-నాయకుడంటే ఎలా ఉండాలో ఆయన్ని చూసి నేటిరతం నేర్చుకోవాలి
-ప్రతీ తెలుగుదేశం కార్యకర్త ఎర్రన్నాయుడిని ఒక రోల్ మోడల్ గా తీసుకోవాలి
-టిడిపి కేంద్ర కార్యాలయంలో ఎర్రన్నాయుడి 10 వ వర్ధంతి కార్యక్రమం
– తెదేపా నాయకులు
కాలువ శ్రీనివాసులుమాజీ మంత్రి , పోలిట్ బ్యూరో సభ్యులు:
తెలుగు రాజకీయాలలో ఒక విలక్షణమైన నాయకుడు ఎర్రన్నాయుడు. నమ్ముకున్న సిద్దాంతం కోసం తుదిశ్వాస వరకు అలుపెరగని పోరాటం చేసిన యోధుడు ఎర్రన్నాయుడు. 1999 నుంచి 2004 వరకు పార్లమెంటు సభ్యుడిగా ఉన్నారు. ముక్కు, మొహం తెలియని వాళ్లు వచ్చి అడిగినా కాదనకుండా సహాయం చేసే వ్యక్తి ఎర్రన్నాయుడు. తెలుగుదేశం గౌరవాన్ని జాతీయ స్థాయిలో ఇనుమడింప చేశారు. అలాంటి నాయకుడు మృతిచెంది దశాబ్దకాలం గడిచిందంటే నమ్మలేకున్నా. ఒక ఉదాత్తమైన బీసీ నాయకుడైన ఎర్రన్నాయుడిని టిడిపి కోల్పోవడం పార్టీకి తీరనిలోటు.
నక్కా ఆనంద్ బాబు,మాజీమంత్రి, పోలిట్ బ్యూరో సభ్యులు
ఎర్రన్నాయుడు నేడు జీవించి ఉంటే జాతీయ రాజకీయాలు మరో విధంగా ఉండేవి. ఎర్రన్నాయుడు పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా, కేంద్రమంత్రిగా, శాసనసభ్యుడిగా, పొలిట్ బ్యూరో సభ్యుడిగా, గుంటూరు జిల్లా ఇంఛార్జ్ గా విశేష సేవలు అందించారు. ప్రతీ తెలుగుదేశం కార్యకర్త ఎర్రన్నాయుడిని ఒక రోల్ మోడల్ గా తీసుకోవాలి.
కొనకళ్ల నారాయణ,మాజీ పార్లమెంట్ సభ్యులు
పార్టీ అధినేత చంద్రబాబునాయుడికి అత్యంత సన్నిహితంగా మెలిగిన నేత ఎర్రన్నాయుడు. ఎర్రన్నాయుడికి తన సొంత అజెండా అంటూ ఏమీ లేదు. పార్టీ ఎజెండాయో తన అజెండాగా మర్చుకున్నాడు. తెలుగుదేశం పార్టీ ద్వారా రాష్ట్రానికి, తెలుగువారికి విశేష సేవలు అందించారు. అనేకమందికి నాయకులుగా ఎదిగేందుకు అవకాశం కల్పించారు. ఒకసారి నర్సీపట్నం సభలో నన్ను గుర్తించి చంద్రబాబు నాయుడి గారికి చెప్పి పార్లెమెంటుకు పోటీ చేసే అవకాశం నాకు ఎర్రన్నాయుడు కల్పించారు. అలాంటి నాయకుడు చనిపోవడం మాలాంటి వాళ్లకు,పార్టీకి కూడా తీరని లోటు.
నాగుల్ మీరా,రాష్ట్ర పార్టీ అధికార ప్రతినిధి
నాయకుడు ఎలా ఉండాలో ఎర్రన్నాయుడిని చూసి నేర్చుకోవాలి. నేడు ఎర్రన్నాయుడు మనమధ్య లేకపోయినా ఆయన ఆశయాలు మనతోనే ఉన్నాయి. ఎర్రన్నాయుడి కుటుంబానికి చంద్రబాబు నాయుడు ఎంతో అండగా నిలబడ్డారు. ఎర్రన్నాయుడు తమ్ముడు అచ్చెన్నాయుడిని పార్టీ ప్రెసిడెంట్ గా, తనయుడిని పార్లమెంటు సభ్యునిగా, కుమార్తెను శాసన సభ్యురాలిగా పదవులిచ్చి ఆ కుటుంబానికి అండగా నిలిచారు.
గురజాల మాల్యాద్రి,పార్టీజాతీయ అధికార ప్రతినిధి
నాడు ఎన్టీఆర్ స్థానికసంస్థల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించడంలోనూ. చంద్రబాబు నాయుడు హయాంలో 24 శాతం బీసీ రిజర్వేషన్లు 34 శాతానికి పెంచడంలోనూ ఎర్రన్నాయుడు కీలకపాత్ర పోషించారు. కానీ, నేడు జగన్ రెడ్డి ఆ బీసీ రిజర్వేషన్లను తిరిగి 24 శాతానికి కుదించడంతో బీసీ 16,500 స్థానిక సంస్థల్లో పదవులు కోల్పోయారు. వైసీపీ ప్రభుత్వాన్ని కూలదోసి బీసీలకు సాధికారత సాధించిన రోజే ఎర్రన్నాయుడికి నిజమైన నివాళి. కార్యక్రమంలో పాల్గొన్న వారు శాసన మండలి సభ్యులు పరుచూరి అశోక్ బాబు, టిడిపి మీడియా కో-ఆర్డినేటర్ దారపనేని నరేంద్ర, అధికార ప్రతినిధి సయ్యద్ రఫీ, కార్యనిర్వాహక కార్యదర్శి బొద్దులూరి వెంకటేశ్వర్ రావ్, ఎన్నారై కోఆర్డినేటర్ చప్పిడి రాజశేఖర్, కార్పొరేటర్ వేములపల్లి శీరాం ప్రసాద్, ఆహ్వాన కమిటీ సభ్యులు హాజీ హసన్ బాష. హెచ్ఆర్డి సభ్యులు ఎస్.పి సాహెబ్, తెలుగు రైతు ప్రధాన కార్యదర్శి బొంతు శివశాoబిరెడ్డి, సయ్యద్ అహ్మద్ అలీ, పప్పుల దేవదాస్, తదితరులు పాల్గొన్నారు.