Suryaa.co.in

Andhra Pradesh

జగన్ ఢిల్లీపర్యటన అవినాశ్ రెడ్డిని కాపాడటానికే… కాదని చెప్పగల ధైర్యం ముఖ్యమంత్రికి ఉందా?

– 18సార్లు సీఎం ఢిల్లీ వెళ్తే, మొదట్లో ఏంచెప్పారో, ఇప్పుడు అదేచెబుతున్నారు. ప్రభుత్వం ఇచ్చిన ప్రతికాప్రకటనలో అక్షరం మారలేదు.
• ఢిల్లీవెళ్లి ప్రధానితో మాట్లాడి, జగన్ రాష్ట్రానికి ఏంసాధించాడో ఆయనే చెప్పాలి. అప్పులఅప్పారావు బుగ్గనతో ఆవుకథలు చెప్పిస్తే ప్రజలు నమ్మరు : అచ్చెన్నాయుడు.
• తనఢిల్లీపర్యటనపై మంత్రులు, ఎమ్మెల్యేలతో పిచ్చికూతలు కూయించకుండా, జగనే నోరువిప్పాలి : డోలా బాలవీరాంజనేయస్వామి.
• చంద్రబాబు 85శాతం నిర్మించిన టిడ్కోఇళ్లను పూర్తిచేసి, పేదలకు అందించలేని జగన్ పేదలద్రోహికాక ఏమవుతాడు? : రామానాయుడు.
• ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటనపై మంత్రి డ్రామాల రాంబాబు దీర్ఘాలు తీశాడు. ఇరిగేషన్ మంత్రి, అధికారులు లేకుండానే జగన్ పోలవరంపై, ప్రధానితో చర్చించాడా? : దీపక్ రెడ్డి
కింజరాపు అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడు, డోలా బాలవీరాంజనేయస్వామి (టీడీపీ శాసనసభ్యులు) దీపక్ రెడ్డి (టీడీపీ ఎమ్మెల్సీ)

జగన్ ఢిల్లీ పర్యటనపై అప్పుల అప్పారావు బుగ్గన ఆవు కథ చెప్పాడు : అచ్చెన్నాయుడు
“విభజనచట్టంలోని హామీలసాధనకోసమే జగన్ ఢిల్లీవెళ్లాడని అప్పులఅప్పారావు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి శాసనసభలో ఆవుకథచెప్పాడు. ముఖ్యమంత్రి ఏపనిమీద ఢిల్లీవెళ్తే మీకెం దుకు అని అప్పులఅప్పారావు మమ్మల్ని ప్రశ్నించాడు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి హో దాలో 18సార్లుఢిల్లీ వెళ్లాడు. ఏనాడూ దానిపై మేంసభలో మాట్లాడలేదు. కానీ ఇప్పుడు బడ్జె ట్ సమావేశాలుజరుగుతున్న సమయంలో ముఖ్యమంత్రి హుటాహుటిన ఢిల్లీ వెళ్లారు కాబట్టే తాము ఏం సాధించడానికి ఆయన ఢిల్లీ వెళ్లారో చెప్పాలంటూ వాయిదా తీర్మానం అందించాం. దానికి సమాధానంచెప్పకుండా బుగ్గన మమ్మల్ని తప్పుపట్టాడు. రాష్ట్రంకోసం, ప్రజలకోసం జగన్ ఢిల్లీవెళ్తే, ఆ విషయం చెప్పడానికి బుగ్గనకు ఎందుకంత భయమని ప్రశ్నిస్తున్నాం.

