రాముడి పేరు చెప్పి రాజకీయం చేసే బిజెపి కావాలా? ప్రజలకు సర్వ సుఖసంతోషాలు అందించే కెసిఆర్ కావాలా..?
-అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం పాటుపడుతున్న బిఆర్ఎస్ కావాలో..మతం పునాదిమీద రాజకీయాలు చేస్తూ..అభివృద్ధిని అడ్డుకుంటూ ..ప్రజల నడ్డి విరుస్తున్నబిజెపి కావాలో తేల్చుకోవాలి
– బిజెపి ఫై యుద్ధం చేసేందుకు సోషల్ మీడియా ను వాడుకోవాలని పిలుపునిచ్చిన సీనియర్ నేత డా. దాసోజు శ్రవణ్
హైదరాబాద్, ఏప్రిల్ 19 : BRS పార్టీ తెలంగాణ వ్యాప్తంగా నిర్వహిస్తున్న ఆత్మీయ సమ్మేళనం లో భాగంగా అంబర్ పేట్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ నాయకత్వంలో ఈ రోజు క్రౌన్ ఫంక్షన్ హాల్లో
బాగ్ అంబర్ పేట్ డివిజన్ అధ్యక్షులు చంద్రమోహన్ ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రివర్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ , కార్పొరేషన్ చైర్మన్ శ్రీధర్ రెడ్డి, రవీందర్ రావు, బీసీ కమిషన్ సభ్యుడు కిషోర్ గౌడ్, గెలువయ్య, సులోచన, అబ్దుల్ మాలిక్, నర్సింహా రెడ్డి, భాస్కర్ గౌడ్, స్వరూప, శ్రీధర్, సత్యం తదితరులు పాల్గొనడం జరిగింది.
ఈ ఆత్మీయ సమ్మేళనం లో హైదరాబాద్ జిల్లా బీఆర్ఎస్ ఇన్చార్జి దాసోజు శ్రవణ్ మాట్లాడుతూ.. ఇదే ఉత్సాహం ..ఉత్తేజం..చైతన్యం.. పోరాట స్ఫూర్తి తో మరో ఏడు, ఎనిమిది నెలలు కష్టపడితే మరోసారి అంబర్ పేట్ లో బిఆర్ఎస్ జెండాను ఎగురవేయడం ఖాయం. ఇక ఎన్నికలు రాబోతున్న తరుణంలో బిజెపి పార్టీ కేసీఆర్ పైన , ఆయన కుటుంబం పైన విమర్శలు చేస్తూ , పలు సీబీఐ, ఈడీ కేసులు పెట్టి మానసికంగా ఇబ్బంది పెట్టె ప్రయత్నం చేస్తుంది.
ఈ ఎనిమిదేళ్ల లో కేసీఆర్ రాష్ట్ర ప్రజలపై ప్రేమతో ఎన్నో సంక్షేమ పధకాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి భారత దేశానికే తలమానికంగా తెలంగాణ ను తీసుకొచ్చారు. ఇంతటి అభివృద్ధిని తీసుకొచ్చిన కేసీఆర్ గారిని మూడోసారి గెలిపించుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. ఓ కుటుంబ వాతావరణంలాగా , ఒక ఆత్మీయ కలయికలాగా , పండగవతావరణంలాగా, మనలోని కష్టాలను పంచుకొనే విధంగా ఈ ఆత్మీయ సమావేశాలు జరుపుకుంటున్నాం. తెలంగాణ ఉద్యమం నడిచేక్రమంలో చాలామంది టిఆర్ఎస్ కండువా కప్పుకున్న వారిని హేళన చేసారు. తెలంగాణ వస్తదా ..చస్తదా..కేసీఆర్ తెస్తాడా..పోతాడా అని చాలామంది అవహేళన చేసిన పరిస్థితి . ఆ తర్వాత తెలంగాణ వస్తదని అర్థమైన తర్వాత తెలంగాణ వస్తే పరిశ్రమలు పోతాయి..పెట్టుబడులు రావు..కరెంట్ ఉండదు ..పరిపాలన చేతకాదు..అభివృద్ధి ఉండదు..తెలంగాణ ప్రజలు వలస వెళ్లి పోవాల్సిందే అంటూ తప్పుడు ప్రచారం చేసారు.
