Suryaa.co.in

Telangana

దేశానికే ఆదర్శంగా తెలంగాణ

-అన్ని రంగాల్లో అప్రతిహత ప్రగతి
-మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుని అభినందించిన మంత్రులు కేటీఆర్, సత్యవతి రాథోడ్
-భవిష్యత్తులోనూ ఇదే ప్రతిభను కొనసాగించాలని ఆకాంక్ష

హైదరాబాద్: రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో ఇంటింటికీ నల్లాల ద్వారా శుద్ధి చేసిన, మంచినీటిని అందించడంలో అత్యుత్తమ ప్రతిభ కనబరచి, దానికి కొనసాగింపుగా రెగ్యులారిటీ కేటగిరీలో తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్ గా నిలవడమేగాక, స్వచ్ఛ సర్వేక్షణ దేశంలోనే అత్యుత్తమ ప్రతిభ కనబరచి దేశంలో నెంబర్ వనగ్ నిలిచి, వివిధ కేటగిరీలలో మరో 13 అవార్డులను గెలుచుకున్న సందర్భంగా రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివ్రుద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లిదయాకర్ రావుని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక, పట్టణాభివ్రుద్ధి శాఖల మంత్రి కలువ కుంట్ల తారక రామారావు అభినందించారు. శాలువాతో సత్కరించి, పూల మొక్క బహూకరించారు.

గురువారం ప్రగతి భవన్ లోని తన కార్యాలయానికి మంత్రి ఎర్రబెల్లిని పిలుపించుకుని మరీ, సత్కరించారు. ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ, కెసిఆర్ మేధో మథనం నుంచి పుట్టుకు వచ్చిన పల్లె ప్రగతి కార్యక్రమం, ఆ కార్యక్రమాన్ని కెసిఆర్ గారి ఆశయాలు, ఆలోచనలకు అనుగుణంగా పకడ్బందీగా అమలు చేస్తూ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఆయన టీమ్, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, కార్యదర్శులు, సిబ్బంది, ప్రజల భాగస్వామ్యంతో అద్భుతంగా సాధించిన ఫలితంగానే ఈ అవార్డులు రివార్డులు అని ఆయన అన్నారు.

దేశంలో మరే రాష్ట్రం సాధించన విధంగా తెలంగాణ రాష్ట్రం అందునా పంచాయతీరాజ్, గ్రామీణాభివ్రుద్ధి శాఖ సాధిస్తున్న ఫలితాలు తెలంగాణకే గాక, మొత్తం దేశానికే గర్వకారణం అన్నారు. ఈ ఫలితాలతో రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదని ప్రశంసించారు. మరింత బాధ్యతాయుతంగా పని చేసి, మరిన్ని ఆవార్డులు తేవాలని, రాష్ట్రానికి మంచి పేరు తెస్తూ, దేశానికి ఇదే విధంగా ఆదర్శంగా నిలవాలని కెటిఆర్ ఆకాంక్షించారు.ఈ సందర్భంగా రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ, గిరిజన సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ సైతం మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారిని అభినందిస్తూ సత్కరించి శుభాకాంలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్ రెడ్డి, అరూరి రమేశ్ తదితరులు ఉన్నారు.

LEAVE A RESPONSE