కేసీఅర్ పాలనకు అంతం పలికేందుకు గన్ పార్క్ దగ్గర బిజెపి సంకల్పం

Spread the love

– బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి సంగప్ప
TSPSC పేపర్ లీక్ పై గన్ పార్క్ వేదికగా బండి సంజయ్ తో కలిసి గన్ పార్క్ వరకు ర్యాలీలో పాల్గొన్న సంగప్ప

గన్ పార్క్ వేదికగా ప్రారంభమైన తెలంగాణ ఉద్యమం స్వరాష్ట్రాన్ని సాధించిందనీ, అదే గన్ పార్క్ దగ్గర బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ చేపట్టిన నిరసన దీక్ష కేసిఆర్ పాలనకు చరమ గీతం పాడుతుందని పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి జనవాడే సంగప్ప అన్నారు. టీఎస్ పీఎస్సీ పేపర్ లీక్ పై బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ గన్ పార్క్ వరకు జరిగిన ర్యాలీలో సంగప్ప పాల్గొన్నారు.

గన్ పార్క్ దగ్గర చేపట్టిన దీక్షలో రాష్ట్ర ప్రభుత్వంపై సంగప్ప ఫైర్ అయ్యారు. ఈ తొమ్మిదేళ్లలో ఈ ప్రభుత్వం ఒక్క పరీక్ష కూడా సరిగ్గా నిర్వహించలేకపోయిందని ఆయన ఆరోపించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉపాధ్యాయులు బిజెపి బలపరిచిన అభ్యర్థిని గెలిపించినట్లే ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బిజెపి గెలుపు ఖాయమని ఆయన చెప్పారు. గన్ పార్క్ వేదికగా సంజయ్ తీసుకున్న సంకల్పం కేసీఆర్ కుటుంబ పాలనకి పాతర వేయడం ఖాయమని సంగప్ప పేర్కొన్నారు.

Leave a Reply