Suryaa.co.in

Andhra Pradesh

బీసీ సమాధులపై ఎదిగిన వై.ఎస్.కుటుంబం బలహీనవర్గాల్ని ఉద్ధరిస్తుందా?

– జగన్ రెడ్డి బీసీ జపం ఎన్నికల స్టంట్
• జనాభాలో బీసీలు 50శాతముంటే, జగన్ సభలో 50శాతం వాలంటీర్లు, పోలీసులు, బారికేడ్లదే
• చంద్రబాబు బీసీలకు చేసిన మేలు, సంక్షేమం, జగన్ రెడ్డి బలహీనవర్గాలకు చేసిన ద్రోహమేంటో ఆధారాలతో సహా నిరూపించడానికి సిద్ధంగా ఉన్నాను
• సీదిరి అప్పలరాజు, జోగిరమేశ్ లు ఎప్పుడు, ఎక్కడికి రమ్మన్నా రెడీ
– టీడీపీ రాష్ట్రప్రధాన కార్యదర్శి, ఉత్తరాంధ్ర ఇన్ ఛార్జ్ బుద్దా వెంకన్న

మూడున్నరేళ్ల జగన్ రెడ్డి పాలన ఆసాంతం బీసీల హత్యలు, బారిభూముల కబ్జాలు, వారి ఆస్తులలూఠీలతోనే సాగిందని, ముఖ్యమంత్రికి ఉన్నపళంగా బీసీలపై ప్రేమపుట్టుకు రావడం అంతా ఎన్నికల స్టంట్ లో భాగమని టీడీపీ రాష్ట్రప్రధాన కార్యదర్శి బుద్దా వెంకన్న తేల్చి చెప్పారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడా రు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే…

“మూడున్నరేళ్లలో బీసీనేతల హత్యలు, వారిపైదాడులు, వేధింపులకు పాల్పడి, వారి ఆస్తులు, భూములు లాక్కున్న జగన్ రెడ్డి, ఎన్నికలస్టంట్ లో భాగంగానే బీసీల జపం మొదలెట్టాడు. బీసీలకు మంచి, న్యాయంచేయాలన్న ఆలోచన ఏకోశానా జగన్ రెడ్డికి లేదు. ఎన్నిసభలు పెట్టినా, ఎన్ని సంవత్సరాలు తలకిందులుగా తపస్సుచేసినా జగన్ కు బీసీల మద్ధతు లభించదు. జగన్ వచ్చాక పని, పనిముట్లులేక బీసీలు రోడ్డునపడ్డారు. కేవలం బీసీల్ని చంద్రబాబుకి, టీడీపీకి దూరంచేయాలన్న కుట్రతప్ప, బీసీలపై జగన్ కు ప్రేమలేదు. వై.ఎస్.కుటుంబం ఎదిగిందే బీసీల సమాధులపై. ఆవిషయం ప్రజలందరికీ తెలుసు. చంద్రబాబునాయుడికి వస్తున్న ప్రజాదరణ చూసిఓర్వలేకనే జగన్ బీసీలపై కపటప్రేమ చూపుతున్నాడు.

జగన్ బీసీ సభలో వాలంటీర్లు, పోలీసులు, బారికేడ్లే తప్ప బీసీలు లేరు. రాష్ట్ర జనాభాలో 50శాతం బీసీలుంటే, జగన్ సభలో వాలంటీర్లు, పోలీసులు 50శాతమున్నారు. వేదికమీద ఉన్న వైసీపీబీసీనేతలు తప్ప, సభకు బీసీలు రాలేదు. పదవులకోసం బీసీల జీవితాల్ని జగన్ కాళ్లవద్ద తాకట్టుపెడుతున్నవారిని బీసీలంతా నిలదీయాల్సిన సమయం వచ్చింది జగన్ పోవాలి.. చంద్రబాబు రావాలన్ననినాదం బీసీ గొంతుల్లో ధ్వనిస్తోంది.

చంద్రబాబుతోనే బీసీలకు పూర్వవైభవం….
చంద్రబాబు వస్తేనే బీసీలకు సబ్ ప్లాన్, ఆదరణ, చంద్రన్నబీమా, విద్యార్థులకు విదేశీవిద్య, స్టడీసర్కిళ్లు, ఫీజు రీయింబర్స్ మెంట్ , పెళ్లికానుక వస్తాయని బలహీనవర్గాలు ప్రగాఢ విశ్వాసంతో ఉన్నారు. బీసీలు జగన్ రెడ్డిని నమ్మడంలేదు కాబట్టే, చంద్రబాబుసభలకు భారీగా తరలివస్తున్నారు. చంద్రబాబు జయహో బీసీలు అంటే, బీసీలు జయహో చంద్రబాబు అంటున్నారు. తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చొని, అవినీతి ప్రణాళికలు వేస్తూ, వీడియో గేమ్ లు ఆడుకోవడంతప్ప, జగన్ రెడ్డి ఏనాడైనా బీసీల గురించి ఆలోచించాడా? రాష్ట్రాన్ని తనజాగీరుగా మార్చి 5గురు రెడ్లకు అప్పగించిన జగన్ రెడ్డి, ప్రజాకంటకపాలన సాగిస్తు న్నాడు. తనకు ఊడిగంచేసే ఒకరిద్దరికి ఉన్నతపదవులిచ్చి, బీసీలు తనకు వెన్నెముక, నేను వారికి జున్నుముక్క అంటూ జగన్ రెడ్డి కహానీలు చెబుతున్నాడు. చంద్రబాబు బీసీనేతలకు పదవులిచ్చినా, ఉపాధి, ఉద్యోగాలకల్పన విషయంలో బీసీల ను అగ్రస్థానంలో నిలిపాడు. వారిని ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అన్నిరంగాల్లో ఉన్నతుల్ని చేశాడు.

