-వైఎస్ ఆర్ హైటెక్ సిటీ కూలగొట్టి ఉంటే హైదరాబాద్ అభివృద్ది జరిగేదా.?
-నాకు ముఖ్యమంత్రి పదవి కొత్త కాదు….మళ్లీ గెలిస్తే నేనేమన్నా రికార్డు క్రియేట్ చేస్తానా..?
-రైతు ఆత్మహత్యల్లో దేశంలో ఎపి మూడో స్థానంలో ఉంది
-మీరు ఇలాగే ఉంటే మీ ఆస్తులు కూడా తాకట్టు పెడతారు
-నేను ఎప్పుడైనా ఒక్క కులానికి మద్దతు ఇచ్చిన సందర్భం ఉందా.?
-నా పక్కన నలుగురు ఉంటే…వాళ్లు ఎవరు అనేది కూడా చూసుకుంటా
-సిఎం, డిజిపి, సిఎస్, సలహా దారు సజ్జల అంతా కడప జిల్లానే
-తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరులో టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు రోడ్ షో
అడుగడుగునా జనం తరలి రావడంతో రోడ్ షోలు ఆలస్యం అవుతున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో వందల సార్లు తిరిగి ఉంటాను….పుష్కరాల్లో కూడా ఇక్కడే ఉన్నా. కానీ జీవితంలో ఇంత స్పందన ఎప్పుడూ చూడలేదు. తెలుగు తమ్ముళ్లు ఆవేశంతో ఊగిపోతున్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా జగన్ ను చిత్తు చిత్తుగా ఓడించాలని జనం ఊగిపోతున్నారు. నిత్యావసర వస్తువుల ధరలు భారంగా మారిపోయాయి. మంచి తిండి కూడా తినలేని పరిస్థితి. కరెంట్ చార్జీలు, ఆర్టిసి టిక్కెట్ ధరలు పెరిగాయి. చివరికి చెత్తమీద కూడా పన్ను వేసిన చెత్త ముఖ్యమంత్రి జగన్.
జగన్ వరదలకు వెళ్లి నవ్వుతాడు…పరామర్శకు వెళ్లి నవ్వుతాడు…ఏం చెప్పాలి ఈ సిఎంకు.? పోలవరం 72 శాతం పూర్తి చేసిన నన్ను పోలవరం వెళ్లకుండా అడ్డుకున్నారు. పోలవరంలో కీలక పనులు అన్నీ నాడు పూర్తి చేశాం.2019 మేలో జగన్ ఐరన్ లెగ్ వచ్చింది…పోలవరంపై పడింది. బాధ్యత ఉండే సిఎం అయితే తెలియని విషయాలు తెలుసుకోవాలి పుట్టుకతో అన్నీ తెలియవు…నలుగురితో మాట్లాడి తెలుసుకోవాలి.
ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే పోలవరం రివర్స్ టెండర్ చేశాడు. పోలవరం ప్రాజెక్టు నీళ్ల పాలు అయ్యింది. 7 మండలాలు ఎపిలో కలిపితేనే సిఎంగా ప్రమాణ స్వీకారం చేస్తాను అని నాడు చెప్పాను.దీంతో 7 మండలాలు కేంద్ర ప్రభుత్వం ఏర్పడక ముందే ఎపిలో కలిపారు. చిన్నబిడ్డను పెంచినట్లు పోలవరాన్ని పెంచాను. పోలవరంను చూసి ఇదేం ఖర్మ అని అనిపిస్తోంది. పోలవరం వచ్చి ఉంటే అన్ని ప్రాంతాల్లో నీళ్లు ఇచ్చే వాళ్లం పోలవరం కల నిజం అయ్యే సమయంలో జగన్ వచ్చి నాశనం చేశాడు. పోలవరం ప్రాజెక్టును 41.15 మీటర్ల వరకే కట్టి దాన్ని బ్యారేజ్ గా మారుస్తాడట పోలవరం నీళ్లు వస్తే నాకు ఒక్కడికే లాభమా…ప్రజల కోసం పోలవరం కట్టాలి అనుకున్నాను.
