జగన్ రెడ్డిదే డబుల్ ఐరన్ లెగ్

Spread the love

– లోకేష్ పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరధం పడుతున్నారు
– ఓటమి భయంతోనే లోకేష్ పాదయాత్రపై వైసీపీ నేతలు విషం చిమ్ముతున్నారు
– పాదయాత్ర పూర్తయ్యే లోపు వైసీపీ నేతలు వీసా ప్రక్రియ పూర్తి చేసుకోండి
– టీడీపీ శాసనమండలి సభ్యులు మంతెన సత్యనారాయణ రాజు

లోకేష్ పాదయాత్రతో సీఎం జగన్ రెడ్డి సహా వైసీపీ నేతలకు ఓటమి భయం పట్టుకుంది. అందుకే లోకేశ్ పాదయాత్రపై ప్రతి నిమిషం విషం చిమ్ముతున్నారు. మంత్రి రోజా పర్యాటక శాఖను గాలికొదిలి సొంత పర్యనటల్లో మునిగి తేలుతున్నారు. జబర్దస్త్ లో డాన్సులు, రాజకీయాల్లో బూతులు తప్ప రోజా ఇంకేం తెలుసు. తారక రత్న అస్వస్తతపై వైసీపీ నేతలు నీచ రాజకీయం చేస్తున్నారు. తండ్రి శవాన్ని పక్కనపెట్టుకుని సంతకాలు సేకరించిన వారికి, సొంతబాబాయిని దారుణంగా చంపినవారికి శవ రాజకీయాలు కొత్తేం కాదు. జగన్ రెడ్డి లెగ్ డబుల్ ఐరన్ లెగ్ , తన పాదయాత్రలో వైసీపీ కార్యకర్తల్ని బలితీసుకున్న జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక తన చేతకాని పాలనతో ప్రజల ప్రాణాలు తీస్తున్నారు. జగన్ రెడ్డి అమ్ముతున్న కల్తీ మద్యం త్రాగి మూడున్నరేళ్లలో వందలాదిమంది చనిపోయారు. కోవిడ్ టైంలో ఆక్సిజన్ అందక వేలాది మంది చనిపోయారు. రాష్ట్రంలో అస్తవ్యస్తంగా ఉన్న రోడ్లపై ప్రమాదాలు జరిగి రోజు ఎన్నో ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. వీటన్నింటికి కారణం జగన్ రెడ్డి కాదా?

లోకేష్ పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరధం పడుతున్నారు. మీరు ఎన్ని కుట్రలు చేసినా పాదయాత్రను అడ్డుకోలేరు, టీడీపీ గెలుపును ఆపలేరు. టీడీపీ అధికారంలోకి వచ్చాక వైసీపీ నేతలు ఇతర దేశాలకు పారిపోక తప్పదు. అందుకే పాదయాత్ర పూర్తయ్యే లోపు వైసీపీ నేతలు వీసా ప్రక్రియ పూర్తి చేసుకోండి.

Leave a Reply