– థాయ్ లాండ్ కేంద్రంగా కేసినో కార్యకలాపాలు సాగిస్తున్న గుడివాడ ముఠా గుట్టురట్టు
– చికోటి ప్రవీణ్ ను అదుపులోకి తీసుకున్న థాయ్ పోలీసులు
– గుడివాడ గ్యాంగ్ నిర్వాకంతో థాయ్ లాండ్ లోని కఠిన చట్టాలతో జైళ్లపాలు కానున్న భారతీయులు
– రూ. 100 కోట్లవిలువైన క్యాష్ లెడ్జర్లు పట్టివేత
• ఏపీలో లిక్కర్, డ్రగ్స్, గంజాయి, నిషేధిత డ్రగ్ ట్రెమిడాల్ అమ్మకాలు చాలవన్నట్టు, ముఖ్యమంత్రి తనకమీషన్లకోసం గుడివాడ కేసినో ముఠా కార్యకలాపాలను థాయ్ లాండ్ వరకు విస్తరింప చేశాడు
• నిన్న థాయ్ లాండ్ లోని పటాయా నగర సమీపంలోని ఆసియా పటాయ హోటల్లో గుడివాడ కేసినో ముఠాకు చెందిన ముఖ్యవ్యక్తి చికోటి ప్రవీణ్ పట్టుబడ్డాడు
• పోలీసు అధికారి కంపోల్ లీలాప్రపోర్న్ నేతృత్వంలో ధాయ్ పోలీసుల దాడులు , రైడ్ లో రూ.20కోట్ల విలువైన గ్యాంబ్లింగ్ చిప్స్ ను సీజ్ చేశారు. రూ.100కోట్ల విలువైన క్యాష్ లెడ్జర్లు, 100మంది గ్యాంబర్లను, చికోటి ప్రవీణ్ ను పట్టుకున్నారు
• గుడివాడలో కేసినో పెట్టినప్పుడే జగన్మోహన్ రెడ్డి చికోటి ప్రవీణ్, కొడాలినాని, వల్లభనేని వంశీలపై చర్యలు తీసుకొని ఉంటే, నేడు థాయ్ లాండ్ కేంద్రంగా ఏపీ పరువు పోయేదా?
– టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్
లక్షలాదిప్రజల సమక్షంలో గుడివాడ నడిబొడ్డున గతంలో నిర్వహించిన జూదక్రీడ కేసినో గురించి, అక్కడ జరిగిన లావాదేవీలగురించి అందరికీతెలిసిందేనని, దానివెనకున్న సూత్రధారుల, పాత్రధారులెవరనేది ఆనాడే టీడీపీ ఆధారాలతో సహాబయటపెట్టిందని, మనీలాండరిం గ్ ద్వారా కొన్నికోట్లు చేతులమారిన ఆ వ్యవహారాన్ని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ దృష్టికి కూడా తీసుకెళ్లడంజరిగిందని, ఆ కేసినో ముఠా పాపం నేడుపండిందని, టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ తెలిపారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు క్లుప్తంగా ఆయనమాటల్లోనే …
“గుడివాడ కేసినో ముఠా అమాయకులనుంచి కొన్నికోట్లు దండుకున్న వ్యవహారంపై తెలుగు దేశంపార్టీ రాష్ట్రప్రభుత్వాన్ని ఎన్నిసార్లు చర్యలుతీసుకోమని డిమాండ్ చేసినా, కేంద్రదర్యాప్తు సంస్థలు సీబీఐ, ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కు ఎన్నిసార్లు ఫిర్యాదుచేసినా, అప్పట్లో ఎలాం టిచర్యలు తీసుకోలేదు. కానీ ఈరోజు తెల్లవారుజామున థాయ్ లాండ్ లోని పటాయానగర సమీపంలో ఆసియా పటాయ హోటల్ లో గుడివాడకేసినో ముఠా పట్టుబడింది. అక్కడ ఇల్లీగల్ గా నడుపుతున్న కేసినో కేంద్రంపై స్థానిక పోలీసు అధికారి కంపోల్ లీలాప్రపోర్న్ నేతృత్వంలో పోలీసులు దాడులు చేశారు. కొందరు భారతీయులతో పాటు, నిర్వాహకుల్ని కూ డా అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించిన కథనాలు అక్కడి మీడియాలో ఫోటోలతోసహా ప్రముఖంగా వచ్చాయి. (థాయ్ లాండ్ లోని ప్రముఖమీడియా సంస్థ బ్యాం కాక్ పోస్ట్ విడుదల చేసి న ఫోటోలను పట్టాభిరామ్ విలేకరులకు ప్రదర్శించారు.)
