Suryaa.co.in

Andhra Pradesh Editorial

ఏపీలో భారీగా ఐపిఎస్‌ల బదిలీ

– 39మంది ఐ పి ఎస్ ల బదిలీ
– కీలకమైన జిల్లాలకు సొంత సామాజికవర్గం అధికారులు
– కమ్మ అధికారులెవరికీ ఎస్పీ పోస్టింగు ఇవ్వని వైనంపై చర్చ
– గత ఎన్నికల్లో దానిపైనే రచ్చ
– పనిచేసే వారికి లూప్‌లైన్‌
– ఎలక్షన్‌ టీం సిద్ధం చేసుకున్న సీఎం జగన్‌
– ఈసారి స్వయంగా తానే కసరత్తు చేసిన సీఎం
( మార్తి సుబ్రహ్మణ్యం)

ఏపీలో సీఎం జగన్‌ తన ఎలక్షన్‌ టీం సిద్ధం చేసుకుంటున్నారు. దానిపై ఆయన గత కొద్దిరోజుల నుంచి సీరియస్‌గా కసరత్తు చేశారు. గతంలో ఐఏఎస్‌ బదిలీలలో కీలకపాత్ర పోషించిన ముత్యాలరాజు బదులు, ఈసారి స్వయంగా జగనే.. ఐఏఎస్‌ బదిలీలపై కసరత్తు చేశారని అధికార వర్గాల సమాచారం. అదే దారిలో ఐపిఎస్‌ల బదిలీలోనూ సీఎం జగన్‌ ఆచితూచి అడుగులు వేసినట్లు, తాజా బదిలీల వడపోత స్పష్టం చేస్తోంది. తాజాగా 39మంది ఐపిఎస్‌లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీ చేసింది.

కీలకమైన తూర్పు గోదావరి, నెల్లూరు, సత్యసాయి జిల్లాలకు ఎస్పీలుగా సొంత సామాజికవర్గం వారిని నియమించడం, తాజా బదిలీలలో కమ్మ సామాజికవర్గానికి చెందిన అధికారులకెవరికీ ఎస్పీ పోస్టింగులు ఇవ్వకపోవడంపై పోలీసువర్గాల్లో చర్చ జరుగుతోంది. గత ఎన్నికల సమయంలో కేవలం కమ్మవారికే డీఎస్పీ పోస్టింగులు ఇచ్చారని వైసీపీ రచ్చ చేసిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. తాజా ఐపిఎస్‌ బదిలీల జాబితాలో ఒక్క కమ్మ అధికారికి ఎస్పీ పోస్టింగ్‌ ఇవ్వలేదని చెబుతున్నారు.

దీన్నిబట్టి ఎలక్షన్‌ టీమ్‌ను సీఎం జగన్‌.. ఆచితూచి ఎంపిక చేసుకున్నట్లు అర్ధమవుతోందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. కాగా కొద్దికాలం క్రితమే పోస్టింగులు తీసుకుని, బాగా పనిచేస్తున్న అధికారులను లూప్‌ లైన్‌లో వేసి, తమకు అనుకూలమైన, మంత్రులు సిఫార్సు చేసిన అధికారులకు ఎస్పీ పోస్టింగులు ఇచ్చారన్న వ్యాఖ్యలు పోలీసు వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఇందులో కీలకమైన జిల్లాలకు, ఇద్దరు సొంత వారిని డిఐజీలు పోస్టింగ్‌ ఇచ్చారంటున్నారు. ఏదేమైనా సీఎం జగన్‌ ఈ టీమ్‌తోనే ఎన్నికలకు వెళ్లనున్నట్లు అర్ధమవుతోంది.

బదిలీ అయిన ఐపిఎస్‌లు వీరే..
1.సీఎం త్రివిక్రమ్ వర్మ – విశాఖ సిటీ కమిషనర్
2.విక్రాంత్ పాటిల్ – పార్వతీపురం మన్యం ఎస్పీ
3.వాసన్ విద్యా సాగర్ నాయుడు – లా అండ్ ఆర్డర్ డీసీపీ,విశాఖ సిటీ
4.గరుడ్ సుమిత్ సునీల్ – ఎస్పీ,SIB
5.తుహిన్ సిన్హా – ఎస్పీ,అల్లూరి జిల్లా
6.ఎస్.సతీష్ కుమార్ – కాకినాడ జిల్లా ఎస్పీ
7.ఎం. రవీంద్రనాధ్ బాబు -GAD కి రిపోర్ట్
8.కేవీ మురళి కృష్ణ – అనకాపల్లి జిల్లా ఎస్పీ
9.గౌతమి శాలి – APSP 16వ బెటాలియన్ కమాండెంట్
10.సీహెచ్.సుధీర్ కుమార్ రెడ్డి – తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ
11.పి.శ్రీధర్ – కోనసీమ జిల్లా ఎస్పీ
12.డి.మేరీ ప్రశాంతి – ఏలూరు జిల్లా ఎస్పీ
13.రాహుల్ దేవ్ శర్మ – APSP 5వ బెటాలియన్ కమాండెంట్.
14.తిరుమలేశ్వర్ రెడ్డి – నెల్లూరు జిల్లా ఎస్పీ
15.సీహెచ్ విజయరావు -APSP 3వ బెటాలియన్ కమాండెంట్
16.ఆర్.గంగాధర్ రావు – అన్నమయ్య జిల్లా ఎస్పీ
17.వి.హర్షవర్ధన్ రాజు – సీఐడీ ఎస్పీ
18.కె.శ్రీనివాసరావు – అనంతపురం ఎస్పీ
19.ఫకీరప్ప – సీఐడీ ఎస్పీ
20.ఎస్వీ మాధవ్ రెడ్డి – సత్య సాయి జిల్లా ఎస్పీ
21.రాహుల్ దేవ్ సింగ్ – విజయవాడ రైల్వే ఎస్పీ
22.జి.కృష్ణ కాంత్ – కర్నూల్ ఎస్పీ
23.సిద్దార్ద్ కౌశల్ – ఆక్టోపస్ ఎస్పీ
24.అజిత వేజెండ్ల – విజయవాడ డీసీపీ(జగ్గయ్యపేట)
25.పి.జగదీష్ – APSP 14వ బెటాలియన్ కమాండెంట్
26.బిందు మాధవ్ గరికపాటి – గ్రే హౌండ్స్ ఎస్పీ.

LEAVE A RESPONSE