వివేకాందనరెడ్డి హత్య నేరపూరిత కుట్ర..జగన్ రెడ్డి ప్రధాన భాగస్వామి

– వివేకాహత్య నిందితుల జాబితాలో అవినాశ్ రెడ్డితో పాటు జగన్ రెడ్డి పేరు కూడా చేర్చాలి
వైసీపీ నేతలకు అభివృద్ది వికేంద్రకీరణ అంటే ఏంటో కూడా అర్ధం తెలియదు
– తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు 

వివేకానందరెడ్డి హత్య వెనుక నేరపూరితమైన కుట్ర ఉందనేది స్పష్టమైంది. ఐపీసీ సెక్షన్ 120 బి ప్రకారం జగన్ రెడ్డి కూడా ఈ హత్యలో ముఖ్య భాగస్వామి అనేది సాక్షుల వాంగ్మూలాలను బట్టి స్పష్టంగా అర్ధమౌతోంది. అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి , జగన్ రెడ్డి అంతా క్రిమినల్ కాన్స్పిరెన్సిగా ఏర్పడి వివేకాను హత్య చేశారని సీబీఐ దర్యాప్తును బట్టి అర్ధమౌతోంది. వివేకా హత్య వెనుక ఎవరున్నారో వివేకా కూతురు, అల్లుడు ఇతర కుటుంబ సభ్యులంతా సీబీఐకి వాంగ్మూలం ఇచ్చారు.

సాక్ష్యాధారాల చట్టం (ఎవిడెన్స్ యాక్టు) ప్రకారం వివేకా హత్య కేసులో అవినాశ్ రెడ్డి, జగన్ రెడ్డి పాత్ర ఉందనటానికి ఇంతకంటే సాక్ష్యం ఇంకేం కావాలి? వివేకా హత్య కేసులో సీబీఐ అవినాశ్ రెడ్డితో పాటు జగన్ రెడ్డి పేరు కూడా ఎఫ్ఐర్, చార్జ్ షీట్ లో చేర్చాలి.

రాజధానిపై మరో చట్టం తీసుకురావటానికి వీల్లేదని హైకోర్టు ఇచ్చిన తీర్పులో స్పష్టంగా ఉంది. విభజన చట్టం ప్రకారం రాజధానిపై చట్టం చేసే హక్కు పార్లమెంటుకు ఉందిగానీ శాసనసభకు లేదని తీర్పులో స్పష్టంగా పేర్కొన్నారు. శాసన సభ రాజ్యాంగానికి లోబడి చట్టాలు చేయాలి తప్ప రాజ్యాంగానికి వ్యతిరేకంగా చట్టం చేసే అధికారం లేదు. రాజధానిపై ముఖ్యమంత్రి మూర్ఖంగా మరో చట్టం చేసినా ఇదే పరిస్ధితి ఎదురవుతుంది. జగన్ రెడ్డి ఇకనైనా హైకోర్టు తీర్పును, ప్రజాభిప్రాయాన్ని గౌరవించి అమరావతిని అభివృద్ధి చేయాలి.అలా కాకుండా మూర్కపు వైఖరితో అమరావతిని నిర్లక్ష్యం చేస్తే హైకోర్టు తీర్పును కించపరిచినట్లే అవుతుంది.

సజ్జల రామకృష్టారెడ్డి మాట్లాడుతూ చట్టసభల్లో తమకు బలముందని అంటున్నారు. ఆయన చెప్పేది నిజమే. వారికి అధికార బలం, అహంకార మదం ఉంది తప్ప ఆలోచన బలం లేదు. అభివృద్ది వికేంద్రీకరణ అంటే మూడు రాజధానులు కాదు. బడ్జెట్ ను అన్ని ప్రాంతాలకు సమానంగా పంచి రాష్ట్రం అంతా అభివృద్ది చేయాలి. అన్ని ప్రాంతాల్లో పరిశ్రమలు నెలకొల్పి యువతకు ఉపాధి కల్పించాలి. మాట్లాడితే అభివృద్ది వికేంద్రకరణ అని కబుర్లు చెబుతున్నారు. కానీ వైసీపీ 3 ఏళ్ల పాలనలో ఏం అభివృద్ది చేశారో ఏఏ ప్రాంతంలో ఏ పరిశ్రమలు నెలకొల్పారో చెప్పాలి.

వైసీపీ అధికారంలోకి వచ్చాక విశాఖ నుంచి ఐటీ కంపెనీలు పరిశ్రమలు తరలిపోయాయి.కర్నూల్ లో సోలార్ ప్లాంట్ ఆగిపోయింది. రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిపోయింది. అభివృద్ది వికేంద్రీకరణకు అర్థం కూడా తెలియకుండా అభివృద్ది వికేంద్రీకరణ గురించి వైసీపీ నేతలు మాట్లాడటం హాస్యాస్పదం.దేశం మొత్తానికి ఒకే రాజధానిగా ఢిల్లీ ఉంది అన్ని రాష్ట్రాలు అభివృద్ది చెందుతున్నాయి. డిల్లీని 4 ముక్కలు చేసి సౌత్, నార్త్, ఈస్ట్, వెస్ట్ అని విభజించలేదు. అన్ని రాష్ట్రాలకు ఒకే రాజధాని, అలానే ఒకే రాష్ట్రం ఒకే రాజధాని ఉండాలి. అమరావతిని రాజధానిగా ప్రకటించినపుడే ప్రతి జిల్లాకు ఏం చేయాలో అసెంబ్లీలో చెప్పాం. కానీ వైసీపీ పాలనలో ఏ జిల్లాలో అభివృద్ది జరగలేదు. రాష్ట్రంలో అభివృద్ది కుంటుపడింది. పొరుగు రాష్ట్రాలు అభివృద్ది చెందుతుటే ఏపీ మాత్రం అభివృద్దిలో అట్టడుగుకు చేరింది.

Leave a Reply