చికోటి ప్రవీణ్, కొడాలినాని, వల్లభనేని వంశీల ధనదాహం, ముఖ్యమంత్రి కమీషన్ల కక్కుర్తితో వందలాది భారతీయులు జైళ్లలో మగ్గాల్సిన దుస్థితి
గుడివాడ కేంద్రంగా ప్రజలసొమ్ము దోచుకున్న చికోటి ప్రవీణ్, కొడాలినాని, వల్లభనేని వంశీలు, వారి గ్యాంగ్ థాయ్ లాండ్ కేంద్రంగా, అక్కడి చట్టాలకు విరుద్ధంగా కేసినో కార్యకల పాలకు తెరలేపింది. థాయ్ లాండ్ గ్యాంబ్లింగ్ యాక్ట్ ప్రకారం వారికి కఠినమైన శిక్షలుపడే అవకాశముంది. 3నెలల నుంచి 3ఏళ్లవరకు కఠినశిక్షలు పడతాయని థాయ్ లాండ్ గ్యాంబ్లిం గ్ యాక్ట్ చెబుతోంది. భారతదేశచరిత్రలో ఎప్పుడూ పరాయిదేశంలో ఇంతమంది భారతీ యులు ఇల్లీగల్ యాక్టివిటీలో పట్టుబడిందిలేదు. చికోటి ప్రవీణ్, కొడాలినాని, వల్లభనేని వంశీల ధనదాహంతో వందలమంది భారతీయులు, ఒక ఇల్లీగల్ యాక్టివిటీలో థాయ్ లాండ్ లో పట్టుబడటం దేశానికి తలవంపులు కాదా? భారతీయలు మూడేళ్లపాటు థాయ్ లాండ్ జైళ్లలో మగ్గిపోతుంటే, వారికుటుంబాల పరిస్థితి, భవిష్యత్ ఏమిటనేది ఎప్పుడైనా ఈ గుడివాడ కేసినోముఠా ఆలోచించిందా?
గతంలో చంద్రబాబు హయాంలో ఏపీ నుంచి పారిశ్రామికవేత్తల బృందం, అధికారుల బృందం విదేశాలకు వెళ్లేవి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నేత్రత్వంలో కేసినో బృందాలు, గ్యాంబ్లర్లు విదేశాలకు వెళ్లి ఇటువంటి అనైతిక కార్యకలాపాలతో దేశం, రాష్ట్రం పరువుతీస్తున్నారు. థాయ్ లాండ్ లో కేసినోముఠాపై దాడిచేసినప్పుడు అక్కడి పోలీసులు రూ.20కోట్ల విలువైన గ్యాంబ్లింగ్ చిప్స్ ను సీజ్ చేశారు. రూ.100కోట్ల విలువైన క్యాష్ లెడ్జర్లు, 100మంది గ్యాంబర్ల ను, చికోటి ప్రవీణ్ ను పట్టుకున్నారు. ఇదంతా ఒక్కరాత్రిలో పట్టుబడిన సొమ్మేనని అక్కడి పోలీసులు చెప్పారు. చోన్ బురి పోలీస్ మేజర్ జనరల్ క్యాంపోల్ లీలాప్రపరాన్ ఈ వివరాలు వెల్లడించారు. ఈ ఘటన రాష్ట్రానికి ఎంత అవమానకరమో ప్రజలు ఆలోచించాలి.
