సికింద్రాబాద్ : ఏప్రిల్ లో జరిగే డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ జన్మ దిన వేడుకలను పురస్కరించుకొని తెలంగాణా లోని వివిధ క్రీడా జట్ల మధ్య బీ.ఆర్. ఎస్ సికింద్రాబాద్ విభాగం అధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించ నుంది. ఈ టోర్నమెంట్ గోడ పత్రికను డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ సికింద్రాబాద్ లోని తన అధికారిక నివాసంలో ఆవిష్కరించారు.
భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం సికింద్రాబాద్ నియోజకవర్గ నాయకులు యాదా క్రాంతి ఆధ్వర్యంలో ఈ టోర్నమెంట్ ను నిర్వహిస్తున్నారు. యువతను అన్ని రంగాల్లో తాము ప్రోత్సహిస్తున్నామని, క్రికెట్ టోర్నమెంట్ విజయవంతం కావాలని డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ ఈ సందర్భంగా ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో బీ ఆర్ఎస్ నాయకులు సుంకు రామచందర్ , మంద జగన్, మరియు టిఆర్ఎస్వి నాయకులు ప్రశాంత్, పృథ్వి, అనిల్, రాఘవేంద్ర, హేమంత్, ప్రణీత్ తదితరులు పాల్గొన్నారు.– డిప్యూటీ స్పీకర్ శ్రీ పద్మారావు గౌడ్ గారి క్యాంపు కార్యాలయం ద్వారా 28.2.2023 నాడు జారీ చేయబడింది.