Suryaa.co.in

Entertainment

మా ఆయన బంగారం.. ఇట్లు శైలజా సుధాకర్..

నాకు తెలిసిన
నవ్వుల సుధాకర్..
ఎదిగాడు కారెక్టర్ నటుడిగా..
ఒదిగాడు మంచి మనిషిగా..!

వస్తూనే తన మకాం
ఇక్కడే శాశ్వతమని..
చిత్రసీమకు ఇచ్చేశాడు
శుభలేఖ..
ఇక్కడే దొరికింది
జీవితాన శశిరేఖ..
శైలజ రూపంలో..
సుధా ‘సాగర’ముతో
సంగమమై..
ఆ జంట కాపురమే
పూర్ణోదయ లయనిలయమై..!

ఈ కపిల వారి దేవుడయ్య
మనిషి బక్కోడే గాని
గొంతు గంభీరం..
ఆ గళమే చేసింది
కమెడియన్ను
క్యారెక్టర్ ఆర్టిస్ట్..
శివలో పాత్ర కెరీర్లో
ఓ పెద్ద ట్విస్ట్..!

హాస్యం ఎంత లాస్యమో..
సీరియస్ పాత్రల్లో
అంత ప్రశస్తం
ఈ సితార దేవదాసు
మా శైలజమ్మ ప్రేమదాసు..
స్వరం బాగుంటుందని డాబు
సితార సూరిబాబు..
మొదట్లో అల్లరివాడైనా
మొన్నటికి మొన్న
వకీల్ సాబ్ లో
ఇంటి ఓనరుగా
అమ్మాయిలకు
ఇచ్చిన మద్దతు..
పెంచింది ధరావతు..!

సురేష్ కుమార్ ఎలిశెట్టి
9948546286

LEAVE A RESPONSE