Suryaa.co.in

Andhra Pradesh

వైవి సుబ్బారెడ్డిపై చర్యలు తీసుకోరా?

ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోలింగ్ రోజు విశాఖలో స్థానికేతరుడైన వైవి సుబ్బారెడ్డి బూత్ ల వద్ద పర్యటనపై ఎన్నికల ప్రధాన అధికారికి మూడు రోజుల క్రితం టీడీపీ అధినేత చంద్రబాబు ఫిర్యాదు
– నాడు విధుల్లో ఉన్న ఫ్లైయింగ్ స్క్యాడ్, తహసీల్దార్, స్టేషన్ హౌస్ ఆఫీసర్ లకు షో కాజ్ నోటీసులు ఇచ్చినట్లు రిప్లై లేఖలో తెలిపిన రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి

– అధికారులకు నోటీసులు ఇస్తే సరిపోదని…సుబ్బారెడ్డిపైనా చర్యలు తీసుకోవాలని సీఈవో లేఖకుబదులిస్తూ మరో లేఖ రాసిన చంద్రబాబు

• లేఖలో అంశాలు:-
• ఎమ్మెల్సీ ఎన్నికల్లో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ను ఉల్లంఘించిన వైసీపీ నేత వైవి సుబ్బారెడ్డిపై చర్యలు తీసుకోవాల్సిందే
• పోలింగ్ రోజు అక్కయ్యపాలెం ఎన్జీఓఎస్ కాలనీ, జీవీఎంసీ హైస్కూల్‌లోని పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లను ప్రభావితం చేసేలా సుబ్బారెడ్డి ప్రయత్నించారు.
• స్థానికేతరుడు అయిన సుబ్బారెడ్డి పోలింగ్ సరళిని పర్యవేక్షిస్తూ పోలింగ్ బూత్‌ వద్ద నిబంధనలకు విరుద్దంగా తిరిగినా అధికారులు చర్యలు తీసుకోలేదు.
• ఘటనపై మేం ఫిర్యాదు చేసే వరకు అధికారులు దీనిపై స్పందించలేదు.
• MCC అమలు చేయాల్సిన రిటర్నింగ్ అధికారి, సిటీ పోలీస్ కమిషనర్ తమ విధులను నిర్వర్తించకుండా అధికార వైఎస్సార్‌సీపీకి మొగ్గు చూపారు.
• వైవీ సుబ్బారెడ్డి పర్యటనను ఎన్నికల అధికారులు, పోలీసులు దృవీకరించారు. ఈ కారణంగా వైవీ సుబ్బారెడ్డిపై చర్యలు తీసుకోవాల్సి ఉంది.
• ఇటువంటి ఉల్లంఘనలపై చర్యలు తీసుకోకపోతే ఇవి నిబంధనలను అపహాస్యం చేస్తాయి.
• ఈ ఘటనలో అలసత్వం వహించిన అధికారులతో పాటు నిబంధనలు ఉల్లంఘించిన సుబ్బారెడ్డిపైనా చర్యలు తీసుకోవాలి.
• తగు చర్యలు తీసుకోవడం ద్వారా ఎన్నికలు ప్రజాస్వామ్య బద్దంగా జరిగాయని ప్రజల్లో నమ్మకం కలిగించాల్సి ఉంది.

LEAVE A RESPONSE