిపోర్టు రాగానే చర్యలు తీసుకుంటామని చెప్పిన రోజా, సజ్జల ఏమయ్యారు? ఇంతవరకు గోరంట్లను రక్షిస్తూ వచ్చింది చాలించాలి.
అవంతి, అంబటిపై ఆరోజే చర్యలు తీసుకొనివుంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేదికాదు. పిన్నమ్మ తాడు తెంచిన జగన్ రెడ్డి మనకు మద్దతు ఇవ్వకపోతాడా అని ధైర్యంతో గోరంట్ల మాధవ్ లాంటివారు, వైసీపీ కామాంధులు ఆలోచిస్తున్నారు. దొరికిపోయిన తర్వాత కూడా ఎంపీని రక్షించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఆంబోతుల్లా రోడ్లమీద మహిళలపై తెగబడుతున్నా జగన్ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తూ బటన్ లు నొక్కుకుంటూ కూర్చున్నాడు. మహిళల మనోభావాలు దెబ్బతినకుండా చూసుకుంటారో, మీ ఎంపీని రక్షించుకోవాలనుకుంటున్నావో తెలపాలి. గోరంట్ల మాధవ్ చేసిన గలీజ్ పనికి మహిళలంతా సిగ్గుపడాల్సి వస్తోంది. చేసిన తప్పును ఒప్పుకో.. అంతేకానీ నేను ఆణి ముత్యాన్ని అయ్యానని మాత్రం చెప్పకుంటూ తిరగొద్దు. గోరంట్ల మాధవ్ చేసిన పనికి అతను మనిషి అయితే సిగ్గుపడాలి.. పశువు అయితే రోడ్డు మీద పడాలి. నేర చరిత్ర కలిగిన గోరంట్లకు ఎంపీ టికెట్ ఇచ్చి ప్రోత్సహించాడు అంటే జగన్ ఎలాంటి వాడో అర్థమవుతుందని తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత తెలిపారు.