-జగన్ రెడ్డి మూడేళ్ల పాలనలో ప్రజలకు ముప్పుతిప్పలు
-బాదుడు, భారాలు తప్ప బతుకులు బాగుచేసింది శూన్యం
-చెత్త పన్ను, మరుగుదొడ్ల పన్నుతో పేదల్ని పిండుతున్న నయా తుగ్లక్
-పన్నులేయడం.. పని చేయడం చేతకాని సీఎం జగన్ రెడ్డి
-బాదుడే బాదుడుపై నిమ్మల రామానాయుడు
ప్రజలపై పన్నులు వేయడం, భారాలు మోపడం తప్ప పరిపాలన తెలియని అత్యంత చెత్త ముఖ్యమంత్రిగా జగన్ రెడ్డి చరిత్రలో నిలిచిపోతారు. కౌరవ సభలో నేను ఉండను, గౌరవ సభకు ముఖ్యమంత్రిగానే అడుగుపెడతానన్న ప్రతిజ్ఞ నెరవేర్చేందుకు ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్తా కష్టబడాలి. ఎన్నికలకు ముందు ప్రజలపై ఏమాత్రం భారం వేయని విధంగా పాలిస్తానంటూ అరచేతిలో వైకుంఠం చూపించిన జగన్ రెడ్డి.. అధికారంలోకి వచ్చింది మొదలు పన్నుల బాదుడుతో ప్రజల్ని ముప్పుతిప్పలు పెడుతున్నాడు. జగన్ రెడ్డి బాదుడుపై గ్రామ స్థాయి నుండి ప్రజల్లో తిరుగుబాటు మొదలైంది. పేద, మధ్యతరగతి ప్రజలందరూ బాదుడే బాదుడు కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. అదే స్ఫూర్తితో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలూ అందిపుచ్చుకోవాలి. గ్రామ గ్రామానా బాదుడే బాదుడు కార్యక్రమం నిర్వహించాలి. ప్రతి గడపనూ తాకాలి. ప్రతి పౌరుడినీ జగన్ రెడ్డి మోసాలపై, బాదుడు కార్యక్రమాలపై చైతన్య పరచాలి.
2014లో చంద్రబాబు అధికారంలోకి వచ్చే నాటికి లోటు బడ్జెట్, లోటు విద్యుత్ కలిగిన రాష్ట్రాన్ని మూడేళ్లలోనే మిగులు విద్యుత్ సాధించాం. 2019 నాటికి మిగులు విద్యుత్ కలిగిన రాష్ట్రాన్ని జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఏడు సార్లు విద్యుత్ బిల్లులు పెంచి సామాన్యుడిపై రూ.19500 కోట్ల భారం వేశారు. పవర్ కార్పొరేషన్ ద్వారా రూ.26,260 కోట్ల అప్పు తెచ్చి మొత్తంగా రూ.45,765 కోట్ల విద్యుత్ భారం వేశారు.
ఆక్వా రంగాన్ని జగన్ రెడ్డి నాశనం చేశారు. విద్యుత్ సబ్సిడీలు ఆక్వాకు నిలిపివేశారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టి ఉచిత విద్యుత్ కు మంగళం పాడేందుకు సిద్ధమయ్యారు. పెట్రోల్ డీజిల్ ధరలపై బాదుడు సరేసరి. పెట్రోల్ పై వ్యాట్ 31.5 శాతం నుండి 35కి పెంచారు. డీజిల్ పై వ్యాట్ 22.5 శాతం నుండి 27శాతానికి పెంచారు. వ్యాట్ పేరుతో రూ.4, సెస్ పేరుతో రూపాయి బాదుతున్నారు. పెట్రోల్ డీజిల్ పై కేంద్రం రూ.11 వరకు తగ్గిస్తే దేశంలో 23 రాష్ట్రాలు వ్యాట్ తగ్గించింది. కానీ జగన్ రెడ్డి రూపాయి కూడా తగ్గించకుండా దేశంలోనే అధిక ధరలుగల రాష్ట్రంగా మార్చారు. ఇక వంట గ్యాస్ వినియోగం అంటనే భయపడే పరిస్థితి కల్పించారు. మహిళల కళ్ల నుండి పొగ వల్ల నీళ్లు రాకూడదని దీపం పథకం తీసుకొచ్చి ఉచిత కనెక్షన్లు ఇచ్చాం. ఇప్పుడు మళ్లీ కట్టెల పొయ్యిల వైపు రాష్ట్రాన్ని జగన్ రెడ్డి నడిపిస్తున్నారు. గ్యాస్ ధర రూ.1200 అయ్యింది.
ఇసుక అక్రమాలను నిలువరించడం కోసం చంద్రబాబు నాయుడు ఉచిత ఇసుక విధానం తీసుకొచ్చారు. జగన్ రెడ్డి ఉచిత ఇసుకను ఎత్తేసి విజయసాయి రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, వై.వి.సుబ్బారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చే తుల్లో ఇసుక పెట్టి జేపీ వెంచర్స్ పేరుతో మూడేళ్లలో రూ.15వేల కోట్లకు పైగా దోచేశాడు. సిమెంట్ సిండికేట్, ఐరన్ దోపిడీ గురించి మాట్లాడాలంటేనే భయం. భారతి సిమెంట్ కోసం బస్తాను రూ.450 చేశారు. రూ.30వేలు ఉన్న టన్ను ఇనుము ఈ రోజు 80 వేలకు చేరింది. పేదలు ఇళ్లు కట్టుకోవాలంటేనే వణికిపోతున్నారు.
పేదల రవాణా సాధనమైన ఆర్టీసీ ఛార్జీలు మూడు సార్లు పెంచి రూ.5000 కోట్లు ప్రజల నుండి పిండుకున్నారు. రిజిస్ట్రేషన్ ఛార్జీలు 50-100శాతం పెంచారు. ఇలాంటి సలహాలు ఎవరిస్తున్నారో అర్ధం కావడం లేదు. ఇంపాక్ట్ ఛార్జీల పేరుతో 60 అడుగులు, 100 అడుగుల రోడ్డు వెంబడి ఉండే భవనాలపై కొత్త రకమైన బాదుడుకు సిద్ధమయ్యారు. అప్పుడెప్పుడో 30 సంవత్సరాల క్రితం నిర్మించుకున్న ఇళ్లకు ఇప్పుడు ఓటీఎస్ వసూల్ చేస్తున్నారు.
వంటింటి పోపు సరుకులు కూడా కొనుక్కోలేని పరిస్థితులు జగన్ రెడ్డి కల్పించారు. ధరలు అమాంతం పెరిగిపోయినా ధరల నియంత్రణ ఏమైంది? గోదావరి జిల్లాల్లో కొన్ని దశాబ్దాల తర్వాత క్రాప్ హాలిడే ప్రకటించే పరిస్థితి కల్పించారు. నీటు తీరువా పన్నుపై చక్రవడ్డీలు వసూల్ చేయడానిక రైతులపై బెదిరింపులకు దిగారు.
మద్యం మాఫియా గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. గతంలో రూ.60కూడా లేని క్వార్టర్ మద్యాన్ని మూడు నాలుగు రెట్లు పెంచి ఏటా రూ.10వేల కోట్లకు పైగా దోచేస్తున్నారు. మద్యం కార్పొరేషన్ ను బూచిగా చూపి సుమారు 25వేల కోట్లు దోచేశారు. మొత్తంగా సుమారు రూ.40 వేల కోట్లు జేబుల్లో వేసుకున్నారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా చెత్త పన్ను, మరుగుదొడ్ల పన్ను వేస్తున్నారు. ఈ పన్నులపై ప్రజల్లో వ్యతిరేకత కనిపిస్తున్నా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. ప్రజలే చెబుతున్నారు పావలా ఇచ్చి పది రూపాయలు లాక్కుంటున్నారని.
ఈ మధ్యనే శ్రీలంకలో చూశాం. ఒక్కో కుటుంబంపై అక్కడ లక్ష కన్నా తక్కువ భారం ఉన్నప్పటికీ దేశం ఆర్ధిక సంక్షోభంలో కూరుకుపోయింది. కానీ ఏపీలో ఒక్కో వ్యక్తిపై రూ.2 లక్షల వరకు భారం ఉంది. ప్రతి ఒక్కరూ బాదుడే బాదుడు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. ప్రతి గడపనూ టచ్ చేయాలి. నియోజకవర్గంలోని ప్రి ఒక్కరితో మాట్లాడితే.. విజయం మనదే.
బాదుడే బాదుడు కార్యక్రమంలో ప్రతి ఇంటికి వెళ్లే సమయంలో.. అమలు చేసిన సంక్షేమ పథకాలను, చేసిన అభివృద్ధిని కూడా గడపగడపలో ప్రజలకు తెలియజేయాలి. ఐదేళ్ల పాలనలో అమలు చేసిన పెళ్ల కానుకలు, సబ్సిడీ రుణాలు, ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనార్టీలకు అందించిన లబ్ది, ఇచ్చిన ఉద్యోగ ఉపాధి అవకాశాలపై వివరించాలి.
నవరత్నాల పేరుతో హడావుడి చేయడం, డబ్బులు పంచడం తప్ప ఇంకేమైనా ఉందా? ఒకవైపు నవరత్నాల పేరుతో డబ్బులు పంచడం, ఆర్టీసీ ఛార్జీలు, పెట్రోల్ డీజిల్ దరలు, పన్నులతో ఇచ్చిన సొమ్ముకు పది రెట్ల చొప్పున ప్రజల నుండి లాక్కుంటున్నారు. ఆకలి బాధ అనేదే లేకుండా అన్న క్యాంటీన్లు పెడితే వాటిని రద్దు చేసిన జగన్ రెడ్డి పేదలను ఉద్దరిస్తాడా.? అంబేద్కర్ రాజ్యాంగాన్ని ఏ రోజు కూడా జగన్ రెడ్డి అనుసరించింది లేదు. అధికారంలోకి వచ్చిన నాటి నుండి రాజారెడ్డి రాజ్యాంగంతో ప్రజల్ని పీల్చి పిప్పి చేయడం తప్ప చేసిందేమీ లేదు.
చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ..
అక్టోబర్ నాటికి అన్ని నియోజకవర్గాల్లో, అన్ని గ్రామాల్లో 100 శాతం బాదుడే బాదుడు కార్యక్రమం పూర్తి చేయాలి. గ్రామ కమిటీలు ఈ కార్యక్రమ నిర్వహణలో పూర్తిగా నిమఘ్నులవ్వాలి. గ్రామాలకు వచ్చే నియోజకవర్గ ఇంఛార్జికి సహకరించాలి.