Suryaa.co.in

Telangana

బండి సంజయ్ ఆధ్వర్యంలో బిజెపిలో చేరిన చక్రధర్

కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ సంక్షేమ కార్యక్రమాలను చూసి ఆకర్షితులై తెలంగాణ బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కరీంనగర్ పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ బిజెపి చేరికల కమిటీ చైర్మన్ నేతృత్వంలో శనివారం బిజెపి కేంద్ర కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ తరుణ్ రాష్ట్ర ప్రబారి సునీల్ బన్సల్ ఆధ్వర్యంలో చక్రధర్ గౌడ్ బిజెపిలో చేరారు. ఈ సందర్భంగా తన చేరికకు సహకరించిన బిజెపి రాష్ట్ర జాతీయ జిల్లా నేతలకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా చక్రధర్ గౌడ్ మాట్లాడారు దేశంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రజల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుందని అన్నారు రాబోయే రోజుల్లో ప్రజలు బిజెపికి మరింత దగ్గరవుతున్నారని, టిఆర్ఎస్ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు నిరసనగా తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీని నామరూపాలు లేకుండా చేసేందుకు ప్రజలు సిద్ధమవుతున్నారని చక్రధర్ గౌడ్ అన్నారు ఆయనతోపాటు తన అనుచరులు పార్టీలు చేరారు.

LEAVE A RESPONSE