పోలవరం చూడడానికి వెళితే పోలీసు అధికారులు రావడానికి వీలు లేదు అంటున్నారు.పోలవరం నిర్మాణం చేసిన నాకే వెళ్లడానికి హక్కు లేదు అంటే ఎలా.? ఈ రాష్ట్రంలో ఒక ఉన్మాది పాలన నడుస్తుంది. ఈ సైకో పాలన వద్దు…సైకిల్ పాలన కావాలిఅప్పుడే మనం జీవితాలు ఆనందంగా ఉంటాయి. తమ బిడ్డల
భవిష్యత్ బాగుండాలి అంటే మళ్లీ టిడిపి రావాలి అని జనం కోరుకుంటున్నారు.. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే స్పందన కనిపిస్తుంది. తమ్ముళూ మళ్లీ జాబు రావాలి అంటూ బాబు రావాలి అని అంతా అంటున్నారు. 2014 తరువాత రాష్ట్రానికి రూ.16 లక్షల కోట్ల పెట్టుబడి తెచ్చాను. 5 లక్షల మందికి ఉద్యోగాలు తెచ్చాను.
నాడు తెలంగాణలో నా తరువాత వచ్చిన ముఖ్యమంత్రులు, వైఎస్ ఆర్ హైటెక్ సిటీ కూలగొట్టి ఉంటే హైదరాబాద్ అభివృద్ది జరిగేదా.? జగన్ మూడున్నరేళ్లలో ఒక్క రూపాయి పెట్టుబడి తెచ్చాడా…ఒక్క టీచర్ ఉద్యోగం ఇచ్చాడా..? నాకు ముఖ్యమంత్రి పదవి కొత్త కాదు….మళ్లీ గెలిస్తే నేనేమన్నా రికార్డు క్రియేట్ చేస్తానా..? ఇప్పటికే ఉమ్మడి రాష్ట్రంలో 9 ఏళ్లు సిఎంగా రికార్డు నా పేరుతోనే ఉంది.
నాకు సిఎం పదవి కాదు…నా అవేదన, తపన ఈ రాష్ట్రం గురించి.పాలకులు కొత్త పాలసీ తీసుకువస్తే పదిమందికి మేలు జరగాలి అని కోరుకుంటారు కానీ రాష్ట్రంలో అందుకు భిన్నంగా జరుగుతోంది. స్వార్థం అవినీతి వల్ల ధాన్యం డబ్బులు కూడా దక్కని పరిస్థితి. జగన్ విధానం వల్ల ఆక్వా రంగం పూర్తిగా దబ్బతింది. దీనిపై ఆధారపడిన వారు నష్టపోయారు. రాష్ట్రంలో ఒక్క రైతు కూడా ఆనందంగా లేడు. ఒక్కో రైతుపై సగటున రూ. 2.74 లక్షల అప్పు ఉంది.
రైతు ఆత్మహత్యల్లో దేశంలో ఎపి మూడో స్థానంలో ఉంది.ఈ స్థాయిలో ప్రభుత్వ ఆస్తులు ఎవరైనా తాకట్టు పెట్టారా…ఇన్ని అప్పులు చేశారా? మీరు ఇలాగే ఉంటే మీ ఆస్తులు కూడా తాకట్టు పెడతారు. అప్పులు చేసే ముఖ్యమంత్రి సమర్థుడా…సంపద సృష్టించేవారు సమర్థులా.? సంపద సృష్టి తెలిసిన పార్టీ తెలుగు దేశం పార్టీ. హైదరాబాద్ లో హైటెక్ సిటీ కట్టిన తరువాత అక్కడ ముఖచిత్రం మారిపోయింది.అలాగే చేద్దాం అంటే అమరావతిలో 33 వేల ఎకరాలు రైతులు ఇచ్చారు. అమరావతి పూర్తి చేసి ఉంటే 3 లక్షల కోట్ల ఆస్తులు రాష్ట్రానికి వచ్చేవి. అమరావతికి కులం పేరు పెట్టి దాన్ని చంపేశారు. నేను ఎప్పుడైనా ఒక్క కులానికి మద్దతు ఇచ్చిన సందర్భం ఉందా.? నా పక్కన నలుగురు ఉంటే…వాళ్లు ఎవరు అనేది కూడా చూసుకుంటా…అంత ప్రాధాన్యం ఇస్తాను. సిఎం, డిజిపి, సిఎస్, సలహా దారు సజ్జల అంతా కడప జిల్లానే.
