-ప్రైవేట్ కంపెనీ యజమానితో మాట్లాడి సర్టిఫికెట్ల అప్పగింతకు ఆదేశం
-సంతోషం వ్యక్తం చేసిన ఆ యువకుని కుటుంబం
మహబూబాబాద్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం, తొర్రూరు కు చెందిన అబ్బోజు ప్రమోద్ కుమార్ కు ఉద్యోగం రాగా, అతని ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇవ్వడానికి నిరాకరించిన ప్రైవేట్ కంపెనీ యాజమాన్యం తో మాట్లాడి, అతని సర్టిఫికేట్లు ఇవ్వడానికి ఒప్పించి, తన ఉదారతను చాటుకున్నారు రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు .
దయన్న అంటే, దయార్థ హృదయుడు అనే పేరుకు తగ్గట్లుగానే మంత్రి వ్యవహరించారు. తొర్రూరు కు చెందిన ప్రమోద్ చిన్నప్పటి నుంచి చదువులో చాలా బ్రైట్. ట్రిపుల్ ఐటీ బాసరలో చదివాడు. 2019 రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ పరీక్ష రాయగా, జూనియర్ ఇంజనీర్ సిగ్నల్ అండ్ టెలీ కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగం వచ్చింది. వెంటనే జాయిన్ కమ్మని ఆదేశాలు వచ్చాయి. ఈ లోగా తను పని చేస్తున్న ఓ ప్రైవేట్ కంపెనీలో ఈ విషయం చెప్పగా అతని, ఒరిజినల్ సర్టిఫికేట్లు ఇవ్వడానికి నిరాకరించారు.
2 లక్షలు జమానత్ కింద డిపాజిట్ ఉన్నప్పటికీ, ఒప్పందానికి విరుద్ధంగా మధ్యలోనే వెళ్లి పోతున్నందున కొంత డబ్బు కట్టాలని డిమాండ్ చేశారు. తన కుటుంబ ఆర్థిక స్థోమత అంతగా లేదని బతిమిలాడినా పట్టించుకోలేదు. దీంతో ప్రమోద్ తల్లి తండ్రులతో కలిసి హైదరాబాద్ లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ని కలిశారు. వెంటనే మంత్రి సంబంధిత కంపెనీ యాజమాన్యంతో మాట్లాడి ప్రమోద్ కి ఒరిజినల్ సర్టిఫికేట్లు ఇచ్చేలా ఒప్పించారు.
కాగా, మంత్రి ఔదార్యానికి ప్రమోద్ కుటుంబం కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపింది. తను తొర్రూరు లో 10 వ తరగతిలో ఉత్తమ ర్యాంకు సాధించిన సమయంలోనూ మంత్రి తనను ప్రోత్సహించారు. వారి సహకారంతో నే, స్ఫూర్తి తోనే తను ఈ ఉద్యోగం పొందానని ప్రమోద్ సంతోషంతో చెప్పాడు. తమ కుటుంబం ఎప్పటికీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కి రుణపడి ఉంటుందని.అతను అన్నాడు.