– కర్ఫ్యూపెట్టి పర్యటనకు వెళుతున్నావ్
– అమరావతికి బీజేపీ మద్దతు
– అమిత్‌షా చెప్పిందీ అదే
– సీఎం జగన్‌పై బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ వ్యంగ్యాస్త్రం
“అమరావతి: వివాదాలు – వాస్తవాలు” పుస్తకావిష్కరణ సభలో బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు , జాతీయ కార్యవర్గ సభ్యుడు కన్నా లక్ష్మీనారాయణ ఏమన్నారంటే.. ప్రభుత్వాన్ని నమ్మి 33 వేల ఎకరాల భూమి రైతులు ఇచ్చారు. ప్రధాని స్వయంగా వచ్చి శంకుస్థాపన చేశారు. 2019 లో రాజదాని ఇక్కడే ఉంచుతాను అని చెప్పారు. అధికారం లోకి వచ్చారు. ఒక నియంత రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యే రివర్స్ టెండర్ ల తో మొదలై రివర్స్ పాలన చేస్తున్నాడు.
జగన్ మోహన్ రెడ్డి ప్రైవేట్ కంపెనీ వారు తప్ప ఎవ్వరూ 3 పూటలా భోజనం చేయడానికి లేదు.రాష్ట్రం లో ఎక్కడికి పోయిన కర్ఫ్యూ పెట్టుకొని సీఎం వెళుతున్నాడు. జగన్ ఎంత భయపడుతున్నారో ఇది చూస్తే అర్దం అవుతుంది. 3 సంవత్సరాల తరువాత నువ్వే ప్రజల్లోకి వెళ్లలేవు. కానీ నీ ఎమ్మెల్యే లు ఎలా వెళతారు? అమిత్ షా తిరుపతి లో అమరావతికి అండగా నిలవాలి అని చెప్పారు. 3 రాజధానులు అన్న తర్వాత ఒక రాజకీయ తీర్మానం చేశాం. గత పాదయాత్ర కు మద్దతు ఇచ్చాము. పాల్గొన్నాం. భవిష్యత్తులో జరిగే యాత్రలో పాల్గొంటాం. అమరావతి ఉద్యమంపై మరో పుస్తకం రాయాలని రచయితను కోరుతున్నాం.