-రోడ్డుప్రమాదంతో మంచంపట్టిన యువకుడు
-అప్పటి సీఎం చంద్రబాబు రూ.16లక్షల సాయంతో వైద్యం
-చంద్రబాబు సాయంతోనే నడవగలుగుతున్నానని లోకేష్‌కి థ్యాంక్స్ చెప్పిన తేజ
కుప్పం పాదయాత్రలో లోకేష్‌ని హత్తుకుని కన్నీళ్లు పెట్టుకున్న తేజ ఊరు మొరసన పల్లి. నాలుగేళ్ల క్రితం తేజ నవ్వుతూ తుళ్లే యువకెరటం. రోడ్డు ప్రమాదంతో మంచం పట్టాడు. తమ నియోజకవర్గ ఎమ్మెల్యే, అప్పటి సీఎం చంద్రబాబు అందించిన రూ.16లక్షల సీఎం సహాయనిధితో ఇదిగో ఇలా నడవగలుగుతున్నాడు. చంద్రబాబు చేసిన సాయంతోనే తాను కోలుకున్నానని, ఆయన తనయుడు లోకేష్‌కి కృతజ్ఞత తెలియజేసుకుంటానని యువగళం పాదయాత్రకి వచ్చాడు. అధైర్యపడొద్దు మేమున్నామంటూ లోకేష్ హత్తుకోవడంతో తేజ ఆనందభాష్పాలు రాల్చాడు. ఏమిచ్చి చంద్రబాబు రుణం తీర్చుకోగలనంటూ కన్నీటిపర్యంతమయ్యాడు. తండ్రి చచేసిన మేలుని మరవని తేజ తనయుడికి కృతజ్ఞత చెప్పేందుకు అతికష్టమ్మీద నడిచి రాగా, ఆత్మీయంగా పలకరించిన లోకేష్ ఓ సెల్ఫీ దిగారు.