Suryaa.co.in

Telangana

ఏం ఉద్దరించడానికి బీహార్ పోతున్నడు?

-ఇక్కడి పైసలు తీసుకుపోయి బీహార్ ల పెడతరా?
-ఇంగిత జ్ఝానం లేని మూర్ఖుడు కేసీఆర్
-కేసీఆర్ కనీసం బాధితులను పరామర్శించడానికి రాలేదు
-కేసీఆర్ సర్కార్ చేసిన హత్యలే
-ఆపరేషన్ చేసేటప్పుడు కనీసం మత్తు ఇంజక్షన్ ఇయ్యలేదు
-ఇబ్రహీంపట్నం బాధితులను పరామర్శించిన బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్

ఈనెల 25న ఇబ్రహీంపట్నంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో మొత్తం 34 మందికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు జరిగినయ్. దురదృష్టవశాత్తు 4 గురు చనిపోయారు. మరో 30 మంది ఆసుపత్రుల్లో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుండటం బాధాకరం. ఈ ఆపరేషన్ (ల్యాప్రోస్కోపిక్) అనేది చాలా చిన్నది. 5 నిమిషాల్లోపు జరిగే ఆపరేషన్ కు 4 గురు చనిపోవడంతోపాటు మిగిలిన వారందరికీ ఇన్ఫెక్షనై ఆసుపత్రిలో చికిత్స పొందడమనేది పెద్ద ఘటన.

కేసీఆర్ ప్రభుత్వ ఘోర వైఫల్యానికి నిదర్శనం. ఇంకా చెప్పాలంటే కేసీఆర్ సర్కార్ చేసిన హత్యలే. ఆసుపత్రికి వెళితే చికిత్స పొందుతున్న బాలింతలు ఏడుస్తున్నరు. వాళ్లందరికీ చిన్న చిన్న పిల్లలున్నరు. వాళ్ల భవిష్యత్తేంది? ‘‘ఆపరేషన్ చేసేటప్పుడు కనీసం మత్తు ఇంజక్షన్ ఇయ్యలేదు.. సర్జరీ చేస్తుంటే ఏడ్చినం.. ఆపరేషన్ అయినంక ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్నం’’అని ఏడుస్తున్నరు..

ఇంత జరుగుతున్నా సీఎం కేసీఆర్ కనీసం బాధితులను పరామర్శించడానికి రాలేదు. ఏం ఉద్దరించడానికి బీహార్ పోతున్నడు… ఇక్కడి పైసలు తీసుకుపోయి బీహార్ ల పెడతరా?… ఇంగిత జ్ఝానం లేని మూర్ఖుడు కేసీఆర్… 24 గంటలు ఎవరి కొంపలు ముంచాలనే రాజకీయాలు చేయడమే తప్ప పేదల గురించి ఆలోచనే లేని దుర్మార్గుడు కేసీఆర్. హరీష్ రావు అబద్దాల మంత్రి. ఆయన నోరు తెరిస్తే పచ్చి అబద్దాలే. మంత్రులు, టీఆర్ఎస్ నేతల పనంతా నిత్యం లిక్కర్, ల్యాండ్, డ్రగ్స్, శ్యాండ్ దందాలే. ఇంత పెద్ద ఘటన జరిగితే… ఏదో ఒక కమిటీ వేసి తూతూ మంత్రపు చర్యలు తీసుకుంటున్నారే తప్ప చేసిందేముంది?

కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు విఫలమై చనిపోయిన ఒక్కో కుటుంబానికి కోటి రూపాయల పరిహారం ఇవ్వాలి. దీంతోపాటు ఆ కుటుంబాలకు ఇండ్లు ఇవ్వాలి. పిల్లలకు విద్యకయ్యే ఖర్చును పూర్తిగా ప్రభుత్వమే భరించాలి. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులకు ఒక్కొక్కరికీ రూ.10 లక్షలివ్వాలి. రికార్డు కోసం గంటలో 34మందికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయటాన్ని ఖండిస్తున్నాను. పేదల ప్రాణాల కంటే కేసీఆర్ సర్కార్ కు పేరు ప్రఖ్యాతలే ముఖ్యం సీఎం కేసీఆర్ కు పేదల ఉసురు కచ్చితంగా కొడుతోంది. చనిపోయిన కుటుంబాలకు 5లక్షలు ఇచ్చి చేతులు దులుపుకుంటే ఒప్పుకోం. ఎనిమిదేళ్ళ కాలంలో ఒక్క పేద కుటుంబాన్ని కూడా సీఎం కేసీఆర్ పరామర్శించలేదు.

సీఎం కేసీఆర్ మనిషి కాదు.. రాక్షసుడు. బెదిరించి ఆపరేషన్లు చేశారని చికిత్స పొందుతోన్న మహిళలు. ఈ ఘటనకు బాధ్యుడైన వైద్యశాఖ మంత్రిని తక్షణమే బర్త్ రఫ్ చేయాలి. హరీష్ రావు కుటుంబ సభ్యుడు కాబట్టే ఆయనపై సీఎం చర్యలు తీసుకోవడం లేదు. ఇంత జరుగుతున్నా బాధితులను పరామర్శించేందుకు ఎందుకు రాలేదో సీఎం సమాధానం చెప్పాలి.

LEAVE A RESPONSE