Suryaa.co.in

Andhra Pradesh

చంద్రబాబు నాయుడు నిప్పులాంటివారు

– టీడీపీ అధికార ప్రతినిధి పాతర్ల రమేష్

చంద్రబాబును విమర్శించే స్థాయి పేర్ని నానికి లేదని టీడీపీ అధికార ప్రతినిధి పాతర్ల రమేష్ దుయ్యబట్టారు. సోమవారం మంగళగిరిలోని జాతీయ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ…

చంద్రబాబు చరిత్ర తెరచిన పుస్తకం లాంటిది. టీడీపీది కొనుగోలు రాజకీయమని పేర్నినాని అనడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. అసలైన నయవంచకులు వైసీపీ నాయకులే. చంద్రబాబు నిప్పులాంటివాడు. దళిత ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి పై దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఒక దళిత ఎమ్మెల్యే శ్రీదేవిని వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేపై ఎదురుదాడి చేస్తుంటే వైసీపీ లోని దళిత ఎమ్మెల్యేలు, మంత్రులు మాట్లాడకపోవడం సిగ్గుచేటు. ఎంఎల్ సీ ఎన్నికల్లో నాలుగు ఎమ్మెల్సీ స్థానాలు కైవసం చేసుకొని మా సత్తా ఏమిటో చాటాము. మాకు టీడీపీకి 23 మంది సైకిల్ పై గెలిచిన ఎమ్మెల్యేలు ఉండగా మేము ఎవరిని కొనుగోలు చేయాల్సిన అవసరం లేదు. మీకు 151 మంది ఎమ్మెల్యేలు ఉంటే ఏడుగురు ఎమ్మెల్సీ అభ్యర్థులను ఎలా నిలబెట్టారు?. మీరు కొనుగోలు చేయాలనే ఉద్దేశంతోనే నిలబెట్టారని స్పష్టమవుతోంది. 154 మంది ఎమ్మెల్యేలు మీకు కావాలి. అది మీకు అవసరం. మేం కొనుగోలు చేయప్రయత్నించారనడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.

జనసేన నుంచి గెలిచిన రాపాక వరప్రసాద్ వైసీపీకి ఎంతకు అమ్ముడుపోయారో రాపాక చెప్పాలి. చంద్రబాబును విమర్శించే స్థాయి రాపాకకు లేదు. రాపాకకు చిల్లర మాటలు తప్ప వేరే మాటలు రావు. దళితులను విమర్శిస్తే చూస్తూ ఊరుకునేది లేదు. దళితులను ఎవరైనా సరే విమర్శిస్తే మేము చూస్తూ ఊరుకోము. చంద్రబాబు, లోకేశ్ ల గురించి మాట్లాడే అర్హత ఎమ్మెల్యే మద్దాల గిరికి లేదు. చంద్రబాబు గారు ఒక కార్యకర్తగా ఉన్న (గిరి)ని తెచ్చి గుంటూరు ఎమ్మెల్యే టికెట్ ఇస్తే పార్టీకి ద్రోహం చేశారు. మద్దాల గిరి వైసీపీలో చేరి చంద్రబాబు, లోకేశ్ లను విమర్శించడం సరికాదు. మద్దాలగిరి లాంటి చీడ పురుగుల వల్లనే ఇలా జరిగింది. లోకేశ్ యువగళ పాదయాత్రకు వస్తున్న ప్రజా స్పందన చూసి ఓర్వలేకే వైసీపీ నాయకులు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు. లోకేశ్ పాదయాత్ర సజావుగా సాగుతుండగా ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తోంది. లోకేశ్ పాదయాత్రను చూసి వైసీపీ నాయకులకు చలి జ్వరం వస్తోంది. జగన్ పాదయాత్ర సమయంలో చంద్రబాబు పోలీసులు, బలగాన్ని ఇచ్చారు. వైసీపీ నాయకులు దళితులను గౌరవించడం నేర్చుకోవాలి. చంద్రబాబు తప్పు చేయరు. అమరావతిలో చంద్రబాబు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. జగన్ అధికారంలోకి వచ్చాక దళితులపై దాడులు పెరిగాయి. డాక్టర్ సుధాకర్ ను పిచ్చివాడి చేసి చంపేశారని టీడీపీ అధికార ప్రతినిధి పాతర్ల రమేష్ విమర్శించారు.

LEAVE A RESPONSE