– సంజయ్ పాదయాత్రను అడ్డుకోవడం దుర్మార్గం
– గవర్నర్ తమిళసైకి బీజేపీ ఫిర్యాదు
బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ప్రజా సంగ్రామ యాత్రకు అనుమతిచ్చి, తగిన భద్రత కల్పించేలా రాష్ట్ర డీజీపీని ఆదేశించాలని కోరుతూ రాష్ట్ర గవర్నర్ డా. తమిళిసై సౌందరరాజన్ కు వినతిపత్రం సమర్పించిన బిజెపి తెలంగాణ ప్రతినిధి బృందం.
ప్రజా సంగ్రామ యాత్రను కొనసాగించేందుకు అనుమతించాలని, భద్రత కల్పించాలని రాష్ట్ర పోలీసులకు ఆదేశించాలి. నిన్న (ఆగస్టు 22న) హైదరాబాద్లో బిజెపి కార్యకర్తలపై పోలీసులు, టీఆర్ఎస్ కార్యకర్తలు
జరిపిన దాడిపై విచారణ జరిపించాలి. ఈ రోజు జనగాంలో ప్రజా సంగ్రామ యాత్రపై దాడికి కుట్ర పన్నిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు చేపట్టిన ఘటనపై విచారణ జరిపించాలి.
బిజెపి రాష్ట్ర అధ్యక్షులుబండి సంజయ్ కుమార్ అక్రమ అరెస్టు, యాత్ర అడ్డగింతకు దారితీసిన పరిస్థితులపై సమగ్ర విచారణ జరిపించాలి.టీఆర్ఎస్ అవినీతి, ప్రజా వ్యతిరేక విధానాలపై యాత్ర చేస్తున్న బిజెపి కార్యకర్తలను టీఆర్ఎస్ రెచ్చగొట్టేందుకు ఎంతలా ప్రయత్నించినా, బిజెపి కార్యకర్తలు సంయమనం పాటించారు. రెండో విడత యాత్రలో గద్వాల్ జిల్లాలో టీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేసినా పోలీసులు మౌన ప్రేక్షకులుగా ఉండిపోయారు. టీఆర్ఎస్ కంచుకోటలుగా భావిస్తున్న ప్రాంతాల్లో యాత్రకు అపూర్వ స్పందన వస్తుండడంతో ఏదో ఒక సాకుతో యాత్రను అడ్డుకునేందుకు టీఆర్ఎస్ కుట్ర పన్నుతోంది.
జనగాం జిల్లా దేవరుప్పల గ్రామంలో యాత్రపై దాడి జరిగినా పోలీసులు మౌన ప్రేక్షకులుగా ఉండిపోయారు, దుండగులకు మద్దతుగా నిలిచారు.లిక్కర్ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కవిత ఇంటి ముందు ధర్నా చేసిన బిజెపి కార్యకర్తలపై టీఆర్ఎస్ గూండాల దాడిలో పలువురు బిజెపి కార్యకర్తలకు గాయాలయ్యాయి. తప్పుడు కేసుల్లో 26 మంది బిజెపి నేతలపై జ్యుడీషియల్ కస్టడీ విధించారు. యాత్రపై దాడి చేసేందుకు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు 4 నుంచి 5 వేల మందిని సమీకరించినట్టు సమాచారం ఉంది.
యాత్రకు వస్తున్న బిజెపి కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. యాత్రపై దాడి చేయాలని సీఎంఓ నుంచే ఆదేశాలు వెళ్లినట్లు మాకు సమాచారం అందింది.యాత్రకు రక్షణ కల్పించడం పోలీసుల విధి, కానీ అధికార పార్టీ ఒత్తిళ్లకు తలొగ్గి, శాంతిభద్రతలను సాకుగా చూపి, యాత్రను అడ్డుకోవడం సిగ్గుచేటు.