రాష్ట్రాన్ని సాయిరెడ్డి, సజ్జల రెడ్డి, పెద్ది రెడ్డి, వైవి సుబ్బారెడ్డికి అప్పజెప్పాడు..మీ పార్టీలో ఇక వేరే మగాళ్లు లేరా…అంతా ఒక వర్గం వాళ్లే ఉండాలా? వెనుకబడిన వర్గాలకు ఏం పదవులు ఇచ్చారో ఈ సిఎం చెప్పాలి. మేం బిసిలకు చేం చేశామో చెపుతాం…చర్చకు సిద్దమా? నా జీవితం తెరచిన పుస్తకం…ఎప్పుడూ తప్పు చెయ్యను. అసత్య ప్రచారాలు చేసి రాజకీయ లబ్ది పొందాలి అని చూస్తే ఉతికి ఆరేస్తాను. అన్నా క్యాంటీన్ ఏం పాపం చేసిందని జగన్ తీసివేశాడు. తమిళనాడులో అమ్మ క్యాంటీన్ ను కొత్తగా వచ్చిన సిఎం స్టాలిన్ దాన్ని కొనసాగించాడు. అధికారంలోకి వచ్చిన తరువాత అన్నా క్యాంటీన్ ను ప్రతి మండలంలో పెడతాను. 200 రూపాయాల పెన్షన్ 2,000 చేసింది ఎవరు….ఇదీ సంక్షేమం అంటే. జగన్ పెన్షన్ 3 వేలు చేస్తాను అన్నాడు…చేశాడా.?
చంద్రన్న బీమా కింది సహజ మరణానికి రూ.2 లక్షలు, ప్రమాద మరణానికి రూ.5 లక్షలు ఇచ్చాను.ప్రజలకు ఇచ్చే బీమా పైనా కోతలు పెట్టారు. విద్యార్థులకు విదేశీ విద్య రావడం లేదు. రంజాన్ తోఫా రావడం లేదు…సంక్రాంతి కానుక రావడం లేదు.ఎస్సి, ఎస్టి, ముస్లింలకు న్యాయం చెయ్యకుండా ఏ చేశాడు ఈ సిఎం.? జగన్ సంక్షేమ బటన్ నొక్కడం అనేది పెద్ద యాక్షన్. సాయంత్రం బటన్ నొక్కి మద్యం, శాండ్ డబ్బు తెచ్చుకుంటాడు.ప్రజల మెడమీద కత్తిపెట్టి మీ ఆస్తి ఇస్తావా చస్తావా అంటే ఏం చేస్తారు. రాసి ఇస్తారు.
ఇప్పుడు విశాఖలో అదే జరిగింది. అక్కడ అలాగే ఆస్తులు ఆక్రమించారు. ఆస్తుల కంటే ప్రాణం ముఖ్యం అని ప్రజలు భావించే పరిస్థితి వచ్చింది.మనలను రక్షించడానికి పోలీసులు రారు…మనం ప్రశ్నిస్తే మాత్రం పోలీసులు గోడలు దూకివస్తారు.పోలీసులపైనా ఒత్తిళ్లు ఉన్నాయి…..వారికి సమయానికి జీతాలు రావడం లేదు. ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి టైటిల్ పూర్తిగా నప్పింది. నా కంటే ప్రజలు ఎక్కువ ఆవేశంగా ఉన్నారు.
