టీడీపీ ఉపాధ్యక్షులు కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రులు, ఎమ్మెల్యేలు,ఎంపి లు రైతులకు పట్టించుకోవడం లేదని టీడీపీ ఉపాధ్యక్షులు కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి విమర్శించారు. కోడుమూరులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ నాయకులకు రైతుల సమస్యలు పట్టినట్లు లేదని కేవలం అక్రమంగా డబ్బులు సంపాదించి ఆ డబ్బులతో ఎన్నికల్లో గెలుస్తామనే ధీమాతో వైసీపీ వాళ్ళు వ్యవహరిస్తున్నారని ప్రజలు అమాయకులు కారని సరైన సమయంలో వైసీపీ పార్టీ కి బుద్ది చెప్తారన్నారు.వైసీపీ నాయకులు అక్రమంగా సారా,మట్కా, ఎర్రమట్టి,ఇసుక మాఫియా ఇలా ఎంత జరిగిన పోలీసులు ఏమి పట్టనట్లు వ్యవహరిస్తున్నారన్నారు.
వీరు చేస్తున్న దానికి ఊర్లు నాశనం అవుతున్నాయన్నారు. రైతులు సంతోషంగా ఉన్నారా లేదా వారి సమస్యలు పరిష్కరించాలని, లేని పక్షంలో దిగిపోవాలని డిమాండ్ చేశారు.రైతులు వేసుకున్న పంటలకు డిసెంబర్ నెలలో నీళ్లు వదలాలి. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి.వాళ్ళు కేసులు పెడతారని భయపడుతున్నారన్నారు. టీడీపీ ప్రభుత్వం కావాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు.టీడీపీ ప్రభుత్వం వస్తే రైతులకు సాగునీరు అందిస్తామన్నారు.