Suryaa.co.in

Telangana

లిక్కర్ స్కామ్ పై ఇప్పటివరకు కేసీఆర్ ఎందుకు స్పందించలేదు?

– ప్రజా సంగ్రామ యాత్ర పై దాడి చేయడం సిగ్గు చేటు
– ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు
లిక్కర్ స్కామ్ నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే… మాపై దాడులు
– ఎన్ని నిర్బంధాలు చేసినా బీజేపీ కార్యకర్తలు భయపడరు
– బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమ

ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు ఏమన్నారంటే.. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత ప్రమేయం ఉందని వార్తలు వచ్చాయి.ప్రజల దృష్టిని మళ్లించేందుకే… పాదయాత్రను అడ్డుకుంటున్నారు.లిక్కర్ స్కామ్ పై ఇప్పటివరకు కేసీఆర్ ఎందుకు స్పందించలేదు… ఎందుకు ఖండించలేదు? లిక్కర్ స్కాంపై కెసిఆర్ స్పందించాలని డిమాండ్ చేస్తున్నాం. ప్రజా సంగ్రామ యాత్ర పై దాడి చేయడం సిగ్గు చేటు. రానున్న ఎన్నికల వరకు ప్రజా సంగ్రామ యాత్ర కచ్చితంగా జరుగుతుంది. ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వకపోయినా…. కోర్టు ద్వారా పర్మిషన్ తీసుకుని అయినా… ప్రజా సంగ్రామ యాత్ర జరిపి తీరుతాం. తెలంగాణలో అందరినీ మోసం చేసిన చరిత్ర సీఎం కేసీఆర్ దే. బాసర త్రిబుల్ ఐటీ లో నిన్న విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. విద్యార్థులకు కూడా తీవ్ర అన్యాయం చేస్తున్నారు.

కవిత భాగస్వామ్యంతో పాటు ఆమె పాత్ర కూడా: బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమ
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత ప్రమేయము ఉందని వార్తలు వచ్చాయి. కేసీఆర్ కూతురు కవిత భాగస్వామ్యంతో పాటు ఆమె పాత్ర కూడా ఉందనే వార్తలు వస్తున్నాయి.ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత ప్రమేయం ఉందనే కారణంతోనే…. మా పాదయాత్రను అడ్డుకున్నారు.దేశవ్యాప్తంగా ఈ వార్త కేసీఆర్ కుటుంబ ప్రతిష్ట దిగజారుస్తుందనే… లిక్కర్ స్కామ్ నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే… మాపై దాడులు చేస్తున్నారు.అందులో భాగంగానే బీజేపీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి, అరెస్టు చేయించారు.
గంటసేపు శాంతియుతంగా దీక్ష చేస్తున్న మా రాష్ట్ర అధ్యక్షుడిని నిన్న అక్రమంగా అరెస్టు చేసి కరీంనగర్ కి తీసుకు వచ్చారు.బండి సంజయ్ ని గృహనిర్బంధం చేసిన… తన నివాసంలోనే ఈరోజు నిరసన దీక్ష చేస్తున్నాం.అధికార పార్టీ ఎన్ని దాడులు చేసినా… ఎన్ని నిర్బంధాలు చేసినా… బీజేపీ కార్యకర్తలు భయపడరు. ప్రభుత్వం ఎన్ని ఆటంకాలు సృష్టించినా… శాంతియుతంగా ప్రజా సంగ్రామ యాత్రను ముందుకు తీసుకెళ్తాం

టిఆర్ఎస్ పార్టీ అడ్డుకుంటోంది: కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు కృష్ణారెడ్డి
ప్రజా సంగ్రామ యాత్రతో కెసిఆర్ కుటుంబం పునాదులు కదులుతున్నాయి.బండి సంజయ్ పాదయాత్రను చూసి ఓర్వలేకే… టిఆర్ఎస్ పార్టీ అడ్డుకుంటోంది.ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత పై వచ్చిన ఆరోపణల నుంచి ప్రజల దృష్టిని మళ్ళించేందుకే… ప్రజా సంగ్రామ యాత్ర ను అడ్డుకుంటున్నారు. కేసీఆర్ పాలనకు చరమ గీతం పాడుతాం.

పోలీసులు టిఆర్ఎస్ పార్టీకి తొత్తులు : బీజేపీ నేత దాసోజు శ్రవణ్
కేసీఆర్ నియంతృత్వ పాలనకు, అరాచక దాడులకు బీజేపీ భయపడదు. కేసీఆర్ అవినీతిని ప్రశ్నిస్తూ..ప్రజా సమస్యలను తెలుసుకుంటూ… పాదయాత్రగా వెళ్తున్న బండి సంజయ్ ని అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. కేసీఆర్ రాజ్యాంగ స్పూర్తిని, ప్రజాస్వామ్య స్ఫూర్తిని దెబ్బ తీస్తున్నాడు.
బండి సంజయ్ అరెస్టు వెనుక రెండు కుట్రలు దాగి ఉన్నాయి
1. బండి సంజయ్ ఎక్కడికి వెళ్లినా… ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు
2. పాదయాత్రలో ప్రజా సమస్యలు అన్నీ బయటికి వస్తున్నాయి
లిక్కర్ స్కామ్ లో విచ్చలవిడిగా దోచుకున్నారు.
ఢిల్లీ లిక్కర్ మాఫియాలో కూడా కేసీఆర్ కుటుంబం పాత్ర ఉందని వార్తలు వచ్చాయి… దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది.కెసిఆర్… పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగినట్టుగా వ్యవహరిస్తున్నాడు కెసిఆర్ అరాచకాలకు అడ్డులేకుండా పోయింది పోలీసులు పూర్తిగా టిఆర్ఎస్ పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారు మునుగోడు సభలో మోడీ పై సీఎం కేసీఆర్ పదజాలం, భాష ఎలా ఉందో… తెలంగాణ సమాజం గమనించింది. ఐటీ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అంటే టీఆర్ఎస్ నాయకులకు ఎందుకంత భయం? ఎందుకంటే దొంగ సొత్తు అంతా వాళ్ల దగ్గరే ఉంది కాబట్టి

టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని మట్టి కరిపిస్తాం. పాదయాత్ర ప్రముఖ్ డాక్టర్ గంగిడి మనోహర్ రెడ్డి
మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర చాలా శాంతియుతంగా జరుగుతోంది.టిఆర్ఎస్ ప్రభుత్వం ఈ ఎనిమిదేళ్లలో ఇచ్చిన హామీలను ఎందుకు నెరవేర్చలేదని ప్రశ్నిస్తే… మా పాదయాత్రను అడ్డుకుంటారా? కెసిఆర్ ప్రభుత్వం దుందుడుకు చర్యలకు పాల్పడుతోంది.ప్రశ్నించే గొంతు నొక్కే ప్రయత్నం చేస్తోంది.ప్రజా సమస్యలను తెలుసుకునేందుకే ప్రజా సంగ్రామ యాత్ర చేస్తున్నాం. మొదటి విడత పాదయాత్రను వర్షాకాలంలో చేశాం. రెండో విడత పాదయాత్రలో ఆలంపూర్లో మాపై దాడి చేసే ప్రయత్నం చేశారు మూడో విడత పాదయాత్రలో దేవరుప్పల లో కూడా మా పై దాడికి తెగబడ్డారు.

ప్రజా సంగ్రామ యాత్రకు ప్రజల నుంచి అనూహ్యమైన స్పందన వస్తోంది.ప్రజలకు బిజెపి అండగా ఉంటుందనే నమ్మకం, విశ్వాసం పాదయాత్ర ద్వారా కలిగింది.ప్రభుత్వానికి ఇంటెలిజెన్స్ నివేదికలు ద్వారా మా పాదయాత్రకు వస్తున్న స్పందన తెలుస్తోంది.అందుకే పోలీసులను అడ్డం పెట్టుకుని, టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, గూండాలతో… మా పాదయాత్రను అడ్డుకునే ప్రయత్నం చేశారు.85 రోజుల పాటు మాకు భద్రత కల్పించిన పోలీసులు… ఇప్పుడు పాదయాత్ర కు అనుమతి లేదని అంటారా?మా యాత్ర ను అడ్డుకునేందుకే …పాదయాత్ర కు అనుమతి లేదని పోలీసులతో నోటీసులు ఇప్పించారు.ప్రజల నుంచి వస్తున్న స్పందనను చూసి ఓర్వలేకనే…. మా రాష్ట్ర అధ్యక్షుడిని అక్రమంగా అరెస్టు చేశారు.

ఆదిశంకరాచార్యులు మాదిరిగానే… బండి సంజయ్ కూడా పాదయాత్ర చేస్తూ ప్రజాసమస్యలను తెలుసుకుంటున్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని మట్టి కరిపిస్తాం. ప్రజా సంగ్రామ యాత్ర ఆపే ప్రసక్తి లేదు. ఇది ఆగదు. ప్రభుత్వ దుందుడుకు చర్యలకు, దురహంకారానికి వ్యతిరేకంగానే ఈరోజు నిరసన దీక్ష చేస్తున్నాం.

LEAVE A RESPONSE