Suryaa.co.in

Editorial

ఆ బిర్యానీ తింటే సెక్స్‌పవర్ మాయం?

– ఆ బిర్యానీ తింటే ‘ఆ కోరిక’ ఇక హా‘రతి’
– శృంగార కోరికలు తగ్గుతున్నాయన్న ఫిర్యాదులొస్తున్నాయట
– శృంగార ప్రియుల ఆందోళన
– దానితో బిర్యానీ షాపులను మూసివేయించిన తృణమూల్ మాజీ మంత్రి
– బెంగాల్‌లో ఇదో బిర్యానీ లొల్లి
( మార్తి సుబ్రహ్మణ్యం)

ఏమండోయ్.. మీరేమైనా పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని కూచ్ బెహార్‌కు ఏమైనా పనిమీద వెళుతున్నారా? అయితే ఇది కచ్చితంగా మీకోసమే! మీరు అక్కడికి వెళ్లినప్పుడు రోడ్డుమీద ఉన్న బిర్యానీ షాపుల్లోకి వెళ్లి.. మాంచి మటన్ బిర్యానీయో, చికెన్ బిర్యానీయో లాగించేద్దామని అనుకుంటున్నారా? అలాచేస్తే మీhaji-biriyani
శృంగార కోరికలకు అక్కడితో ఇక ఫుల్‌స్టాప్ పడ్డట్టేనట. అక్కడ బిర్యానీ షాపుల్లో ఏ బిర్యానీ తిన్నా.. తర్వాత బెజవాడ వచ్చి డాక్టర్ సమరం గారిని సంప్రదించాల్సిందేట. అదేమిటి? బోడిగుండు-బట్టతల మాదిరిగా, బిర్యానీకి-శృంగారానికీ సంబంధం ఏమిటనుకుంటున్నారా? మరదే ఇక్కడ విశేషం.

అవునండీ.. ఇది నిఝంగా నిజమైన వార్తనే. పైగా..పశ్చిమ బెంగాల్ అధికార తృణమూల్ కాంగ్రెస్‌కుbiryani-shop చెందిన మాజీ మంత్రి, కూచ్ బెహార్ మున్సిపల్ చైర్మన్ రవీంద్రనాధ్.. శృంగార ప్రియుల పక్షాన నిలబడి, బిర్యానీపై చేస్తున్న యుద్ధమిది. శృంగార ప్రియుల ఫిర్యాదులందుకున్న చైర్మన్ సాబ్, బిర్యానీ షాపుల్లోకి వెళ్లి ఏం చేశారో మీరే చూడండి.

పశ్చిమ బెంగాల్ మాజీ మంత్రి, తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు రవీంద్ర నాథ్ ఘోష్ బెంగాల్‌లోని కూచ్ బెహార్‌లోని రెండు స్థానిక బిర్యానీ షాపులను మూసి వేయమని బలవంతం చేశారు. బిర్యానీలోravindranath ఉపయోగించే మసాలాల వల్ల మగవారిలో లైంగిక పటుత్వం తగ్గుతోందని ఆరోపిస్తూ, ఈ పని చేయడం చర్చనీయాంశమైంది. మమతా బెనర్జీ ప్రభుత్వంలో మంత్రిగా పని చేసిన రవీంద్ర నాథ్ మాట్లాడుతూ, బిర్యానీ చేయడానికి ఉపయోగించే పదార్థాలు, మసాలాలు మగవాళ్లలో శృంగారంపై కోరికలు తగ్గినట్టు చాలా మంది నుంచి ఫిర్యాదులు అందాయని చెప్పారు.

‘బిర్యానీ చేయడానికి ఏ మసాలాలు ఉపయోగిస్తున్నారో తమకు తెలియదని ఈ ప్రాంత ప్రజలు కొన్నాళ్ల నుంచి చెబుతున్నారు. వాటివల్ల పురుషుల్లో లైంగిక సామర్థ్యం తగ్గుతోందని ఆరోపిస్తున్నారు’ అని ఆయన తెలిపారు. బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన వ్యక్తులు ఈ ప్రాంతంలో బిర్యానీ విక్రయిస్తున్నారని, లైసెన్సు లేకుండా దుకాణాలు నిర్వహిస్తున్నారని కూచ్ బెహార్ మున్సిపాలిటీ చైర్మన్ అయిన రవీంద్రనాథ్ తెలిపారు. ఫిర్యాదుల అనంతరం ఇక్కడికి వచ్చి చూడగా షాపులకు ట్రేడ్ లైసెన్స్ లేదని, అందుకే దుకాణాలు మూసేశామని వెల్లడించారు.చూశారా… ఆ బిర్యానీ తిన్నవాళ్ల పరిస్థితి అదీ మరి.

LEAVE A RESPONSE