ఆయన..
భారతీయ రాజకీయాల్లో
సిసలైన సదాచారి..
జీవితంలో నిజమైన
ఘోటక బ్రహ్మచారి..
కలల విహారి..
కవితల బెహారి..
విధి నిర్వహణలో కర్మచారి..
పేరు అటల్ బిహారి..!
బిజెపికి వీరసిపాయి
ఈ వాజపేయి..
నిష్కల్మష చిరునగవుల
చిన్న పాపాయి..
చేయి కలిపె
లాల్ కిషన్
కమలం అందలమే మిషన్..
రెండు చేతులూ కలిసి రెండు సీట్ల పార్టీకి తెచ్చాయి పవర్
అంతదనుక ఎదురేలేని
కాంగిరేసుకు ఓటమి ఫీవర్
వీడిపోని ఫియర్..!
అయిదేళ్లు అధికారంలో సాగిన తొలి
కాంగ్రెసేతర ప్రధాని
బహువిధ నిర్ణయాల అవధాని
అవినీతి అక్రమాల రాజకీయ బురద గుంటలో
వాడిపోని స్వర్ణ”కమలం”..
తన చతురతతో
ఎన్నో సమస్యలను తీర్చిన జాదూమలాం..
అభిమానానికి గులాం..
అందుకే జాతి మొత్తం పార్టీలకు అతీతంగా
ఆ మనిషికి
చేయెత్తి చేస్తుంది సలాం..!
వాజపేయి గుణం అపరంజి
దేశానికి ఆయన
ఇచ్చిన నజరానా
స్వర్ణచతుర్భుజి…
ఇంత పెద్ద దేశాన్ని ఏకత్రాటిపై
నడిపిస్తున్న
మహా పధాంభుజి..
అటల్ కలల తోటలో విరబూసిన విరజాజి..!
నాటికి నేటికి ఏనాటికి
చెరగని కీర్తి ఓ వాజపేయీ..
నీ వర్ధంతి రోజున
మా వందనాలు అందుకోవోయి..
నువ్వు చూపిన దారిలో
మేము సాగుతాము కలిపి చేయి చేయి..!
సురేష్ కుమార్ ఎలిశెట్టి
9948546286