రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్ లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని తెలంగాణ టిఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో మంత్రుల నివాసాలు ముట్టడించడం జరిగింది. ఈ సందర్భంగా టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు పర్లపల్లి రవీందర్ మాట్లాడుతూ..గత రెండు సంవత్సరాలుగా ఫీజు బకాయిలు చెల్లించకపోవడంతో దాదాపు 15 లక్షల మంది విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని..సకాలంలో ఫీజు బకాయిలు చెల్లించకపోవడంతో ప్రైవేటు కళాశాల యాజమాన్యాలు విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారని.. సకాలంలో ఫీజు బకాయిలు చెల్లించకపోవడంతో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ విద్యార్థులు చదువులకు దూరం అవుతున్నారని అన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ కి ఉప ఎన్నికల మీద ఉన్న శ్రద్ధ విద్యార్థుల భవిష్యత్తు మీద లేదని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత విద్యను పూర్తి నిర్వీర్యం చేస్తున్నారని, గత రెండు సంవత్సరాలుగా ఫీజు బకాయాలు చెల్లించకుండా దాదాపు 3500 కోట్ల బకాయిలు పేరుకుపోయిన రాష్ట్ర ముఖ్యమంత్రి చలనం లేదని అన్నారు.
సంక్షేమ హాస్టల్లో విద్యార్థులకు సంబంధించిన మెస్ బిల్లులు చెల్లించకపోవడంతో విద్యార్థులకు పౌష్టికాహారం పెట్టలేక వార్డెన్ ఇబ్బంది పడుతున్నారని అన్నారు..రానున్న వారం రోజుల్లో పెండింగ్ లో ఉన్న ఫీజు బకాయిలు మరియు స్కాలర్షిప్ బకాయిలు విడుదల చేయాలని లేని పక్షంలో ప్రగతి భవన్ ముట్టడిస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, జనుపాల కిషోర్ రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షులు, డిజె శివ గౌడ్, రమేష్ నాయక్, శివానంద్, చీమ మహేష్, రాష్ట్ర అధికార ప్రతినిధి మహమ్మద్ షుకుర్, జయేందర్ కులుకులపల్లి, సచిన్, సతీష్, బాలరాజు, నారాయణ, మురళి, గణేష్, మోతే రాజు, తిరుమలేష్, చిరుహాస్ తదితరులు పాల్గొన్నారు.