– అకాలవర్షాలతో నష్టపోయిన ప్రతిరైతుని, నేలపాలైన ప్రతిపంటను కాపాడాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డిదే
• గొడ్డొచ్చినవేళ, బిడ్డొచ్చిన వేళ అన్నట్టు 4ఏళ్ల జగన్ పాలనలో రైతులకు ఒక్కపంట కూడా సక్రమంగా చేతికిరాలేదు
• జగన్ దరిద్రపుపాదం పెట్టాక రాష్ట్ర రైతాంగానికి కన్నీళ్లే మిగిలాయి. వైసీపీప్రభుత్వంలో వ్యవసాయరంగం దిక్కులేని అనాథ అయ్యింది
• రాష్ట్రంలోని ప్రతిధాన్యం గింజను జగన్మోహన్ రెడ్డే కొనాలి
• మిరప, అపరాలు, వాణిజ్య పంటలు వేసి నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.50వేలు, రూ20వేల చొప్పున పరిహారమివ్వాలి
• పిడుగుపాట్లు, ఇతరకారణాలతో చనిపోయిన ఒక్కోరైతుకుటుంబానికి రూ.25లక్షల పరిహారమివ్వాలి
– తెలుగు రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి
రాష్ట్రంలో కురుస్తున్న అకాలవర్షాలతో గోదావరి జిల్లాల్లో ధాన్యంరైతులు, ఇతరప్రాంతాల్లోని వాణిజ్యపంటల రైతులు తీవ్రకష్టాల్లో ఉంటే, ముఖ్యమంత్రిగానీ, మంత్రులుగానీ, వారిముఖం చూసిన పాపానపోలేదని, రాష్ట్రంలో అసలే సమస్యలు లేవన్నట్టు సిగ్గులేకుండా రజనీకాంత్ లాంటి అగ్రనటుడిపై విమర్శలుచేస్తూ, ముఖ్యమంత్రి మెప్పుకోసం దద్దమ్మ, మంత్రులు, వైసీ పీనేతలు మాట్లాడుతున్నారని టీడీపీనేత, తెలుగురైతు విభాగం రాష్ట్రఅధ్యక్షులు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళగిరిలోని పార్టీ జాతీయకార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు . ఆ వివరాలు క్లుప్తంగా ఆయన మాటల్లోనే …
“స్వర్గీయ నందమూరి తారకరామారావుగారి ఘనచరిత్రను మసకబార్చేందుకు నానా తిప్ప లు పడుతున్న మంత్రులు, వైసీపీనేతలకు కన్నీళ్లు, కష్టాల్లో ఉన్న రైతులు కనిపించడం లే దా? ఒక మంత్రిచొక్కా విప్పితే, మరో ఎంపీ లాగులువిప్పి తిరుగుతాడు. ముఖ్యమంత్రి సొం త బాబాయ్ ని చంపినవారిని కాపాడేందుకు కిందామీదా పడుతున్నాడు. ప్రకృతి వైపరీత్యాలను సవాల్ చేసేలా చంద్రబాబునాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతులకు అండగా నిలిచారు. పంటలు నష్టపోయిన రైతులకు వెంటనే పరిహారం ఇచ్చి ఆదుకున్నారు. పంటనష్టంబీమా సొమ్మును సకాలంలో రైతులకు అందించేలాచేశారు. రైతు ల వద్దకు వెళ్లి, నేనున్నాను అని వారికి ధైర్యంచెప్పారు.
యర్రగొండపాలెంలో నష్టపోయిన మిరపరైతుల్ని ఆదుకోవాలని ముఖ్యమంత్రిని నిలదీస్తూ, చొక్కావిప్పే ధైర్యం మంత్రిసురేశ్ కు ఉందా?
జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక, రైతాంగాన్ని, వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేస్తూ, సొం తపనులు చక్కబెట్టుకునేపనిలో నిమగ్నమయ్యాడు. యర్రగొండపాలెంలో మిర్చిరైతులు పం టలు నష్టపోయి, కల్లాల్లోని మిర్చితడిసిపోయి కన్నీళ్లు పెట్టుకుంటుంటే మంత్రి ఆదిమూలపు సురేశ్ కు కనిపించడంలేదా? రైతులకు న్యాయంచేయాలని, ముఖ్యమంత్రిని నిలదీస్తూ చొక్కాలిప్పి తిరిగే ధైర్యం మంత్రికి ఉందా? తన అవినీతిని, వైఫల్యాలను టీడీపీఅధినేత ఎత్తి చూపారన్న అక్కసుతో చొక్కాలు విప్పిన మంత్రి సురేశ్, కల్లాల్లోని మిర్చిని కాపాడుకోవడా నికి, రైతులకు సకాలంలో టార్పాలిన్ పట్టలు ఇవ్వలేని తన అసమర్థ ప్రభుత్వంపై నిరసన వ్యక్తంచేస్తూ చొక్కాలు విప్పగలడా? జగన్మోహన్ రెడ్డికి, ఆయన కుటుంబానికి అంటుతున్న వివేకాహత్య తాలూకా మకిలిని రూపమాపడానికే మంత్రిసురేశ్ చొక్కాలు విప్పాడని ఆయన నియోజకవర్గ ప్రజలే చెప్పుకుంటున్నారు. బాబాయ్ ని చంపిన వారిని కాపాడటమే తన ఉద్యోగం కాదని, కష్టాలపాలైన రైతులగురించి ఆలోచించాల్సిన బాధ్యత తనపై ఉందని ముఖ్యమంత్రి తెలుసుకోవాలి.
జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రైతులకు ఏంచేస్తానని చెప్పాడు…ఇప్పుడేం చేస్తున్నాడు?
రైతుల్ని ఆదుకోవడానికి రూ.3వేలకోట్లతో పెడతాను అన్న ధరలస్థిరీకరణ నిధి ఏమైందో జగ న్మోహన్ రెడ్డి సమాధానంచెప్పాలి. అలానే రూ.4వేలకోట్ల ప్రకృతివిపత్తుల నివారణ ఫండ్ ఎ క్కడ దాచాడో చెప్పాలి. విత్తనం నుంచి విక్రయం వరకు జగన్మోహన్ రెడ్డిప్రభుత్వం రైతు వ్యతి రేక విధానాలే అవలంభిస్తోంది. గోదావరిజిల్లాల్లో ధాన్యమంతా పొలాలు, కల్లాల్లోనే తడిచిపోతే ఈ ప్రభుత్వం అక్కడి రైతాంగానికి ఏంచేసింది? అక్కడి మంత్రి దాడిశెట్టి రాజాకు రజనీకాంత్ పై ఉన్నశ్రద్ధ, తననియోజకవర్గంలోని రైతులపై లేకపోవడం బాధాకరం. మంత్రి రోజా చంద్రబాబుగారుచేసిన అభివృద్ధిని తప్పుపట్టడం ఆమె అజ్ఞానానికి నిదర్శనం. 20 ఏళ్లక్రితం పుట్టినబిడ్డ పెరిగిపెద్దవాడయ్యాక, ప్రతిభాపాటవాలతో వివిధరంగాల్లో రాణిస్తే, అతను ఆ తల్లిదండ్రుల బిడ్డకాకుండా పోతాడా రోజాగారు? 20ఏళ్లక్రితం చంద్రబాబు అభివృద్ధి చేస్తే, అది ఆయన చేసిందికాక, జగన్మోహన్ రెడ్డి చేసినట్టు అవుతుందా రోజా? చంద్రబాబు గారి పంచె అంచుని కూడా తాకలేని చుంచులన్నీ అబద్ధాలు, అవాకులు చవాకులు మాట్లాడ టం ఆపేసి, రైతులను ఆదుకోవడంపై దృష్టిపెడితే మంచిది. గొడ్డొచ్చినవేళ, బిడ్డొచ్చిన వేళ అన్నట్టు 4ఏళ్ల జగన్ పాలనలో రైతులకు ఒక్కపంట కూడా సక్రమంగా చేతికిరాలేదు. జగన్ దరిద్రపుపాదం పెట్టాక రాష్ట్ర రైతాంగానికి కన్నీళ్లే మిగిలాయి. వైసీపీప్రభుత్వంలో వ్యవసా యరంగం దిక్కులేని అనాథగా మారింది.
పిడుగుపాట్లకు, ఇతరకారణాలతో చనిపోయిన ఒక్కోరైతుకుటుంబానికి రూ.25లక్షలు ఇవ్వాలి
రాష్ట్రంలోని ప్రతిధాన్యం గింజను తాను గతంలోచెప్పిన మద్ధతుధరకే జగన్ కొనాలి. తడిచిన మిర్చిని కూడా ప్రభుత్వమే గిట్టుబాటుధరకు కొనాలి. 5 నెలలక్రితం రైతులు మిల్లులకు తోలిన 70వేల మెట్రిక్ టన్నులధాన్యం బాధ్యత జగన్మోహన్ రెడ్డే తీసుకోవాలి. అకాలవర్షాలతో నష్టపోయిన మిరపరైతులకు ఎకరాకు రూ.50వేలు, అరటి,పసుపు, బొప్పాయి, మామిడి రైతులకు ఎకరాకు రూ.50వేలు, జొన్న, మొక్కజొన్న, ఇతర అపరాల పంటలు నష్టపోయిన రైతులకు రూ.20వేల పరిహారం ఇవ్వాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిదే. పిడుగుపాటుకు గురై మరణించిన ప్రతిరైతు కుటుంబానికి, రూ.25లక్షల నష్టపరిహారం ఇవ్వాలి.” అని మర్రెడ్డి డిమాండ్ చేశారు.