ఉద్యోగుల ఆర్థిక, ఆర్థికేతర సమస్యలు పరిష్కరించేంత వరకూ పోరాటం కొనసాగిస్తాం

– సి ఎస్ కి ఇచ్చిన 50 పేజీల మెమోరాండంలో ఉన్న సమస్యలు పరిష్కరించాలి
– చేయి చేయి కలుపుదాం విజయవాడ లోని కార్యాలయాల సందర్శనలో
బొప్పరాజు , పలిశెట్టి దామోదరరావు

ప్రభుత్వం నుండి ఉద్యోగ,ఉపాధ్య,కార్మిక,రిటైర్డు,కాంట్రాక్టు & ఔట్ సొర్శింగు ఉద్యోగులకు సంబందించిన ఆర్థిక, ఆర్దికేతర సమస్యల సాధన కోసం,ఉద్యోగులు న్యాయమైన డిమాండ్లు పరిష్కారం కోసం కొనసాగుతున్న ఈ పోరాటం లో ఉద్యోగుల సమస్యలు పరిష్కారం పై ప్రభుత్వం నుండి స్పష్టమైన హామీ వచ్చేంతవరకు ఈ ఆందోళన కార్యక్రమాలను కొనసాగిస్తామని ఏపిజెఏసి అమరావతి స్టేట్ చైర్మన్ బొప్పరాజువెంకటేశ్వర్లు తెలిపారు.

ఏపిజెఏసి అమరావతి రాష్ట్రకమిటి పిలుపునిచ్చిన ఆందోళన కార్యక్రమాలలో బాగంగా ఈనెల 21 నుండి చేపట్టబోయే “వర్క్ టూ రూల్” అనగా ఉదయం 10.30గం. నుండి సాయింత్రం 5.00 వరకు ప్రభుత్వ పని గంటలలో మాత్రమే పనిచేయాలని రాష్ట్రంలోని ఉద్యోగులందరికీ బొప్పరాజు పిలుపునిచ్చారు. ఉద్యోగుల వద్దకే వెళ్లి చెయ్యి చేయి కలుపుదాం కార్యక్రమంలో బాగంగా ఈ రోజు ఉదయం11.30 గం: లకు విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో జరిగిన నిరసనకార్యక్రమంలో రాష్ట్ర చైర్మెన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు గారు మాట్లాడుతూ apjac అమరావతి రాష్ట్ర కార్యావర్గం నిర్నీ ఇంచిన వివిధ రకాల నిరసన కార్యక్రమాలు ప్రతీ ఉద్యోగి పాల్గోని తేదిః 5.4.23 తేది వరకు నల్ల బ్యాడ్జిలతో నిరసనతోపాటు ఈనెల 21 నుండి ప్రతిఉద్యోగి వర్క్ టూ రూల్ అనగా ప్రభుత్వం నిర్దేశించిన పని గంటలలో మాత్రమే పనిచేయాలని ఉద్యోగులందరినీ కోరారు.

ఉద్యోగులకు ప్రభుత్వం నుండి చట్టబద్ధంగా రావాల్సిన పాత పెండింగ్ బకాయిలు అనగా డిఎ అర్రియర్స్, పిఅర్సి అర్రియర్స్, తదితర ఇతర అనేక ఆర్ధిక మరియు అర్డికేతర సమస్యల పరిష్కారానికి వ్రాత పూర్వకమైన హామీని ఇవాల్సిందేనని, న్యాయమైన మా సమస్యల పరిష్కారం చేసేంతవరకు ఈ ఉద్యోగులఉద్యమం ఆపెదేలేదని ప్రభుత్వానికి తెలిసే విధంగా అందరూ ఉద్యోగులు కూడా ఐక్యంగా ఉండి పోరాటం చేద్దాం అని తెలిపారు. అదేవిధముగా మునిసిపల్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి & NTR జిల్లా ఛైర్మెన్ దొప్పలపూడి ఈశ్వర్ గారు మాట్లాడు తూ ఉద్యోగుల ఆర్ధిక, అర్ధికేతర సమస్యలను వెంటనే పరిష్కరించలని మిగిలిన సమస్యలపై నిర్ధిష్టమైన రోడ్ మ్యాప్ వ్రాత పూర్వకమైన హామీ 5 వ తేది లోపు రాని పక్షంలో ఆ తదుపరి ఉద్యమ కార్యాచరణ ఉదృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

