Suryaa.co.in

Telangana

దేశవ్యాప్తంగా బిఆర్ఎస్ పార్టీ లో చేరికల పరంపర

దేశవ్యాప్తంగా బిఆర్ఎస్ పార్టీ లో చేరికల పరంపర కొనసాగుతూనే వున్నది. మహారాష్ట్ర నుంచి వివిధ పార్టీలకు చెందిన పలువురు రాజకీయ నేతలు నేడు బిఆర్ఎస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు సిఎం కేసీఆర్ సమక్షంలో ఆ పార్టీలో చేరారు. తెలంగాణ లో జరుగుతున్న అభివృద్ధి దేశవ్యాప్తంగా విస్తరించాలని అందుకు తమ రాష్ట్రంలో తమ వంతుగా కృషి చేస్తామని వారు తెలిపారు. దేశంలో కిసాన్ సర్కార్ కోసం అధినేత సిఎం కేసీఆర్ ఆదేశానుసారం పార్టీ బలోపేతం కోసం పనిచేస్తామనివారన్నారు.

ఈ సందర్భంగా బిఆర్ఎస్ పార్టీలో చేరినవారిలో..
మహారాష్ట్ర మాజీ ఎమ్మెల్యే వసంత్ రావ్ బోండె , కాంగ్రెస్ పార్టీ కి చెందిన మాజీ జనరల్ సెక్రటరీ విఠల్ నాయక్, కాంగ్రెస్ పార్టీ జెడ్ పి సభ్యులు సరిత వర్కడ్, కిన్వత్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే పదవికి పోటీ చేసిన, ఎంఎన్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ధన్ లాల్ పవన్ , నాందేడ్ జెడ్ పి సభ్యుడు నందతాయ్ పవార్, శిర్షేనా, నాందేడ్ జిల్లా మాజీ అధ్యక్షులు సునిత భబలికన్, ఎన్ సిపి మహిళా అఘాడీ జిల్లా మాజీ జనరల్ సెక్రటరీ యశోదతాయ్ కోలి, పర్హాన్ జనశక్తి పార్టీ తాలూకా మాజీ అధ్యక్షులు దిలీప్ నాయక్, లహాన్ జెడ్ పి సర్కిల్ అర్ధాపూర్ అరవింద్ దేశ్ ముఖ్, పంచాయత్ సమితి సభాపతి, కిన్వత్ ఎమ్మెల్యేగా పోటీ చేసిన రాంరెడ్డి రాంకిష్టు, హిందూ యువ పరిషత్ అధ్యక్షులు రంజిత్ దేశ్ ముఖ్, బిజెపి యువ మోర్చా తాలూకా జనరల్ సెక్రటరీ వైభవ్ కాలే, హాలేగావ్ మాజీ సర్పంచ్ గజానన్ ధుమలే, లహన్ పంచాయత్ సమితి – శిర్సేనా అధ్యక్షులు బాబూ రావ్ కోర్బన్వాడ్, కాంగ్రెస్ పార్టీకి చెందిన నాందేడ్ మాజీ కార్పోరేటర్ మహ్మద్ ఫరాక్, ఎబివిపి సహాయ్ సంయోజక్ కృష్ణ ఇంగిల్, ఎబివిపి ప్రెసిడెంట్ జాషశ్రీ ఇల్లెదుల, వంచిత్ బహుజన్ పార్టీ, కార్యదర్శి రాజేష్ సోలంకి, నాందేడ్ డిస్ట్రిక్ట్ బార్ అసోసియేషన్ మెంబర్ గణేష్ జాదవ్ ( అడ్వొకేట్), పిర్ బూషణ్ వార్డు ప్రెసిడెంట్ సలీమ్ సయ్యద్ , యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ మహ్మద్ షోయిబ్ లు పార్టీలో జాయినయ్యారు.

త్వరలో చేరనున్న మరికొందరు జెడ్ పి సభ్యులు :
లింబ్ గావ్ నాందేడ్ నార్త్ జెడ్ పి నియోజకవర్గం నుంచి సాహెబ్ రావు ధనగే , కురుల కాంధార్ జెడ్ పి నియోజకవర్గం నుంచి బాలాసాహెబ్ గమారే, కిన్వత్ నియోజకవర్గం మాజీ వైస్ ఛైర్మన్లు, జెడ్ పి నాందేడ్ సమాధాన్ జాదవ్, ప్రకాష్ గబ్బా తదితరులున్నారు.

LEAVE A RESPONSE