– 50 ఏళ్ల వయసులో వంగి కొబ్బరికాయ కొట్టలేని జగన్ వృద్ధుడా 73 ఏళ్ల ప్రాయంలో కాలువ తూముని ఎవరిసాయంలేకుండా ఎగిరిదూకిన చంద్రబాబు వృద్ధుడా?
– తల్లిదండ్రుల్ని, కుటుంబాన్ని, పెద్దల్ని గౌరవించలేని జగన్మోహన్ రెడ్డి రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని ఏమి గౌరవిస్తారు?
• 16 నెలలు జైల్లో ఉండి, 11సీబీఐ కేసుల్లో ప్రతిశుక్రవారం కోర్టుకు హాజరయ్యే జగన్మోహన్ రెడ్డి, ఏమచ్చా లేని చంద్రబాబుని ఎగతాళి చేయడం, తండ్రివయసున్న చంద్రబాబుని కించపరచడమే.
• జగన్మోహన్ రెడ్డి చెప్పిన ముసలిపులి కథలో అసలైన ముసలిపులి జగనే. చంద్రబాబుగారు సింహంలాంటి వారు. ఆయన గర్జనకు భయపడి ఫ్రస్టేషన్లో జగన్ ఏదేదో మాట్లాడుతున్నారు.
– టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య
తల్లిదండ్రుల్ని గౌరవించలేనివాడు సమాజాన్ని గౌరవించలేడని, వ్యక్తి ప్రవర్తన, వ్యవహారశైలి అతనితల్లిదండ్రుల పెంపకాన్ని స్ఫురింపచేస్తుందని, 50 సంవత్సరాల వయసున్న జగన్మో హన్ రెడ్డి నడుము కొబ్బరికాయకొట్టడానికి వంగలేదు.. 73ఏళ్లవాడైన చంద్రబాబు నాయు డు గారు కాలువతూముని ఎవరిసహాయం లేకుండా ఎగిరిదాటారని, వీరిద్దరిలో ఎవరు వృద్ధులో ప్రజలే చెప్పాలని టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యలు వర్ల రామయ్య ఎద్దేవాచేశారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు . ఆ వివరాలు క్లుప్తంగా ఆయన మాటల్లోనే …
“వంగి కొబ్బరికాయ కొట్టలేని వాడు వృద్ధుడా… కాలువపై ఉన్న నీటితూముని ఎగిరిదూకిన వ్యక్తి వృద్ధుడా? రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలుసుకోలేని జగనే అసలైన వృద్ధుడు. పెద్దల్ని గౌరవించలేని ముఖ్యమంత్రిగారు వృద్ధుడా…చిన్నాపెద్దా అందరినీ సమభావంతో చూసే చంద్ర బాబునాయుడు వృద్ధుడా? జగన్ సరిగా కదల్లేడు కాబట్టే ప్రజల్లోకి వెళ్లడంలేదు. చంద్రబాబు నిత్యయవ్వనుడు కాబట్టే నిత్యం జనంలో తిరుగుతున్నారు. జగన్మోహన్ రెడ్డి వంగలేడని, రాయిపైకెత్తి కొబ్బరికాయ కొట్టించారు. అలానే ఆయనకు జ్వరం వచ్చిందని తిరుమల వేంక టేశ్వరస్వామిని ఆయనవద్దకు తీసుకెళ్తారా? కొంతమంది యువకులు పుట్టుకతో వృద్ధులు అన్న శ్రీశ్రీగారు వ్యాఖ్యలు ముఖ్యమంత్రికి అతికినట్టు సరిపోతాయి.