తదుపరి ఈ రోజు మరల12:30 గ:లకు విజయవాడ వెస్ట్ తహాసీల్దార్ కార్యాలయనందు, అలాగే సాయంత్రం 3.00 గం:లకు విజయవాడ సెంట్రల్ తహసీల్డార్ కార్యాలయం నందు మరియు సా:4.00 విజయవాడ రూరల్ తహాసిల్దార్ కార్యాలయం నందు జరుగుచున్న నల్ల బ్యాడ్జీల నిరసన కార్యక్రమాలుకు హాజరై బొప్పరాజు రు ప్రసంగించారు. ప్రతిఉద్యోగిని కలసి చేయి చేయి కలుపుదాం కార్యక్రమంలో ఉద్యోగులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను, రావల్సిన బకాయిలను, ఉద్యోగులకు హామీ ఇచ్చిన అమలు పరచని హామీలు ప్రధానంగా సిపియస్ రద్దు, కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణ, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాలు పెంపుదల, ఎంప్లాయీస్ హెల్త్ కార్డులు పూర్తి స్థాయిలో వినియోగం లోకి తీసుకు రావడం, చనిపోయిన ఉద్యోగ కుటుంబాల్లో అర్హత కలిగిన వారికి కారుణ్య నియామకాలు చేపట్టడం తదితర ప్రభుత్వం ఇచ్ఛిన హామీలు అమలుచేయాలనిప్రభుత్వాన్ని బొప్పరాజు కోరారు. ఈ ఉద్యమానికి వివిధ శాఖల ఉద్యోగులు శాఖలకు అతీతంగా ప్రతి ఉద్యోగి అందరు మద్దతు పలికి ఉద్యోగుల సమస్యల పరిష్కారం చేస్తున్న ఈ ఉద్యమానికి మద్దతు పలకాలని బొప్పరాజు ఉద్యోగులను విజ్ఞప్తి చేశారు.

అలాగే, ఈ 27వ తేదీన కారుణ్య నియామకాలు పొందని కుటుంబాల ఇండ్ల సందర్శన తదితర ఆందోళన కార్యక్రమాలు గూర్చి ఉద్యోగులకు వివరించి అందరూ స్వచ్చందం గా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని జయప్రదం చేయాలని బొప్పరాజు & దామోదరరావు విజ్ఞప్తి చేస్తూ అందరికీ అవగాహన కల్పించటం జరిగింది. అప్పటికి మన న్యాయమైన ఆర్ధిక, అర్ధికేతర సమస్యలపై ప్రభుత్వం స్పందించీ పరిష్కరించక పోతే ఏఫ్రిల్ 5 న జరగబోవు రాష్ట్రకార్యవర్గసమావేశంలో భవిష్యత్ కార్యచరణను ప్రకటిస్తామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో AP JAC అమరావతి సలహాదారు K.ఆల్ ఫ్రెడ్, కో చైర్మెన్ S.మల్లేశ్వరరావు, సెక్రటరీ A.సాంబశివరావు జిల్లా ఛైర్మన్ D.శ్రీనివాసరావు, బత్తిన రామకృష్ణ, NTR జిల్లా చైర్మన్ డి.ఈశ్వర్ గారు ,NTR జిల్లా రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ ఆద్యక్ష,కార్యదర్శిలు డి.శ్రీనివాసరావు, బత్తిన రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply