ఉత్తరాంధ్ర వేదికగా విశాఖపట్నంలో మహాత్మ జ్యోతిరావు పూలే విగ్రహాన్ని 125 అడుగుల ఎత్తులో ఏర్పాటు చేయాలి
బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ప్రముఖ సంఘ సంస్కర్త మూఢాచారాలను సమాజం నుండి పారదోలి భారత సమాజానికి వెలుగును ప్రసాదించిన మహా జ్యోతి మహాత్మ జ్యోతిరావు పూలే. పూలే ఆశయాలను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలన్నా.. పూలే జీవిత చరిత్ర రాబోయే తరాలు ఆదర్శం కావాలన్నా ఉత్తరాంధ్ర వేదికగా రాష్ట్ర పరిపాలన రాజధాని అయిన విశాఖపట్నంలో మహాత్మ జ్యోతిరావు పూలే విగ్రహాన్ని నెలకొల్పాలని ఆంధ్రప్రదేశ్ బీసీ సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర విద్యాశాఖ మాత్యులు బొత్స సత్యనారాయణని కలిసి వినతి పత్రం సమర్పించడం జరిగింది.
ఈ సందర్భంగా బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఎన్ మారేష్ మాట్లాడుతూ జనాభాలో 70% బీసీలు ఉన్న ఉత్తరాంధ్రలో మహాత్మ జ్యోతిరావు పూలే విగ్రహాన్ని నెలకొల్పడం ద్వారా బీసీలు ఐక్యతకు పునాది పడుతుందని బీసీల ఆత్మగౌరవం పరిరక్షించబడుతుందని, కావున రాష్ట్ర విద్యాశాఖ మాత్యులు బొత్స సత్యనారాయణ బాధ్యత తీసుకొని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో చర్చలు జరిపి విగ్రహ స్థాపనకు కృషి చేయాలని కోరుతున్నాం.
ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు
1. జక్క శ్రీనివాసరావు (జాతీయ బీసీ సంక్షేమ సంఘం ప్రచార కమిటీ చైర్మన్)
2. వేముల బేబీ రాణి (రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు)
2. కాగిత అజయ్ (రాష్ట్ర ప్రధాన కార్యదర్శి)
3తమ్మిశెట్టి రాము (రాష్ట్ర ఉపాధ్యక్షులు)
4. కరుణ అశోక్ కుమార్ (ఎన్టీఆర్ జిల్లా యువజన విభాగం అధ్యక్షులు)
5. నల్లమోతు మధు
6. మర్రి ప్రవీణ్