నేను సిఎంగా ఉన్నప్పుడు ఇలాంటి ఇబ్బందులు వచ్చాయా…పోలీసులు అనవసరంగా గోడలు దూకారా…ఇప్పుడు ఎందుకు పోలీసులు అలా చేస్తున్నారు.?ఈ సారి రాష్ట్రాన్ని కాపాడుకోకపోతే….2024 ఎన్నికలు రాష్ట్రానికి చివరి ఎన్నికలు అవుతాయి సెల్ ఫోన్ తిండిపెడుతుందా అని రాజశేఖర్ రెడ్డి అడిగాడు…..సెల్ ఫోన్ ఏం చేస్తుందో చూడు అని నాడు అన్నాను. ఇప్పుడు సెల్ ఫోన్ లేకుండా ఎవరూ ఉండలేని పరిస్థితి.
జిల్లా పర్యటనలో నా నడుంలు విరిగిపోయాయి. రేపు డాక్టర్ వద్దకు వెళ్లాలి. అంత దారుణంగా రోడ్లు ఉన్నాయి. నాడు మలేషియా రోడ్లు చూసి ప్రధాని వాజ్పేయి వద్ద రోడ్లపై ప్రతిపాదనలు ఉంచాను.నాటి ఆ ప్రతిపాదనల కారణంగా బివోటి కింద నెల్లూరు, చెన్నై రోడ్డు వచ్చింది. ఆ తరువాతనే గోల్డెన్ క్వార్డలేటరల్ ప్రాజెక్ట్ వచ్చిందిఅనేక అంశాల్లో సంస్కరణలకు నాడు నాంది పలికాను. ఆ ఫలితాలు మనకు దక్కాయి.
పిల్లలకు జగన్ కంసమామ…ప్రజలకు భస్మాసుర మామ. శివుడి వద్ద వరం తీసుకుని భస్మాసురుడు శివుడినే భస్మం చెయ్యాలి అనుకున్నాడు. జగన్ కు బ్లూ మీడియా ఉంది…వాలంటీర్లు ఉన్నారు. నాకు ప్రజల ఉన్నారు. బ్లూ మీడియాను పెట్టుకుని జగన్ అసత్యాలు ప్రచారం చేస్తున్నాడు.
తన సభకు నల్ల చున్నీలతో వచ్చారని మహిళల చున్నీలు లాగేశారు.నాపై అవినీతి ఆరోపణలు చేసి తవ్వుతూనే ఉన్నాడు. తవ్వి తవ్వి ఏం చేస్తాడు. ఎలుక తోకను కూడా పట్టుకోలేడు. మహిళలకు గౌరవం పెంచిన పార్టీ తెలుగు దేశం పార్టీ. మహిళలకు విద్యలో 33 శాతం రిజర్వేషన్లు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం. ఆడబిడ్డల తల్లిదండ్రులను గౌరవంగా చూసే పరిస్థితి తీసుకువచ్చింది టిడిపినే.
జగన్ రాష్ట్రానికి పట్టిన శని…దాన్ని వచ్చే ఎన్నికల్లో వదిలించుకుందాం.ప్రజల్లో ఉత్సాహం చూసిన తరువాత నాకు నమ్మకం కలిగింది.ఎప్పుడు ఎన్నికలు పెట్టినా జగన్ ను, వైసిపిని బంగాళాఖాతంలో కలపడానికి ప్రజలు సిద్దంగా ఉన్నారు. నీ ముద్దులుపోయి గుద్దులు మిగిలాయి అని జగన్ కు చెప్పండి. గట్టిగా ప్రశ్నించండి.