– మాపార్టీ సాయంపై మాట్లాడే హక్కు జగన్ కు లేదు
• కందుకూరు మృతుల కుటుంబాలకు టీడీపీ చేసిన ఆర్థికసాయంపై, విషప్రచారం వైసీపీ దిగజారుడుతనం, నీతిమాలినతనానికి నిదర్శనం
• టీడీపీపై, చంద్రబాబుపై విషప్రచారం చేస్తే జగన్, అతని పేటీఎమ్ బ్యాచ్ జైలుపక్షులవ్వడం ఖాయం
• వైసీపీ సోషల్ మీడియా నిర్వాహకులు వారిపుట్టుకను ప్రశ్నించుకోవాలి : ఎం.ఎస్.రాజు
– టీడీపీ ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబు, టీడీపీ ఎస్సీసెల్ రాష్ట్ర అధ్యక్షులుఎం.ఎస్.రాజు
కడుపుకు అన్నంతినేవాడు ఎవడూ ఇలా దుష్ప్రచారం చేయడు : అశోక్ బాబు
“కందుకూరు దుర్ఘటనలో మృతిచెందిన వారి కుటుంబాలకు చంద్రబాబు ఇచ్చిన చెక్కులు బౌన్స్ అయ్యాయని వైసీపీ సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారు. కడుపుకు అన్నం తినేవాడు, బుద్ధి, జ్ఞానం ఉన్నవాడెవడైనా అలాచేస్తాడా? తెలుగుదేశం పార్టీ ఇచ్చిన చెక్ లు క్లియరై, బాధిత కుటుంబాల బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు జమయ్యాయి. కందుకూరు మృతుల కుటుంబాలకు టీడీపీ చేసిన ఆర్థికసాయంపై, దుష్ప్రచారం వైసీపీ దిగజారుడుతనానికి నిదర్శ నం. కందుకూరు మృతుల కుటుంబాలకు న్యాయంచేసే విషయంలో తెలుగుదేశం చేసినట్టు ఎవరూ చేయలేదు. పార్టీపరంగా ఒక్కో కుటుంబానికి రూ.30లక్షల ఆర్థికసహాయం చేశారు. భారతదేశంలోనే ఇంతగొప్పగా సాయంచేసిన చరిత్ర ఏ పార్టీకి, ప్రభుత్వానికి లేదు. కందుకూరులో పేదల్ని చంద్రబాబే చంపించాడని వైసీపీ దుష్ప్రచారం చేసింది. దుర్ఘటన జరిగి న వెంటనే మా అధినేత స్పందించిన తీరు వైసీపీ విషప్రచారాన్ని పటాపంచలు చేసింది. చంద్రబాబు మాదిరి జగన్మోహన్ రెడ్డి ఏనాడూ తనకార్యకర్తల విషయంలో మానవత్వంతో స్పందించలేదు. ఓదార్పు యాత్రలో 17మంది చనిపోతే, జగన్ రెడ్డి ఒక్క కుటుంబానికి కూ డా రూపాయి ఇవ్వలేదు. తెలుగుదేశం పార్టీ కందుకూరు మృతులకుటుంబాలకు చేసిన సాయంపై విషం చిమ్ముతున్నాడు. అన్నం తినేవాడు ఎవడూ ఇలా హీనాతిహీనంగా ప్రవర్తించడు. మాపార్టీ చేసిన సాయంపై మాట్లాడే హక్కు అసలు జగన్ కు లేదు.
ప్రజలు చనిపోతే, ఎలా స్పందించాలనే ఇంగితంకూడా జగన్ రెడ్డికి లేదు
ఎల్జీ పాలిమర్స్ దుర్ఘటనలో చనిపోయినవారికి రూ.కోటి, కచ్చులూరు బోటుప్రమాదంలో మరణించిన వారికి రూ.5లక్షలిచ్చిన జగన్, కందుకూరు మృతుల కుటుంబాలకు మాత్రం కంటితుడుపు చర్యగా రూ.2లక్షలతో సరిపెట్టాడు. కేంద్రప్రభుత్వం రూ.2లక్షలిస్తే, అప్పుడు స్పందించకపోతే బాగోదని రాష్ట్రప్రభుత్వం తరుపున రూ.2లక్షలు ప్రకటించాడు. ప్రజలు ఎవరు చనిపోయినా ఒకేరకంగా స్పందించాలనే ఇంగితంకూడా జగన్ రెడ్డికి లేదు. వైసీపీ సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారంపై జగన్ సమాధానం చెప్పాల్సిందే. గత ప్రభుత్వం ఇచ్చిన సీఎంఆర్ఎఫ్ చెక్కుల్ని క్లియర్ చేయలేని జగన్ రెడ్డి, సిగ్గులేకుండా మేం చేసిన ఆర్థికసాయంపై విషప్రచారం చేస్తున్నాడు. ఓదార్పుయాత్ర, ఎల్జీ పాలిమర్స్, కచ్చులూరు బోటుప్రమాదం, బస్సుప్రమాదం గానీ మరణించిన వారి కుటుంబాలకు జగన్ పార్టీలైన్లో డబ్బులిచ్చాడుగానీ, ప్రభుత్వపరంగా ఇవ్వలేదు.”
