ప్రముఖ జర్నలిస్ట్ రవిప్రకాష్ పేరు చెబితే ముందుగా టీవీ9 గుర్తుకొస్తుంది. టీవీ9 అంటే రవిప్రకాష్, రవిప్రకాష్ అంటేనే టీవీ9 అలా టీవీ9 న్యూస్ ఛానల్ని తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశవ్యాప్తంగా పాపులర్ చేసిన ఘనుడు రవిప్రకాష్.
కొన్ని అంతర్గత రాజకీయాల కారణంగా రవిప్రకాష్, ఆ ఛానల్ నుంచి బయటకు వచ్చేయక తప్పలేదు. జర్నలిస్ట్ నుంచి సీఈఓ స్థాయికి ఎదిగారాయన ఆ న్యూస్ ఛానల్లో. ఆ తర్వాత రవిప్రకాష్ ఏం చేస్తున్నారు.? అన్నదానిపై భిన్న వాదనలున్నాయి.
సరైన వేదిక కోసం ఆయన ఎదురుచూస్తూ వచ్చారు. ఆ సమయం రానే వచ్చిందట. ప్రముఖ పారిశ్రామిక కుటుంబం అంబానీ ఓ న్యూస్ నెట్వర్క్ని ప్రారంభించనుంది. అది కూడా తెలుగు రాష్ట్రాల్లో. దీనికి రవిప్రకాష్ సారధ్యం వహిస్తారట.
పనులు ప్రారంభమయ్యాయ్.. ఇప్పటికే ఓ వెబ్సైట్ సంబంధిత వ్యవహారాల్ని, అలాగే కొన్ని న్యూస్ ఛానళ్ళ వ్యవహారాల్ని తెరవెనుకాల చక్కబెడుతున్న రవిప్రకాష్, త్వరలోనే అధికారిక ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. వెబ్సైట్ని ప్రముఖ పత్రికగా మార్చే ప్రయత్నంలో వున్నారట. అన్నీ అనుకున్నట్టు జరిగితే రెండు మూడు నెలల్లోనే రవిప్రకాష్ రీ-ఎంట్రీ జరుగుతుందని తెలుస్తోంది.
అంబానీ గ్రూప్ అంటే, బీజేపీకి మద్దతుగా వుంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగు రాష్ట్రాల్లో అధికార పీఠమే లక్ష్యంగా పనిచేస్తోన్న బీజేపీ, అందుకు తగ్గట్టుగా అంబానీ గ్రూప్ ద్వారా ఈ మీడియా సంస్థని జనంలోకి తీసుకెళ్ళబోతోందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. యాంటీ టీఆర్ఎస్ అన్నట్లుగా పనిచేస్తోన్న ఆ వెబ్ సైట్.. ఆ వ్యవహారాల్నిటినీ ఇప్పటికే రవిప్రకాష్ చూసుకుంటున్నారు.