Suryaa.co.in

Features

ఉద్యమమే ఊపిరిగా..!

గళం విప్పితే గర్జనే..
పిడికిలి బిగిస్తే పిడుగే..
మండే నిప్పు కణిక
నడిచే అగ్నిగోళం…
పోరాటమే పథం..
దీనాజనోద్ధరణే శపథం..
ఉద్యమాల రౌతు…
మన గౌతు…
లక్ష లక్షణాల లచ్చన్న..
వ్యవస్థల ప్రక్షాళనే నీ దీక్షన్నా!

సువిశాల భారతావనిలో
ఇద్దరే సర్దార్లు..
గుజరాత్ నుంచి తెల్లదొరల
గడగడలాడించిన పటేల్..
కళింగసీమ కొదమసింహం
లచ్చన్న పేరెత్తితేనే
దుష్టపాలకుల
గుండె గుభేల్..
పేరుకు ముందు సర్దార్..
నిరంకుశ విధానాల పాలి ఖబడ్దార్..!

పాలకులపై తిరుగుబాటుకు ఉద్యమమే
లచ్చన్న మాధ్యమం..
ఆమాత్య పదవినీ
చెయ్యలేదు లెక్క..
రాజీ పడకే రాజీనామాలు..
దౌర్జన్యాలకు నిరసనగా
పంచనామాలు!

విప్లవం నేర్పని విద్య..
అనుకున్నాడేమో మిధ్యని..
నేర్చుకున్న నాలుగక్షరాలే
పోరాట లక్షణాలై..
ప్రసంగాల అక్షరలక్షలై..
మాటే తూటాగా
దేశాన్ని ఉర్రూతలూగించిన
సీమ సింహం..
గర్జనే అహరహం..!

ఓ సర్దార్ గౌతులచ్చన్నా..
ఆధునిక భారతంలో
నీది కర్ణుని కథ..
ధర్మజుని వ్యధ..
భీముని క్రోధ..
భీష్ముని బాధ..
కృష్ణుడి గాథ..
ఇన్ని గొప్ప లక్షణాలున్న
నిన్ను కని..గని..
మురిసింది వసుధ!!

ఎలిశెట్టి సురేష్ కుమార్
విజయనగరం
9948546286

LEAVE A RESPONSE