శాసనసభలో జరిగే బడ్జెట్ సమావేశాలకంటే ముఖ్యమంత్రికి ఢిల్లీ పర్యటనే ముఖ్యమా.. ఒక వేళ ముఖ్యమైతే ఏమిటంత ముఖ్యమో ఎందుకు చెప్పలేకపోతున్నారు
జగన్ ఢిల్లీ పర్యటనలన్నీ తనకేసులు మాఫీకోసం చేసినవే. వివేకానందరెడ్డిహత్యకేసు నుంచి బయటపడటానికే జగన్ మొన్నటికిమొన్న హుటాహుటిన ప్రత్యేకవిమానంలో ఢిల్లీ వెళ్లాడు. కాదు..రాష్ట్రప్రయో జనాలకోసమే వెళ్లాలని ఆయన చెప్పగలడా? అదే అయితే, కేంద్ర ప్రభుత్వంలో ఎవరితో ఏంమాట్లాడారో, రాష్ట్రానికి ఎన్నినిధులుసాధించారో, ఏసమస్యల్ని పరిష్కరించారో ముఖ్యమంత్రి ఎందుకు ధైర్యంగా బయటకు చెప్పడంలేదు? వివేకాను చంద్రబాబే చంపించాడని ప్రచారం చేసి, జగన్ గతఎన్నికల్లో లబ్ధిపొందాడు. వివేకాకుమార్తె డాక్టర్ సునీత కోర్టుని ఆశ్రయించబ ట్టే, హత్యకేసు విచారణ సీబీఐవరకు వెళ్లింది. వివేకాను చంపింది ఎంపీ అవినాశ్ రెడ్డేనని, సా క్ష్యాలతో సహా సీబీఐ బయటపెట్టబోతున్న తరుణంలో, అవినాశ్ ను అరెస్ట్ చేస్తారని తేలిపో యిన నేపథ్యంలో ముఖ్యమంత్రి ఢిల్లీపర్యటన ఎవరికైనా అనుమానాలురేకెత్తిస్తుంది. వివేకాహ త్యకేసులో ప్రధాననిందితుడిగా ఉన్న అవినాశ్ రెడ్డితో కలిసి ముఖ్యమంత్రి నిన్నఢిల్లీలోనే తిర గడం దేనికి సంకేతం? తమ్ముడిని కాపాడటానికే ముఖ్యమంత్రి, నిన్నప్రధానమంత్రిని కలిశా రని ప్రజలంతా అనుకంటున్నారు. దానిపై జగన్ ఏంసమాధానం చెబుతారు?

జగన్ ఢిల్లీ ఎందుకెళ్లాడో, ప్రధానితో ఏంమాట్లాడి, రాష్ట్రానికి ఏంసాధించాడో ప్రజలకు చెప్పాలి
ముఖ్యమంత్రి ఢిల్లీపర్యటనలపై మంత్రులు, అధికారులు, సాక్షిమీడియా ఎప్పుడూచెప్పే కట్టు కథనే నిన్నకూడాచెప్పింది. నిన్న ప్రభుత్వం విడుదలచేసిన పత్రికాప్రకటన గమనిస్తే, జగన్ 18సార్లు ఢిల్లీవెళ్లినప్పుడు ఎందుకువెళ్లారని చెప్పారో, నిన్నకూడా అదేచెప్పారు. ఒక్కఅక్ష రంకూడా మారలేదు. మారింది తేదీలు, సమయాలు మాత్రమే. 18సార్లుఢిల్లీ వెళ్లినప్పుడు జగన్ రాష్ట్రానికి ఏంసాధించారో, నిన్నకూడా అదేసాధించడానికి వెళ్లారని చెప్పడానికి నిజంగా ఈప్రభుత్వానికి సిగ్గుందా? మంత్రులు సోయిఉండే అలాచెప్పిందేచెబుతున్నారా? అప్పుల అప్పారావు బుగ్గన సిగ్గులేకుండా చెప్పిందేచెబుతూ, మమ్మల్ని అంటాడా? టీడీపీసభ్యులు శాసనసభకు వెళ్తే అక్కడ మంత్రులు, స్పీకర్ మమ్మల్ని కనీసంగా కూడా గౌరవించడం లేదు . 151మంది గొర్రెలమంద ఉబుసుపోక, పనిలేక అసెంబ్లీలోకూర్చుంటుంటే, వారిని వదిలేసి ప్రజలకోసం ప్రభుత్వాన్ని నిలదీస్తున్నమమ్మల్ని మాత్రం స్పీకర్ అకారణంగా సస్పెండ్ చేస్తున్నాడు. టీడీపీసభ్యులు సభలో ఉండటాన్నే ఓర్చుకోలేకపోతున్నారు. ఎక్కడ తమతప్పు ల్ని, ప్రభుత్వఅవినీతిని టీడీపీఎమ్మెల్యేలు ప్రశ్నిస్తారన్నభయం ముఖ్యమంత్రి, మంత్రుల్లో కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. తనఢిల్లీపర్యటన ఎందుకోసమో, ఏంసాధించడానికో ముఖ్యమంత్రి తక్షణమే సభలో ప్రకటనచేయాలి. అమరావతి నిర్మాణానికి నిధులుసాధించడానికి వెళ్లాడా ..లేక పోలవరం పనులుపూర్తిచేయడానికి సహకరించమని కోరడానికి వెళ్లాడా… వెనుకబడి న జిల్లాలకు నిధులుఅడగడానికి వెళ్లాడా..ఎందుకువెళ్లాడో చెప్పాల్సిందే.”