బీసీలకు చంద్రబాబుచేసిన మేలు, జగన్ రెడ్డి చేసినద్రోహంపై చర్చించడానికి సిద్ధం….
వైసీపీ బీసీప్రజాప్రతినిధులు, బీసీమంత్రులు ఎప్పుడు, ఎక్కడికి రమ్మంటే అక్కడికి రావడానికి నేను రెడీ. చంద్రబాబు, జగన్ ల హయాంలో బీసీలకు జరిగిన మేలు, వారి సంక్షేమానికి వారిద్దరూ చేసిన ఖర్చు, ఇతరత్రా వివరాలపై చర్చించడానికి సిద్ధంగా ఉన్నా. సీదిరి అప్పలరాజు, జోగిరమేశ్ లకు డైరెక్ట్ గా ఇదేవిషయంపై సవాల్ విసురుతున్నా. అవినీతికి మారుపేరైన వారిద్దరికీ దేవాలయంలాంటి టీడీపీకార్యాలయంలో అడుగుపెట్టే అర్హతలేదు. అందుకే బీసీలకోసం అవసరమైతే నేనే వైసీపీ కార్యాలయానికి వెళ్లడానికి కూడా నేను సిద్ధమే. జగన్మోహన్ రెడ్డి నేడు బీసీలగురించి చెప్పినదానిపై కూడా మాట్లాడతాను. మత్స్యకారులు నోట్లో మట్టికొట్టిన జగన్ రెడ్డి, సీదిరి అప్పలరాజుకి మంత్రి పదవిస్తే సరిపోతుందా?

కల్లుగీత కార్మికుల జీవితాల్ని తన నకిలీమద్యానికి బలిచేసిన జగన్ రెడ్డి, జోగిరమేశ్ కు మంత్రి పదవిస్తే గీతకార్మికులకు న్యాయం జరుగుతుందా? ‘జయహో బీసీ’ తప్ప మరోపేరుదొరకని జగన్ రెడ్డి బీసీలను ఉద్ధరిస్తాడా? వైసీపీ ఎమ్మెల్యే నాయీబ్రాహ్మణుల్ని మంగలోళ్లు అని వెటకారంగా మాట్లాడినప్పుడు జగన్ అతన్ని ఎందుకు వారించలేదు? బీసీమంత్రులపై రెడ్లను పెత్తందారులుగా నియమించినప్పుడు జగన్ రెడ్డికి బీసీసాధికారత గుర్తురాలేదా? యూనివర్శీటీ వైస్ ఛాన్సలర్లు సహా, టీటీడీబోర్డు లాంటి ఉన్నతస్థానాల్లో మొండిచెయ్యి చూపించడమేనా జగన్ రెడ్డి బలహీనవర్గాలకు చేసిన మంచి?

మత్స్యకారులకు 90శాతం సబ్సిడీపై చంద్రబాబు పనిముట్లు, పడవలు ఇస్తే, జగన్ వచ్చాక డీజిల్ రాయితీ కూడా తీసేశాడు. బీసీలకు చంద్రబాబు ఇచ్చిన ఆదరణ పనిముట్లు, ఇతర విలువైన వస్తువుల్ని జగన్ పాతసామాన్లవాళ్లకు అమ్మేసినట్టున్నాడు. నాయీ బ్రాహ్మణులు, మత్స్యకారులు, దర్జీల జీవితాల్ని జగన్ ఏం మార్చాడో చెప్పాలి. బీసీనేతల్ని జగన్ హత్యచేయిస్తుంటే, విజయసాయి బీసీభూముల్ని లాక్కుంటున్నాడు. కుర్చీలు, నిధులు లేని కార్పొరేషన్లకు ఛైర్మన్లు, డైరెక్టర్లుగా ఉన్నవారు తోటిబీసీలకు న్యాయంచేశారని జగన్ రెడ్డి చెబితే నమ్మేవారు ఎవరూలేరు. నేడు వైసీపీ బీసీసభలో వేసిన కుర్చీల్లో సగం కూడా, ఈ ప్రభుత్వం బీసీ కార్పొరేషన్లకు ఇవ్వలేదు. పనికిరాని పదవులతో బీసీలకు న్యాయం జరగదని జగన్ రెడ్డి తెలుసుకుంటే మంచిది” అని వెంకన్న హితవుపలికారు.

LEAVE A RESPONSE