– ప్రయాణికుల అవస్థలు
విజయవాడ రైల్వే స్టేషన్ మీదుగా నిత్యం అనేక వందల రైళ్లు ప్రయాణిస్తూ ఉంటాయి. అయితే రద్దీగా ఉండేటువంటి ఉదయం, సాయంత్రం వేళల్లో మాత్రం ఎస్కలేటర్లు అందుబాటులో ఉండట్లేదు దీనివల్ల సీనియర్ సిటిజన్ ప్రయాణికులు అనేక అవస్థలు పడుతున్నారు. నడవలేక.. లిఫ్ట్ దాకా వెళ్లలేక.. ఎస్కలేటర్ నుంచి చాలా దూరం నడవాల్సి వస్తొంది. ముఖ్యంగా సికింద్రాబాద్ గుంటూరు గోల్కొండ ఎక్స్ప్రెస్ విజయవాడలో పదవ నెంబర్ ప్లాట్ఫారం నకు వచ్చు సమయంలో ప్రతినిత్యం ఎస్కులేటర్లు పనిచేయకుండా నిలుపుదల చేసి ఉంచుతున్నారని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు.
ఈ విషయాన్ని రైల్వే ఉన్నతాధికారులు ఎవరు పట్టించుకోకపోవడం వల్ల అక్కడ ఉన్న ఫోన్ నెంబర్ కి అనేక సార్లు ఫోన్ చేసినా రెస్పాన్స్ రాక ప్రయాణికులు తమ సమయాన్ని వృధా చేసుకుంటూ అక్కడే చాలాసేపు ఉంటున్నారు. ఉన్నతాధికారులు ఈ విషయంపై తగు చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు.
ఉదయం రత్నాచల్, శాతవాహన, పినాకిని, రైళ్లు వెళ్ళు సమయంలో అనేక మంది ప్రయాణికులు ఎస్కులేటర్లు పనిచేస్తాయని అక్కడికి వస్తారు, కానీ అవి పని చేయక వాళ్ళు మెట్లు ఎక్కలేక అనేక ఇబ్బందులు పడుతున్నారు. అక్కడి నుంచి లిఫ్ట్ దగ్గరికి వెళ్లాలంటే చాలా దూరం నడవాల్సి వస్తోందని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు.
ముఖ్యంగా సికింద్రాబాద్ నుంచి గుంటూరు వెళ్లు గోల్కొండ రైలు పదో నెంబర్ ప్లాట్ఫారంకు వచ్చినప్పుడు నిత్యం అక్కడ ఎస్కలేటర్ పనిచేయకపోవడంతో ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ప్రయాణికులకు ఉపయోగపడని ఎస్కులేటర్లు ఎవరికోసం ఏర్పాటు చేశారని ప్రశ్నిస్తున్నారు.
ఉదయం పూట కూడా ఒకటో నెంబరు ప్లాట్ ఫారం మూడో నెంబర్ గేట్ దగ్గర ఉన్న ఎస్కులేటరు కూడా పనిచేయటం లేదని, మిగతా సమయంలో ఎట్లా ఉన్నా కనీసం రైళ్లు వచ్చు, వెళ్ళే సమయంలో నైనా ఎస్కులేటర్లు పనిచేసే విధంగా అధికారులు చర్యలు తీసుకుంటారని ప్రయాణికులు ఆశిస్తున్నారు.
అదేవిధంగా శాతవాహన, గోల్కొండ రైళ్లలో విపరీతమైన బొద్దింకలు వలన ప్రయాణికులు చిన్నపిల్లలు ఆందోళన చెందుతున్నారు. రైల్వే అధికారులు ఈ బొద్దింకల నిర్మూలనకు చర్యలు తీసుకుని, ఎస్కిలేటర్లపై శ్రద్ధ పెట్టి అవి పని చేసే విధంగా చూడాలని ప్రజలు అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు.