తెలంగాణ కలవకపోయి ఉంటే ..ఆంధ్ర రాష్ట్రానికి విశాఖ అయ్యేది

– 1953 లో రాష్ట్రం కోసం రాజధాని వదులుకున్నారు
– ఇప్పుడు విభజన వద్దనుకుని రాజధాని వదులుకోవాల్సి వచ్చింది.
– “అమరావతి: వివాదాలు – వాస్తవాలు” పుస్తకావిష్కరణ సభలో పుస్తక రచయిత , – సీనియర్‌ జర్నలి స్ట్ కందుల రమేష్ కందుల రమేష్

kandulaఆంధ్ర రాష్ట్రం ఏర్పడ్డ సమయంలో ఇలాంటి రాజకీయాలే అప్పుడు జరిగాయి.. ఆ తరువాత కూడా కర్నూల్ అసెంబ్లీలో విశాఖ రాజధాని అని తీర్మానం చేశారు. చాలా మందికి ఇది తెలియదు. తెలంగాణ కలవక పోయి వుంటే, ఆంధ్ర రాష్ట్రానికి విశాఖ అయ్యేది.కర్నూల్ కు రాజదాని తాత్కాలికం అని ముందుగా చెప్పారు.కే మాథ్యూస్ మొదటి ఛాయిస్ గా గుంటూరు రాజధాని అన్నారు.1953 లో కమ్యూనిస్టులు గుంటూరు విజయవాడ మధ్యలో లో రాజధాని ఉండాలి అని, పుచ్చలపల్లి సుందరయ్య అన్నారు.ఆ రోజు కూడా ఇక్కడ రాజధాని రాకుండా చేయడానికి , విశాఖ ను తెరమీదకు తెచ్చారు.

ఎందుకు అమరావతి ని ఇంత పెద్ద రాజధాని గా నిర్మించాలనుకున్నారు. మహానగరాలు లేకుండా, ఎక్కడ ఏ రాష్ట్రం లో అభివృద్ధి లేదు. 1953 లో రాష్ట్రం కోసం రాజధాని వదులుకున్నారు. ఇప్పుడు విభజన వద్దనుకుని రాజధాని వదులుకోవాల్సి వచ్చింది. శివరామ కృష్ణా కమిటీ చారిత్రక స్పృహ లేకుండా మాట్లాడారు.

Leave a Reply