కానీ ఈరోజు కేసీఆర్ గారు తెలంగాణ ను ఎంతగా అభివృద్ధి చేసారో చూస్తున్నాం. తెలంగాణ వచ్చిన సమయంలో 50 వేల కోట్ల ఉన్న బడ్జెట్..ఈరోజు మూడు లక్షలకు తీసుకొచ్చారు. ఎన్నో సంక్షేమ పధకాలు , అభివృద్ధి కార్యక్రమాలు , 200 ఉన్న పెన్షన్ ను 2000 లకు తీసుకొచ్చిన మహానాయకుడు కేసీఆర్. దేశం మొత్తం తెలంగాణ వైపు చూసేలా కేసీఆర్ గారు తెలంగాణ ను ఎంతో అభివృద్ధి చేసారు. కల్యాణ లక్ష్మి, కేసీఆర్ కిట్ , షాదీ ముబారక్, మన ఊరు – మన బడి , రైతుబంధు , దళిత బంధు , బస్తి దవాఖాన లు ఇలా ఎన్నింటినో కేసీఆర్ గారు తీసుకొచ్చారు. అలాంటి కేసీఆర్ ని ఎన్నికల్లో ఓడించాలని ఆయన ఫై , ఆయన కుటుంబం ఫై , బిఆర్ఎస్ పార్టీ ఫై తప్పుడు ప్రచారం చేస్తూ వస్తున్న బిజెపికి సరైన గుణపాఠం చెప్పాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది.
ఈరోజు హైదరాబాద్ అభివృద్ధి చూస్తుంటే మనం హైదరాబాద్ లో ఉన్నామా అమెరికా , కెనడా లో ఉన్నామా అనే రీతిలో కేటీఆర్ హైదరాబాద్ ను అభివృద్ధి చేసారు. ఓ పక్క అభివృద్ధి చేస్తూనే మరోపక్క సంక్షేమ పధకాల , ఫార్మా డెవలప్మెంట్, ఐటీ డెవలప్మెంట్ , పరిశ్రమల అభివృద్ధి , రోడ్ల అభివృద్ధి , నాలా విస్తరణ , శాంతి భద్రతల పరిరక్షణ ఇలా అన్ని రకాల అభివృద్ధి చేస్తుంటే..బిఆర్ఎస్ ఫై బీజేపీ పార్టీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అలాంటి వారికీ జవాబు చెప్పాల్సిన అవసరం మనపై ఉంది. అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం పాటుపడుతున్న కేసీఆర్ కావాలో..మతం పునాదిమీద రాజకీయాలు చేస్తూ..అభివృద్ధిని అడ్డుకుంటూ ..ప్రజల నడ్డి విరుస్తున్నబిజెపి కావాలో తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది.
రాముడి పేరు చెప్పి రాజకీయం చేసే బిజెపి కావాలా..? రామరాజ్యం కొనసాగిస్తూ..రాముడి రాజ్యంలో ఎలాగైతే ప్రజలు సుఖంగా ఉన్నారో ..అంటువంటి సుఖమైనా పరిపాలన అందిస్తున్న బిఆర్ఎస్ కావాలా..? అనేది నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉంది. కేసీఆర్ మూడో సారి అధికారంలోకి వస్తే భవిష్యత్ ఇంకా ఎంత బాగుంటుందో అనేది ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరు కేసీఆర్ అందిస్తున్న ఏదొక సంక్షేమ పథకం నుండి లబ్ది పొందుతున్నారు. అలాంటి సంక్షేమ పధకాలు అందజేస్తున్న కేసీఆర్ గురించి , అయన తీసుకొచ్చిన అభివృద్ధి గురించి ప్రతి రోజు మాట్లాడుకుంటూ..పది మందికి తెలియజెపుతూ, మూడోసారి ముఖ్యమంత్రి చేసే బాధ్యత ప్రతి ఒక్కరు తీసుకోవాలని దాసోజు శ్రవణ్ సూచించారు. బిజెపి తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు.. బిజెపి ఫై యుద్ధం చేసేందుకు ప్రతి ఒక్కరు సోషల్ మీడియా ను వాడుకోవాలన్నారు.