చంద్రబాబు హయాంలో 85శాతం పూర్తైన టిడ్కో ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి పేదలకు ఇవ్వలేని జగన్ 25లక్షల ఇళ్లు నిర్మిస్తాడా? నిమ్మల రామానాయుడు
“చంద్రబాబు హయాంలో రాష్ట్రవ్యాప్తంగా 8లక్షల టిడ్కోఇళ్లు, 85నుంచి 90శాతం పూర్తైనట్టు, 2019లో అసెంబ్లీలో అప్పటి పట్టణాభివృద్ధిశాఖామంత్రి బొత్ససత్యనారాయణ చెప్పారు. 201 9 నాటికి 85శాతంపూర్తైన టిడ్కోఇళ్లను జగన్ ప్రభుత్వం 4ఏళ్లలో 15శాతంపూర్తిచేయలేకపో వడం సిగ్గుచేటు. సంవత్సరానికి 5లక్షలచొప్పున 5ఏళ్లలో 25లక్షలఇళ్లు కట్టిస్తానన్న తన హామీని కూడా జగన్ నెరవేర్చలేదు. అటు చంద్రబాబు పేదల కోసం కట్టించి ఇళ్లను పూర్తి చేయకుండా పాడుపెట్టి, ఇటు తాను కట్టిస్తానన్నఇళ్లనిర్మాణం విస్మరించిన జగన్ పేదలద్రోహి కాక ఏమవుతాడు. సొంత ఇళ్లు లేక అవస్థలు పడుతున్న పేదలవేదన జగన్ కు వినిపించడంలేదా ? చంద్రబాబు ఇళ్లనిర్మాణంపేరుతో పేదల్ని అప్పులపాలు చేస్తున్నాడని, దుష్ప్రచారంచేసిన జగన్, నాలుగేళ్లు అధికారంలోఉండి కేవలం 5ఇళ్లుమాత్రమే కట్టడం ముమ్మాటికీ దుర్మార్గ మే. టిడ్కో ఇళ్లకోసం జగన్ తనపాలనలో అరకట్టసిమెంట్ కూడా కేటాయించలేదు. జగన్ ఆఖరిఏడాదిలో అయినా చంద్రబాబు హాయాంలో 85శాతం పూర్తయినఇళ్లను 15 శాతంపూర్తిచేసి అర్హులకు అందించాలని డిమాండ్ చేస్తున్నాం. ఆ పనిచేయకుండా 5లక్షల ఇళ్లు కట్టిస్తాను.. సెంటు పట్టాలు ఇస్తాను.. జగనన్నఊళ్లు నిర్మిస్తాను అంటూ, ముఖ్యమంత్రి కల్లబొల్లి మాటలు చెప్పడం మానుకోవాలి. ఇళ్లనిర్మాణంపై జగన్ ప్రభుత్వడొల్లతనంపై సభలో ప్రశ్నించానన్న అక్కసుతోనే స్పీకర్ సభనుంచి నన్ను సస్పెండ్ చేశాడు. టీడీపీఎమ్మెల్యేలు ప్రభుత్వవైఫల్యాలను ఎత్తిచూపుతుంటే, సమాధానంచెప్పుకోలేకనే జగన్, అతని మంత్రులు మమ్మల్ని సభనుంచి బయటకుపంపుతున్నారు. ప్రతిపక్షఎమ్మెల్యేలను సభనుంచి సస్పెం డ్ చేస్తున్న ప్రభుత్వాన్ని ప్రజలే సస్పెండ్ చేయడానికి సిద్ధమయ్యారు. దానికి నిదర్శనం ఎ మ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీఘనవిజయం. వచ్చేఎన్నికల్లో జగన్ ను, అతనిపార్టీని ప్రజలు శాశ్వతంగా సస్పెండ్ చేయడానికి వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు.”

