-కుటుంబ కలహాలను రాజకీయ లబ్ది కోసం వాడతావా?
-పిచ్చి పట్టిన పచ్చ కుక్కలా కూతలు కూయకు
-వాస్తవాలు తెలుసుకుని ట్వీట్లు పెడితే మంచిది
-మంత్రి సీదిరి అప్పలరాజు ఎద్దేవా
పలాస నియోజకవర్గంలో ఎదో జరిగిపోయిందని తెలుగుదేశం నాయకుడు ముద్ద పప్పు లోకేష్ ట్వీట్లు పెడుతూ విమర్శలు చేస్తున్నాడు,కుటుంబ కలహాలను రాజకీయ లబ్ధి కోసం ఇతరులపై నెట్టేయడం తండ్రి దగ్గర నుండి ఈ ముద్ద పప్పు లోకేష్ కి అబ్బినట్లు ఉంది. తండ్రి చంద్రబాబు 420 (ఫోర్ ట్వంటీ) అయితే… కొడుకు లోకేష్ ఆయనకు డబల్ లా ఉన్నాడు. అందుకే వారికి రాజకీయల్లో కుట్రలు తప్ప ఇతర అంశాలు తారసపడవు.
అవగాహన ఉన్న నాయకుడు ఇలాంటి విమర్శలు చేయడు. చేతకాని దద్దమ్మ, సగం తెలిసిన వ్యక్తి అయిన ముద్ద పప్పు లోకేష్ మాత్రమే ఇలాంటి విమర్శలు చేయగలడు.ముద్ద పప్పు లోకేష్ కు, వెన్నుపోటు దారుడు చంద్రబాబుకు సూటిగా ప్రశ్నిస్తున్నాము. మీకు మా నాయకుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి గారు అంటే భయం అనే విషయం అర్ధం అవుతుంది. అందుకే అసత్య ప్రచారాల తోపాటు అనుచిత వ్యాఖ్యలు చేయడం ప్రారంభించారు. మందస మండలంలోని హరిపురంలో జరిగిన వివాదానికి సంబందించిన నీవు అసలు విషయం తెలుసుకోవాలి లోకేష్.మా ప్రాంతంలో ఓ నానుడి ఉంది. తండ్రి ఎద్దు ఈనింది అంటే, కొడుకు గ్యాపు ఇవ్వకుండా గొందిలో కట్టేయండి అన్నాడట. అలా ఉంది మీ తండ్రీ కొడుకుల వ్యవహారం. హరిపురంలో ఒక కుటుంబానికి సంబందించిన భూములు వివాదం గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతుంది. వారి ఆస్థుల కోసం కోర్టులను కూడా ఆశ్రయించారు.
సోమవారం జరిగిన ఘటనకు వైసిపి పార్టీకి ఏంటి సంబంధం? ఆ వివాదంలో తెలుగుదేశం పార్టీ వారే అధికంగా ఉన్నారు ఈ విషయం నీకు తెలుసా లోకేష్. ఆస్తుల గొడవలు కోర్టులు కూడా తీర్చలేకపోతుంటే మా మీద పడి ఏడుస్తా వేంటి లోకేష్. బుర్ర గడ్డి తిని ట్వీట్లు పెడుతున్నావు, నిజాలు తెలుసుకోకుండా మరోసారి అసత్య ఆరోపణలు చేస్తే పరిస్థితిలు చాలా తీవ్రంగా ఉంటాయి. నీలో మగతనం ఉంటే నిజాయతీగా రాజకీయాల చేయు లోకేష్. నీలో నైతికత లేదు కాబట్టే ఎదుటి వారిపై బురద చల్లే ఆలోచన చేస్తున్నావు, కుటుంబ కలహాలను సైతం రాజకీయ లబ్ది కోసం వాడుకునే నీచమైన బుద్ది కలిగిన నీవు ఒక నాయకుడివా?ఆవు చేను మేస్తే దూడ గట్టు మేస్తుందా అన్నట్లు ఉంది మీ తండ్రీ కొడుకుల వ్యవహారం, రాజకీయ కుట్రలు చేయడంలో పీహెచ్డీ పట్టా పొందిన, కుటిల మనస్కులు అయిన చంద్రబాబు కొడుకువి కదా నీకు తండ్రి బుద్దులు రాక ఇంక ఎవరి బుద్దులు వచ్చి ఉంటాయో అది నీకే అర్ధం కావాలి.
రాజకీయ వ్యభిచారం చేస్తూ బ్రతికే బతుకులు మీవి కాబట్టి నీతి లేని మాటలు ట్వీట్లు రూపంలో పెడుతున్నారు. పప్పు నీవు ముందు నిజాలు తెలుసుకోవడం నేర్చుకో అసత్య ఆరోపనలు చేస్తూ ట్వీట్లు చేస్తే నీకు సరైన బుద్ది చెబుతాం. తొండ ముదిరి ఊసరవెల్లి అయినట్లు నీకు తిక్క ముదిరి పిచ్చిగా మారినట్లు ఉంది. నీ పిచ్చికి సరైన ట్రీట్మెంట్ కావాలంటే చెప్పు ట్రీట్మెంట్ ప్రారంభిస్తాము… లేదంటే 2024 వరకు ఆగు ఆగితే పూర్తి ట్రీట్మెంట్ ప్రజలు ఇస్తారు హాయిగా ఇంటి దగ్గర తండ్రీ కొడుకులు ఇద్దరు రెస్టు తీసుకుందురు గాని.