-వైసీపీ నేతలకు సీమ ఉద్యమం చేసే అర్హత లేదు
-ఎమ్మెల్సీ ఎన్నికల్లో వాలంటీర్ల అక్రమాలు
-అన్నమయ్య జిల్లా రాజంపేట ,కోడూరు నియోజకవర్గ కార్యకర్తల సమావేశం లో పాల్గొన్న బిజేపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు
వెనుక బాటుకు కారణం ఆంధ్రప్రదేశ్ ను ఎక్కువ సంవత్సరాలు గా పరిపాలించిన రాయలసీమ నాయకులే కారణం. అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుని పోవడానికి కారణం ఇసుక మాఫియా కాదా?
చివరకు జగన్ పాలనలో , అన్నమయ్య ప్రాజెక్ట్ కొట్టుకు పోయి సంవత్సరం అయింది. జగన్ సొంత జిల్లాలో బాధితులకు ఇండ్లు , పరిహారం , భూమి సాగుకు యోగ్యత లాంటి కనీస న్యాయం చేయలేకపోయారు. వైస్సార్సీపీ నాయకులకు రాయలసీమ ఉద్యమం చేసే అర్హత ఉందా ?
ఎర్రచందనం ,ఇసుక మాఫియా దోచుకొనే దానిమీద వున్న దృష్టి.. గాలేరు -నగరి , హంద్రీ- నివా , గుండ్రేవుల , వేదవతి , సిద్దేశ్వరం మీద ఎందుకు దృష్టి పెట్టలేదు? MLC ఎన్నికల్లో దొంగ సర్టిఫికెట్లు పెట్టి, ఓట్లు నమోదు చేస్తున్న వాలంటీర్లు , ఎన్నికల కమిషన్ దృష్టి పెట్టాలి. బిజెపి బలపరచిన పట్టభద్రులు గెలవడం తథ్యం సమావేశంలో. రాష్ట్ర కార్యదర్శి నాగోతు రమేష్ నాయుడు , జిల్లా అధ్యక్షుడు సుబ్బారెడ్డి , సాయి లోకేష్ ,చెంగల్రాజు , వెంకటేశ్వర్ రెడ్డి , ఎన్నికల ఇంచార్జి బ్రహ్మం తదితరులు పాల్గొన్నారు