గతంలో అందించిన రాయితీలన్నింటినీ పునరుద్దరిస్తాం

– జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక రైతాంగం వెన్నెముక విరిచేశాడు
– యువనేతకి త‌మ‌ సమస్యలు విన్నవించిన టమోటా రైతులు

• కదిరి నియోజకవర్గం గంగసానిపల్లిలో టమోటా రైతులు యువనేత లోకేష్ ను కలిసి సమస్యలు విన్నవించారు.
• కదిరి నియోజకవర్గంలో రైతులు ఎక్కువగా టమోటా పంట సాగుచేస్తూ జీవనం సాగిస్తున్నారు.
• గత ప్రభుత్వంలో హెక్టారుకు మల్చింగ్ పేపర్ కు రూ.16,500, కట్టెలకు ఎకరానికి రూ.10వేలు, సబ్సిడీపై ట్రేలు, 90శాతం సబ్సిడీపై డ్రిప్ పరికరాలు అందించేవారు.
• వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ రాయితీలన్నింటినీ ఎత్తివేసింది.
• టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక టమోటా రైతులకు రాయితీలు పునరుద్దరించాలి.
• ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటుచేసి గిట్టుబాటు ధర లభించేలా చూడాలి.
• ప్రకృతి వైపరీత్యాల కారణంగా పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.20వేల పరిహారం అందించాలి.

యువనేత లోకేష్ స్పందిస్తూ….
• రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక రైతాంగం వెన్నెముక విరిచేశాడు.
• రూ.3,500 కోట్ల ధరల స్థిరీకరణ నిధితో రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తానని నట్టేట ముంచాడు.
• జగన్ చేతగానితనం కారణంగా టమోటాకి కనీస ధర లేక రాయలసీమ రైతులు రోడ్లపై పారబోయాల్సిన దుస్థితి కల్పించారు.
• టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక టమోటా రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు చర్యలు తీసుకుంటాం.
• గతంలో అందించిన రాయితీలన్నింటినీ పునరుద్దరిస్తాం.