తన తండ్రి ముఖ్యమంత్రిగా ఉండగా, జగన్మోహన్ రెడ్డిని బెంగుళూరులో ఎందుకుంచారో జగనే చెప్పాలి
ముఖ్యమంత్రి గురించి ప్రజలకు వివరిస్తున్నాను తప్ప, ఎక్కడా ఆయన్ని కించపరచాలి అన్నది నా ఉద్దేశంకాదు. జగన్మోహన్ రెడ్డి ఆలోచనలు గమనిస్తే, ఆయన్ని తన తల్లిదండ్రు లు సరిగా పెంచలేదేమో అని అనిపిస్తోంది. జగన్మోహన్ రెడ్డి తండ్రి అయిన రాజశేఖర్ రెడ్డి , తనకుమారుడు హైదరాబాద్ లో ఉండటానికి ఒప్పుకోలేదు. కాబట్టే బెంగుళూరు లో ఉంచారు. తన తండ్రి జగన్మోహన్ రెడ్డిని బెంగుళూరులో ఎందుకుంచారో ఆయనేచెప్పాలి. పవిత్రమైన జగన్మోహన్ రెడ్డి పాదం హైదరాబాద్ లోపెడితే, ఆ నగరానికి మేలుజరుగుతుందని వద్దన్నారా?
జగన్ హైదరాబాద్ లో తనతో ఉండటానికి దివంగత రాజశేఖర్ రెడ్డి ఇష్టపడేవారు కాదని గౌరవ పెద్దలు, మాజీముఖ్యమంత్రి రోశయ్య చెప్పారు. రోశయ్య మాట్లాడిన దానికి సంబంధించిన వీడియో ఉంది. చంద్రబాబు అర్థరాత్రి 1గంట వరకు పనిచేస్తారు. జగన్మోహన్ రెడ్డి రాత్రి 8.30నిమిషాలకే కొట్టుకట్టేస్తారని ఆయన పార్టీ వా రు అంటున్నారు. మీ పనితీరు.. మీ నడవడిక.. మీ ఆలోచనలే మీరెంతటి వృద్ధులో చెప్పక నే చెబుతున్నాయి ముఖ్యమంత్రి. ఒకమనిషి ప్రవర్తన, నడత, నడవడికే అతను ఎలాం టివాడో చెబుతుందనే సత్యం ఇంత వయసొచ్చిన మీకు తెలియదా జగన్మోహన్ రెడ్డి.
హెలికాఫ్టర్ ప్రమాదంలో మీ తండ్రి చనిపోయినప్పుడు మీరు సంతకాల సేకరణలో బిజీగా ఉన్న విషయం మర్చిపోయారా ముఖ్యమంత్రిగారు
హెలికాఫ్టర్ ప్రమాదంలో మీతండ్రి గారు చనిపోయినప్పుడు మీకంట్లో చుక్కనీరు లేదు జగ న్మోహన్ రెడ్డిగారు. మీ తండ్రి శరీరభాగాల్ని మూటకట్టి తీసుకొస్తే, మీరు ఆ మూటవైపుకూడా చూడకుండా, తెల్లకాగితంపై ఎమ్మెల్యేలతో సంతకాలుపెట్టించే పనిలో బిజీగాఉన్నారు. ఆనా డు మీరుచేసింది మీకు గుర్తుందా జగన్మోహన్ రెడ్డి. మీతల్లి విజయమ్మని మీపార్టీ గౌరవాధ్యక్షురాలిగా నియమించారు. మీతల్లి గారు మీతో పాటుసమానంగా మీపక్కన కుర్చీలో కూర్చుందన్న దుగ్ధతో ఆమెను పార్టీపదవినుంచి తప్పించింది మీరుకాదా? మీచర్యతో కన్నతల్లినికూడా గౌరవించలేని కుసంస్కారి జగన్మోహ న్ రెడ్డి అని మీపార్టీ వారే అనుకున్నారు. మీ తల్లిగారి జన్మదినంనాడు ఆమెకు ఉదయాన్నే శుభాకాంక్షలు చెప్పకుండా, ఎవరోపక్కింటివారికి పెట్టినట్టు సాయంత్రం శుభాకాంక్షలు చెబు తూ ట్వీట్ పెట్టిన మీరు, చంద్రబాబుగారిని ముసలోడు అంటారా?
మీ చెల్లి చంచల్ గూడ జైల్లో ఉంటే ఎందుకు పరామర్శించలేదు ముఖ్యమంత్రి?
జగనన్న వదిలిన బాణాన్ని మీకు అధికారం అప్పగించడానికి ఆనాడు రాష్ట్రమంతా తిరిగిన మీ సొంతచెల్లి షర్మిల ఎక్కడున్నారు ముఖ్యమంత్రిగారు? మీకు, మీచెల్లికి ఎన్నిగొడవలున్నా .. మీ చెల్లి అరెస్ట్ అయ్యి చంచల్ గూడ జైల్లోఉంటే, ఆమెను మాటమాత్రంగా కూడా ఎందుకు పరామర్శించలేదు ముఖ్యమంత్రిగారు? మీది హృదయమా..లేక పాషాణమా? (రాయి) నాకు తెలిసి ఏ అన్నయ్యా మీలా ప్రవర్తించి ఉండరు ముఖ్యమంత్రి ? అలాంటి మీరు చంద్రబాబుని ముసలివాడు అంటారా?
చంద్రబాబు పులికాదు… సింహం
16నెలలు జైల్లో ఉన్నమీరు చంద్రబాబుని అంటారా ముఖ్యమంత్రిగారు? చంద్రబాబు గారు ఎప్పుడైనా జైలుముఖం చూశారా? గూగుల్ లో చంద్రబాబునాయుడు అనికొడితే హైదరాబా ద్, సైబరాబాద్, అమరావతి అని వస్తుంది. అడే జగన్మోహన్ రెడ్డి అనికొడితే ఖైదీ నంబర్ 6093 అనివస్తుంది. అలాంటి మీరు చంద్రబాబుని అంటారా? చంద్రబాబు పులికాదు.. గర్జించేసింహం. ఆ గర్జనకు భయపడే జగన్మోహన్ రెడ్డి నిరాశా నిస్పృహల్లో ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారు.
వివేకాహత్యకేసు నుంచి నేటికీ తన తమ్ముడిని కాపాడుకోవడానికి ముఖ్యమంత్రి తాపత్రయ పడుతున్నారు
మీ బాబాయ్ చనిపోతే మీచెల్లి షర్మిల చనిపోయినవ్యక్తిపై నిందలు వేయకండి అని వేడుకున్నారు. ఆస్తులకోసం మాబాబాయ్ ని చంపలేదు. ఆయన ఎప్పుడో తన ఆస్తులన్నిం టినీ తనకుమార్తె డాక్టర్ సునీతపేరుతో రాసేశారు అని వాపోయింది. ఆమెలా మీరు ఎందుకు ఏనాడు అనలేకపోయారు ముఖ్యమంత్రిగారు? ఆమె అన్నమాటలు మిమ్మ ల్ని ఉద్దేశించి అన్నవేనని అర్థమైందా మీకు? బాబాయ్ హత్యకేసులో మీరు ఎన్నిజిమ్మిక్కులు చేశారు ముఖ్యమంత్రిగారు. ఈరోజు ఇప్పటికీ మీ తమ్ముడు అవినాశ్ రెడ్డిని కాపాడేందుకు, మీరు బయటపడేందుకు మీరుపడుతున్న తాపత్రయం, మీ గుండెదిటవు నిజంగా ప్రశంసనీయం ముఖ్యమంత్రిగారు.
మీ బాబాయ్ చనిపోయిన నాడు హైదరాబాద్ నుంచి ఆలస్యంగా, తీరు బడిగా ఘటనస్థలానికి వెళ్లిన మీరు, హత్యకేసు విచారణపై సీబీఐ విచారణకోరుతూ కోర్టులో పిటిషన్ వేశారు. తరువాత మరలాదాన్నెందుకు వెనక్కుతీసుకున్నారు? వివేకా హత్య కేసువిచారణలో మీ మరోబాబాయ్ భాస్కర్ రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేసిన వెంటనే లాబీయి స్ట్ విజయ్ కుమార్ ను రంగంలోకి దించారు. ఆనాడు మీరుపడిన తాపత్రయం ప్రజలు గమ నిం చారు ముఖ్యమంత్రిగారు? నేటికీ మీ తమ్ముడు అవినాశ్ రెడ్డిని రక్షించుకోవడానికి మీరు పోరాడుతున్నారు. తనకు పేపర్, టీవీ లేవని ముఖ్యమంత్రి పచ్చి అబద్ధాలు చెప్పడం ప్రజల్ని మోసగించడం కాదా? రాష్ట్రానికి, తమకు పట్టిన శనిని ఎప్పుడు వదిలించుకుందామా అని ప్రజలు ఎదురు చూస్తున్నారు.
మీకు పేపర్, టీవీ లేవా ముఖ్యమంత్రిగారు. ఎందుకిలా పచ్చి అబద్ధాలు చెబుతారు? సాక్షి పత్రికలో వాన్ పిక్ నిమ్మగడ్డ ప్రసాద్ రూ.830కోట్ల పెట్టుబడి పెట్టిన కేసులో మీరు ముద్దాయి కాదా జగన్మోహన్ రెడ్డిగారు? సాక్షి పత్రిక, టీవీ మీవి కావంటే సరిపోతుందా? మీకు ప్రజలు దిక్కా. మీరే రాష్ట్రానికి పట్టిన 5ఏళ్లశని. ఎప్పుడు వదిలించుకుందామా ఈ ఏలిననాటి శనిని అని ప్రజలంతా ఎదురుచూస్తు న్నారు ముఖ్యమంత్రిగారు. మీరు పేదవారా? ఎలా ముఖ్య మంత్రిగారు? దేశంలోనే అత్యంతధనవంతుడైన ముఖ్యమంత్రిగా ఖ్యాతినార్జించిన మీరు పేదవారా?
విశ్వసనీయత లేని రాజకీయ నాయకుడు జగన్
విశ్వసనీయత లేని రాజకీయనాయకుడు మీరు. ప్రతిచర్యలో మీక్రిమినల్ మనస్తత్వం కొట్టొ చ్చినట్టు కనిపిస్తుంది. మీరు పేదలద్రోహి. మీ పార్టీ ధనికపార్టీ. మీ రాజ్యసభ సభ్యుల జాబితా చూస్తే మీపార్టీ చరిత్ర, వారిక్రిమినల్ నాలెడ్జ్ బట్టబయలు అవుతాయి. మీరుదళితుల ద్రోహి అని ముద్రపడిపోయింది. దళితమంత్రి తనతో చర్చకు చంద్రబాబు రావాలంటున్నాడు. మం త్రితో చర్చకు మాపార్టీ దళితకార్యకర్త చాలు. ముఖ్యమంత్రి సమయం ఇస్తే తానే ఆయన ఎలాంటి దళితద్రోహో ఆధారాలతో సహా నిరూపించి, ఆయనే అవునునిజమే అని ఒప్పుకునే లాచేస్తాను.
చంద్రబాబు వయస్సు 73 ఆయినా, ఆయన ఆలోచనలు 23ఏళ్ల యువకుడి కంటే గొప్పగాఉంటాయని గర్వంగాచెప్పగలం. చంద్రబాబు, ముఖ్యమంత్రి ఇద్దరూ తిరుమలవెళ్తే, కొండపై మెట్లు ఎక్కేది చంద్రబాబు . జగన్మోహన్ రెడ్డి ఎక్కలేడు. ముసలి పులికథను చంద్రబాబుగారిని ఉద్దేశించి చెప్పిన జగన్మోహన్ రెడ్డే నిజమైన ముసలి పులి. ఆ పులిని మించిన ఎన్నోవేషాలుఇప్పటికే జగన్మోహన్ రెడ్డి వేశారు. ఇంకా వేయడానికి ప్రయత్నిస్తున్నారు.