– టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్
కావలి ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి ఆదేశాలతో పోలీసులు పెడుతున్న టార్చర్ భరించలేక దళితుడైన తెలుగు యువత జిల్లా ఉపాధ్యక్షుడు పైడి హర్ష ఎమ్మెల్యే ఇంటి ముందే పురుగులు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడడం తీవ్ర విచారకరం. రక్షించాల్సిన ఖాకీలే కాలనాగుల్లా కాటేస్తుండడం దారుణం. హర్ష త్వరగా కోలుకోవాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నాను. ఆయనకి అన్నివిధాలా తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది.