ఈరోజు భగీరథ జయంతి సందర్భంగా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రాష్ట్ర బీసీ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి వీరంకి గురుమూర్తి ఆధ్వర్యంలో జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించినారు.
ఈ కార్యక్రమంలో సగర ఫెడరేషన్ మాజీ చైర్మన్ సాదరబోయిన ఏడుకొండలు మాట్లాడుతూ ఆకాశ గంగను దివి నుంచి భువికి తీసుకొచ్చిన మహానుభావుడు భగీరథుడని, గత తెలుగుదేశం పార్టీ హాయంలో మేమంతా కలిసి నారా చంద్రబాబు నాయుడు ని భగీరథ జయంతి రాష్ట్ర పండగ జరపాలని కోరితే, వెంటనే ఆయన జీవో పాస్ చేయడం జరిగిందని, దానికి ఆయనకి కృతజ్ఞతలు తెలుపుతున్నామనిఅన్నారు.
బీసీ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీరంకి గురుమూర్తి మాట్లాడుతూ సగరులు కష్టజీవులని, వాళ్లు ఏ పార్టీని అయినా నమ్ముకుంటే కష్టపడి ఆ పార్టీ కోసం పని చేస్తారని, సగరులతో నాకు ప్రత్యేకమైన అనుబంధం ఉందని, రాబోయే రోజుల్లో సగరులందరూ ఏకతాటి పైకి వచ్చి తెలుగుదేశం పార్టీని గెలిపించాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర మీడియా కోఆర్డినేటర్ దారపనేని నరేంద్ర, రాష్ట్ర అధికార ప్రతినిధి రమేష్ గుర్రం దుర్గారావు, ఉపాధి హామీ మాజీ డైరెక్టర్లు సుభాషిని, పిరయ్య, రాష్ట్ర పార్టీ కార్యదర్శి ఏవి రమణ గారు, ఆహ్వాన కమిటీ సభ్యులు హసన్ భాష, వీరస్వామి, అప్పారావు, కిషోర్ తదితరులు పాల్గొన్నారు.