– బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు
అంబేద్కర్ రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నంగా ఎపి అసెంబ్లీ తీర్మానం చేసింది. రాజ్యాంగం లో లేని దళిత క్రైస్తవ నూతన నామకరణం పై తీర్మానం చేయడం పై రెండు ప్రాంతీయ పార్టీ ల వైఖరి ని ప్రజలు గమనిస్తున్నారని బిజెపి అభిప్రాయపడింది. ఆంధ్రప్రదేశ్ అసెంభ్లీ లో దళిత క్రైస్తువులకు షెడ్యూల్ కులాలకు ఇచ్చే రిజర్వేషన్లు వర్తింపచేసేవిధంగా తీర్మానం చేసి కేంద్రానికి పంపడాన్ని బిజెపి తీవ్రంగా తప్పుపడుతోంది. సెక్యులర్ దేశంలో మతమార్పిడిలకు ఈ తీర్మానం ఊతమిచ్చే విధంగా ఉంది. ఇటువంటి అంశాల పై వైసీపి కనీసం అఖిలపక్షంతో కూడా చర్చించకుండా ఏకోన్మకంగా తీర్మానం చేయడాన్ని వైసీపి రాజకీయ ప్రయోజనాలకోసమే అన్నట్లు భావించాల్సి వస్తోంది.
షెడ్యుల్ కులాలు, తెగలకు సంబందించి వారి అర్ధిక స్థితిగతులు, సామాజిక స్ధితిగతుల్లో మార్పులు తీసుకుని వచ్చి వారి అభివృద్ధి కోసం రిజర్వేషన్లను రాజ్యాంగ బద్దంగా కల్పిస్తే అందుకు భిన్నంగా ఎపి అసెంభ్లీ తీర్మానం చేయడం పై బిజెపి తీవ్రంగా విభేదిస్తోంది. ఎస్సీ వర్గాలకు చెందిన కొందరు క్రైస్తవాన్ని స్వీకరిస్తే వారికి క్రైస్తవంలో కూడా వివక్షత ఉందని అందువల్ల క్రైస్తవ మతం తీసుకున్న ఎస్సీ వర్గాలకు కూడా రిజర్వేషన్ కొనసాగించాలని గతంలో 2019 ఫిబ్రవరి రెండవ తేదీన చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అసెంభ్లీ తీర్మానం చేసి భారత ప్రభుత్వానికి పంపించింది. ప్రస్తుతం తాజాగా వైసీపి ప్రభుత్వం నేడు తాజాగా ఇదే అంశం పై తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించడం పై బిజెపి రాష్ట్ర శాఖ మండిపడుతోంది.
సాంఘిక సంక్షేమ శాఖలో ప్రభుత్వం అనేక సందర్భాల్లో ఉత్తర్వులు ఇచ్చి ఆర్ధిక భద్రతా పధకాలు ద్వారా క్రైస్తవ మతంలోకి వెళ్లిన ఎస్సీలకు హాస్టల్ సౌకర్యం తో పాటు ప్రిమెట్రిక్, పోస్టు మెట్రిక్ విద్యార్ధులకు స్కాలర్ షిప్ లు ప్రభుత్వాలు ఇస్తున్న పరిస్ధితి ఉన్న దశలో మతం మారిన షెడ్యూల్ కులాల క్రిస్టియన్లకు ఇతర షెడ్యూల్ కులాలవారీతో సమాన హోదా కల్పనకు అవసరమైన రాజ్యాంగ సవరణకై భారత ప్రభుత్వాన్ని కోరుతూ అవసరమైన రాజ్యాంగ సవరణ చేయాలని అసెంబ్లీ తీర్మానం చేయడంలో రెండు కుటుంబ పార్టీల ప్రభుత్వాలు సెక్యులర్ రాజ్యాంగ వ్యవస్ధలో మతరాజకీయాలు చేయాలన్న కోణంలో నే ఈ తీర్మానం వైసీపి ప్రభుత్వం చేసిందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు ఆరోపించారు.
అసెంభ్లీలో ముఖ్యమంత్రి పాదయాత్రలో వచ్చిన వినతులు కారణంగా దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా పునరుద్దరించాలని అసెంభ్లీలో తీర్మానం ప్రవేశపెట్టామని ముఖ్యమంత్రి ప్రకటించారు అదేవిధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా తీర్మానం చేసి ఆనాడు కేంద్రానికి పంపడం జరిగిందని తాజాగా మరోసారి పంపుతున్నామని ముఖ్యమంత్రి వ్యాఖ్యలు చూస్తే మత మార్పిడిలు ప్రోత్సహించే దిశగా ఉన్నాయి . ఈ మొత్తం వ్యవహారం సెక్యులర్ వ్యవస్ధ లో మతమార్పిడిలను ప్రోత్సహించేవిధంగానే ఎపి అసెంభ్లీ తీర్మానం కనపడుతోందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు అభ్యంతరం వ్యక్తం చేశారు