Suryaa.co.in

Andhra Pradesh

మహిళలు బాగుంటేనే సమాజం బాగుంటుంది

– మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ

మహిళలు బాగుంటేనే కుటుంబం పిల్లలు సమాజం బాగుంటుందని, మహిళలు తమను తాము ప్రేమించుకోవడంతో పాటుగా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని మహిళ కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ అన్నారు. జాతీయ మహిళా కమిషన్ మరియు ఆంధ్ర ప్రదేశ్ మహిళా కమిషన్ సంయుక్తంగా ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం లో నిర్వహించిన సెమినార్ కు ముఖ్యఅతిథిగా వాసిరెడ్డి పద్మ పాల్గొన్నారు..
తొలుత నాగార్జున విశ్వవిద్యాలయ ప్రాంగణంలోని క్లినిక్ నందు మహిళలకు ఉచిత వైద్య శిబిరాన్ని చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ ప్రారంభించారు…. బిపి, షుగర్, క్యాన్సర్ వంటి రోగాలు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వాటికి సంబంధించిన టెస్టుల వివరాలను వైద్యులు వాసిరెడ్డి పద్మాకు వివరించారు.

అనంతరం విశ్వవిద్యాలయం ప్రాంగణంలోని ఆడిటోరియం నందు సెమినార్ ను జ్యోతి ప్రజ్వలన చేసి వాసిరెడ్డి పద్మ ప్రారంభించారు….. సమస్యలు వస్తే పరిష్కారం ఏం చేయాలి. ఆరోగ్య సమస్యలపై అవగాహన జాగ్రత్తలు ఎలా ఉండాలి అని డాక్టర్ శారద మరియు డాక్టర్ రాధిక మాటలు ప్రేరణగా ఉన్నాయి అన్నారు. హెల్త్ అండ్ వెల్ నేస్ అనే టాపిక్ లపై రెండు వైపులా అంటే సమస్యలకు కారణాలు మరియు ఇంత అద్భుతంగా ప్రసంగం ఇచ్చిన వారిద్దరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలిపారు.. ఈ సెమినార్ పెట్టిన కారణం సఫలమైంది అనుకుంటున్నాను. సెమినార్ లో మహిళల ఆరోగ్యంపై ప్రత్యేకంగా మాట్లాడుకుంటున్నాం. అందరికీ ఆరోగ్యం అవసరం. మహిళలకు వచ్చే ఆరోగ్య సమస్యలు చాలా ప్రత్యేకం. మహిళలకు ఆరోగ్య సమస్యలు ఎందుకు వస్తాయి అనేదానికి కారణాలు కూడా ప్రత్యేకంగా ఉంటాయి.

నాణ్యమైన పోషకాహారం తీసుకునే విషయంలో కుటుంబాల్లో కూడా మహిళలకు తక్కువ ప్రాధాన్యత ఇవ్వటం జరుగుతుంది. అనాదిగా వస్తున్న సంస్కృతి వల్ల, కుటుంబం నేపద్యo ఆర్ధిక పరిస్థితి మనస్తత్వం సంప్రదాయాలు ఇలాంటి ఎన్నో పేర్లుతో మొత్తం కుటుంబాన్ని మహిళలు నడపాల్సిన వారిగా ఉన్నారు తమ ఆరోగ్యం పట్ల మహిళలు శ్రద్ధ తీసుకోవాలి. మహిళలు బాగుంటేనే కుటుంబం పిల్లలు సమాజం కూడా బాగుంటారు. మహిళలు తమను తాము ఆరోగ్యాన్ని కూడా ప్రేమించుకోవాలి. తమ ఆరోగ్యంపై తామే శ్రద్ధ తీసుకోవాలి. అది మానసిక ఆరోగ్యం లేదా శారీరక ఆరోగ్యం ఏదైనా కావచ్చు.

పంచభూతాలతో మమేకమై ఉండడం అంటే మానసికంగా బలంగా ఉండాలి. మహిళల్లో ఆరోగ్య సమస్యలు క్యాన్సర్ కి దారి తీస్తున్నాయి. ఇందుకు ప్రధాన కారణం శాస్త్రీయంగా సాంస్కృతికంగా దారి తీసిన భావోద్వేగాలు కావచ్చు భావోద్వేగాలను కంట్రోల్ చేసుకోవడం మహిళలకు పెద్ద పరీక్ష. మహిళలు ప్రకృతితో మమేకంగా నడవాలి మనల్ని మనం ప్రేమించుకోవడం సంతోషంగా ఉండడం అలవర్చుకోవాలి మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి అని ఈ సెమినార్ ద్వారా అర్థమయింది. ఆరోగ్యం మహాభాగ్యం అనే వారు. ఈ విషయం కరోనా పరిస్థితుల తర్వాత చాలా బాగా అర్థమయింది. సమాజంలో చాలా మార్పులు వస్తాయి. ఇల్లు కుటుంబం మానవ సంబంధాలు ప్రాధాన్యత అనేది మళ్లీ ఒకసారి మన ముందుకు తెస్తున్న పరిస్థితి.

మహిళలు బాగుంటేనే కుటుంబం బాగుంటుంది. మహిళలు ఆరోగ్యం పట్ల చాలా శ్రద్ధ వహించాలి. మహిళలకు క్యాన్సర్ పై అవగాహన కల్పించడానికి కృషి చేస్తున్న డాక్టర్ శారద గారికి అభినందనలు తెలిపారు. అనంతరం మహిళా కమిషన్ సభ్యురాలు వినీత , యూనివర్సిటీ వైస్ ఛాన్స్ లర్ రాజశేఖర్, యూనివర్సిటీ రిజిస్టర్ శాంతి శ్రీ, డాక్టర్ శారద, డాక్టర్ రాధిక, మహిళ కమిషన్ సెక్రటరీ వై .శైలజ తదితరులు ప్రసంగించారు.

LEAVE A RESPONSE