తెలుగుదేశంపై, చంద్రబాబుపై విషప్రచారం చేసే వైసీపీ సోషల్ మీడియా నిర్వాహకులు వారి పుట్టుకను ప్రశ్నించుకోవాలి : టీడీపీ ఎస్సీసెల్ రాష్ట్ర అధ్యక్షులు ఎం.ఎస్.రాజు
“ కందుకూరు దుర్ఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించిన తీరు మానవత్వానికే మెచ్చుతునక. దానిపై వైసీపీసోషల్ మీడియా చేస్తున్న దుష్ప్రచారం నీచాతినీచం. ఇలాంటి వాటిపై విషప్రచారం చేసే వైసీపీ సోషల్ మీడియా నిర్వాహకులు వారిపుట్టుకను ప్రశ్నించుకుంటే మంచిది. కార్యకర్తలకోసం ప్రత్యేకంగా సంక్షేమనిధి, ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా కార్యకర్తల కుటుంబాలను, వారిపిల్లలను ఆదుకోవడం అనేది తెలుగుదేశానికి మాత్రమే సాధ్యం. గతంలో మండపేటలో జగన్ మీటింగ్ లో గోడకూలి 40మందికి తీవ్రగాయాలయ్యాయి. కొందరు చనిపోయారుకూడా..కానీ ఆనాడు మీటింగ్ ఆపని కుసంస్కారి జగన్ రెడ్డి. మీటింగ్ తర్వాతకూడా బాధితుల్ని పరామర్శించని రాక్షసుడు జగన్ రెడ్డి. ఓదార్పుయాత్ర, పాద యాత్రలో చనిపోయిన తనపార్టీవారు, అభిమానుల కుటుంబాలకు జగన్ రెడ్డి రూపాయి ఇచ్చిందిలేదు.
జగన్ రెడ్డి దుర్మార్గానికి బలైన కుటుంబాలను కూడా టీడీపీ ఆదుకుంది
వైసీపీఎమ్మెల్సీ అనంతబాబు దళితుణ్ణి హత్యచేస్తే, మృతుడి కుటుంబానికి చంద్రబాబు గారు రూ.5లక్షలిచ్చారు. ఆ సొమ్ముని నేనే ఆ కుటుంబానికి ఇచ్చాను. జగన్ రెడ్డి హాయాంలో అత్యాచారానికి గురైన బాధితురాళ్లకు, వారి కుటుంబాలకు టీడీపీ అధినేత చంద్రబాబు ఆర్థికసాయం చేశారు. కావలిలో దళితయువకుడు కరుణాకర్ చావుకి కారణమైన వైసీపీనేతలపై ముఖ్యమంత్రి ఏంచర్యలు తీసుకున్నాడు? ఇద్దరు ఆడపిల్లలున్న కరుణాకర్ కుటుంబం రోడ్డునపడకూడదని, నారాలోకేశ్ గారు రూ.30లక్షలిచ్చారు, దానికి నేనేసాక్ష్యం. కావలిలో మరోదళితయువకుడు ఎమ్మెల్యే వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యాయత్నంచేస్తే అతని వైద్యఖర్చులకోసం టీడీపీ రూ.11లక్షలు ఇచ్చింది.
రాయలసీమప్రాంతంలో ఫ్యాక్షన్ గొడవల్లో చనిపోయిన కుటుంబాల్లోని పిల్లలుసహా, రాష్ట్రంలోని అనేకమంది అనాథల్ని ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా తెలుగుదేశం చదివిస్తోంది. జగన్ రెడ్డి పుట్టింది మొదలు ఎవరికైనా ఇలాంటి సాయం చేశాడా? శివకుమార్ అనే వ్యక్తి నుంచి పార్టీని లాక్కున్న ఫేక్ నా డాష్ గాళ్లు కాబట్టే.. ఇలాంటి ఫేక్ ప్రచారాలు చేస్తారు. వైసీపీ సోషల్ మీడియా అఫీషియల్ పేజ్ నిర్వాహాకుల్ని చెప్పుతో కొట్టినా తప్పులేదు. (ఈ సందర్భంగా ఎం.ఎస్.రాజు వైసీపీ సోషల్ మీడియా పేజ్ ని చెప్పుతో కొట్టారు) జైలుపక్షి జగన్ రెడ్డి ఆయన సోషల్ మీడియా, మానవతావాది అయిన చంద్రబాబుపై కువిమర్శలు చేయడం మండుతున్న సూర్యుడిపై ఉమ్మేయడమే అవుతుంది.”