మంత్రులు, ఎమ్మెల్యేలతో పిచ్చికూతలు కూయించకుండా, తనఢిల్లీపర్యటనపై జగనే నోరువిప్పాలి. : డోలా బాలవీరాంజనేయస్వామి
“ఆదివారం కూడా అసెంబ్లీపెట్టి, ప్రతిపక్షసభ్యులుఅందరూ హాజరుకావాలన్న ముఖ్యమంత్రి, ఎవరికీ చెప్పకుండా హుటాహుటిన ఢిల్లీవెళ్లి ఏంసాధించారో చెప్పాలి. మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు మమ్మల్ని తిట్టడానికి శ్రద్ధచూపుతున్నారుగానీ, ప్రజలకు ఏంచేస్తారో చెప్పడం లేదు. ముఖ్యమంత్రి ఢిల్లీవెళ్లి, రాష్ట్రానికి ప్రజలకు ఏంసాధించారో చెప్పాల్సిందే. జగన్ ఢిల్లీపర్య టనపై మంత్రులు, ఎమ్మెల్యేలు పిచ్చికూతలుకూస్తే సరిపోదు. తన ఢిల్లీపర్యటనపై జగనే నో రు విప్పాలి.”

ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటనపై మంత్రి డ్రామాల రాంబాబు దీర్ఘాలు తీశాడు. ఇరిగేషన్ మంత్రి, అధికారులు లేకుండానే జగన్ పోలవరంపై, ప్రధానితో చర్చించాడా? : దీపక్ రెడ్డి
“ముఖ్యమంత్రి ఢిల్లీపర్యటనపై శాసనమండలిలో వాయిదాతీర్మానం ఇచ్చి, వాస్తవాలు చెప్పా లని తాముకోరాం. బడ్జెట్ సమావేశాలు చాలాముఖ్యమైనవి.. అందుకే ఆదివారం కూడా నిర్వహిస్తున్నామని చెబితే సంతోషించాము. ముఖ్యమంత్రి ముఖ్యమైన బడ్జెట్ సమావేశాల్ని కాదని, ప్రత్యేకవిమానంలో ప్రజలసొమ్ముతో హుటాహుటిన ఢిల్లీవెళ్లి ఏంసాధించారో చెప్పాల ని తాము డిమాండ్ చేశాం. డ్రామాల రాంబాబు (మంత్రి అంబటి) పోలవరంపై చర్చించడానికే ముఖ్యమంత్రి ఢిల్లీవెళ్లారు అన్నారు. పోలవరంపై జగన్ ప్రధానమంత్రితో చర్చిస్తే, సంబంధిత శాఖమంత్రిని, అధికారుల్ని తీసుకెళ్లాలి. వారులేకుండా ఆయనొక్కడే ఏంచర్చించాడో చెప్పా లి? ముఖ్యమంత్రి పోలవరంపై చాలా..ఏంచర్చించాడో చెప్పు అంబటి అంటే రాంబాబు నీళ్లు నమిలాడు. జగన్ పరుగులుపెడుతూ, ప్రత్యేకవిమానంలో ఢిల్లీవెళ్లి, విభజనచట్టంద్వారా రాష్ట్రానికి రావాల్సిన లక్షకోట్ల నిధుల్ని తీసుకొచ్చాడా? పోలవరం, అమరావతి నిర్మాణాలకు నిధులు తెచ్చాడా? ప్రతిపక్షసభ్యులు ఏం అడిగినాతప్పించుకోవడమే ప్రభుత్వానికి అలవాటుగా మారింది. టీడీపీసభ్యుల ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి ప్రభుత్వ భయపడుతోంది.”

LEAVE A RESPONSE