– మాజీ మంత్రి డాక్టర్ నిమ్మల కిష్టప్ప
నిన్న ప్రధానమంత్రి పంచిన సొమ్ముకు నేడు ముఖ్యమంత్రి బటన్ నొక్కుడు ఏమిటి ? ప్రధానమంత్రి ఇచ్చిన 2 వేలుకు అదనంగా నేడు మరో 2 వేలు మీ బటన్ నొక్కుడుతో రైతులకి ఇవ్వకపోవడం దగా మోసం కదా? రైతులు అమ్ముకున్న ధాన్యం సొమ్ములు 55 వేల కోట్లు కూడా రైతులకు ఆర్థిక సాయం గా ప్రకటనలు చేసుకొనే స్థాయికి మీరు దిగజారి పోయారు. 65 లక్షల మంది రైతులకు రైతు భరోసా అని చెప్పి, నేడు 45 లక్షల మందికే రైతు భరోసా ఇవ్వడం మోసం దగా కదా? 15 లక్షల మంది కౌలు రైతులకు రైతు భరోసా అని చెప్పి, నేడు 49 వేల మందికి మాత్రమే రైతు భరోసా ఇవ్వడం మోసం దగా కదా? రూ.13,500 రైతు భరోసా ఇస్తానని రూ. 7,500 మాత్రమే ఇవ్వడం ద్వారా ఒక్కొక్క రైతు సంవత్సరానికి 6,000 రూపాయల చొప్పున 5 సంవత్సరాలలో 30 వేలు రూపాయలు నష్టపోతున్నాడు. అసత్య, అబద్ధపు ప్రకటనలు ఇచ్చిన ప్రకటన ఖర్చు జగన్ సొంత జేబులో నుండి వసూలు చెయ్యాలి. చీటింగ్ కేసు నమోదు చెయ్యాలి.