-కేసీఆర్ లాంటి నేత దేశానికి అవసరం
-దేశంలో ఏ సంస్థ ఈ స్థాయిలో వాటా ఇవ్వదు
-కేంద్రం కుట్రతో ప్రైవేటీకరణ
-ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, ఎమ్మెల్సీ దండే విఠల్
సింగరేణి కార్మికుల కు లాభాల్లో 30 శాతం వాటా ఇవ్వాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. సింగరేణి కార్మికుల పక్షాన సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలియ జేస్తున్నాం.2014 కు ముందుం సింగరేణి లాభాల్లో 18 శాతం ఉన్న కార్మికుల వాటా ఇప్పుడు 30 శాతం పెరిగింది. దేశంలో ఏ సంస్థ ఈ స్థాయిలో వాటా ఇవ్వదు. సీఎం కేసీఆర్ దూరదృష్టి తోనే సింగరేణి 32 వేల కోట్ల కు పైగా టర్నోవర్ సాధించనుంది.ఇతర రాష్ట్రాల కు సంస్థ విస్తరిస్తోంది.
కార్మికుల సంక్షేమంలో అత్యున్నత స్థానంలో ఉంది.9 వేల మంది కార్మికుల సర్వీసులను ను క్రమబద్దీకరణ చేసింది.కార్మికుల సొంత ఇంటి నిర్మాణానికి వడ్డీ లేని రుణం సర్కార్ ఇస్తోంది. దేశంలో కేంద్ర ఎన్నో ప్రభుత్వ రంగ సంస్థ లను నిర్వీర్యం చేస్తోంది. తెలంగాణ లో సింగరేణి దిన దిన ప్రవర్తమానంగా అభివృద్ధి చెందుతోంది. మా సీఎం తీసుకుంటున్న నిర్ణయాలు కేంద్రం ఆదర్శంగా తెలుకోవాలి. ఒక్కరిద్దరి కోసం ప్రభుత్వ సంస్థలను నిర్వీర్యం చేస్తోంది.
కేంద్రం సింగరేణి సంస్థను ప్రోత్సాహకాలు ఇవ్వకుండా ప్రైవేటీకరణ చేసే యత్నం చేస్తోంది. బీజేపీ నేతల మాటల్లోనే దేశ భక్తి….చేతల్లో ఏమీ లేదు.కేంద్రం కుట్రతో ప్రైవేటీకరణ వైపు మొగ్గుచూపుతోంది. కేంద్రం అన్ని ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేస్తోంది. బీజేపీ కి మునుగోడు లో పోటీ చేసే హక్కు లేదు. రిజర్వేషన్లు ఎత్తి వేసే కుట్ర కు బీజేపీ పాల్పడుతోంది. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో సింగరేణి లాభాల బాటలో పయనిస్తోంది. కేంద్రం ప్రభుత్వ రంగ సంస్థలను పట్టించుకోవడం లేదు.
ఆదిలాబాద్ లో సీసీఐ గురించి బీజేపీ ఎంపీ అసలు పట్టించుకోవడం లేదు.దేశానికి దశ దిశ లేకుండా పోతుంది.బీజేపీ కి దేశాన్ని బాగు చేసే తెలివి లేదు…పాలించే సమర్ధత లేదు.కేసీఆర్ లాంటి నేత దేశానికి అవసరం. బలమైన గొంతుకగా దేశ ప్రజలు కేసీఆర్ నాయకత్వాన్ని కోరుతున్నారు.