గతంలో మనరాష్ట్రం నుంచి చంద్రబాబుగారి నాయకత్వంలో పారిశ్రామికవేత్తల బృందం ఫలా నా దేశాలకు వెళ్లిందని, ఫలానా దేశప్రభుత్వాలతో చర్చించిందని, ఆయాదేశాలతో వ్యాపార సంబంధాలు మనరాష్ట్రానికి, ఇక్కడియువతకు మేలుచేస్తాయనే వార్తల్ని చదివేవాళ్లం. ఇప్పు డు జగన్మోహన్ రెడ్డి హాయాంలో ఏపీ నుంచి వచ్చిన కేసినో ముఠాలు, గ్యాంబర్లు పట్టుబడ్డార ని చెప్పుకోవాల్సిన దౌర్భాగ్యపు పరిస్థితి వచ్చింది. ఈ పరిస్థితి ఉత్పన్నమవ్వడానికి కారణం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంకాదా?
గుడివాడలో కేసినో నిర్వహించిన నాడే ముఖ్యమంత్రి చర్యలు తీసుకొనిఉంటే, నేడు థాయ్ లాండ్ కేంద్రంగా ఏపీ పరువు, ప్రతిష్టలు మంటగలిసేవా?
గుడివాడలో ఎప్పుడైతే కేసినో నిర్వహించారో, అప్పుడే దాని నిర్వాహకులు, తెరవెనకున్న సూత్రధారులు, పాత్రధారుల్ని అరెస్ట్ చేయాలని టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు రామయ్య గారు హెచ్చరించారు. గుడివాడ కేసినో ఘటనపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ దృష్టిపెట్టాలని కో రడం జరిగింది. కానీ జగన్మోహన్ రెడ్డి, ఆయనప్రభుత్వం ఎలాంటిచర్యలు తీసుకోలేదు. ఇక్క డ కేసినో జరిగినప్పుడే జగన్ ప్రభుత్వం చర్యలుతీసుకొని ఉంటే, ఆయన ముఠా నేడు థాయ్ లాండ్ లో ఇలా బరితెగించేదా?
భారతీయులు మూడేళ్లపాటు థాయ్ లాండ్ జైళ్లలో మగ్గిపో యే పరిస్థితి వచ్చేదా? తనకమీషన్లకోసం చికోటి ప్రవీణ్ లాంటి గ్యాంబ్లర్లను ముఖ్యమంత్రి పో షించబట్టే, తెలుగువారి పరువు ప్రతిష్టలు, రాష్ట్ర గౌరవమర్యాదలు థాయ్ లాండ్ లో మంట గలిసిపోయాయి. రూ.100కోట్లకు సంబంధించిన లావాదేవీలు థాయ్ లాండ్ లోని పటాయా నగరసమీపంలో జరిగిన కేసినోలో బట్టబయలైన నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి, ఆయనప్రభు త్వం ఏంసమాధానం చెబుతుంది? ముఖ్యమంత్రి ఆనాడే గుడివాడకేంద్రంగా కేసినో నిర్వహిం చిన చికోటి ప్రవీణ్, కొడాలినాని, వల్లభనేనివంశీలపై చర్యలు తీసుకొని ఉంటే, నేడుఈ పరిస్థితి వచ్చేదికాదు.
కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కూడా తక్షణమే దీనిపై దృష్టిపెట్టాలి. థాయ్ లాండ్ కేంద్రంగా పటాయానగర సమీపంలోని హోటల్లో జరిగిన కేసినోపై దృష్టిపెట్టి, నిర్వాహ కులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. థాయ్ పోలీసులకు పట్టుబడిన వారిలో ఎవరైనా అమయాకులుంటే వారిని తక్షణమే సురక్షితంగా దేశానికి తిరిగొచ్చేలా చూడాలి.” అని పట్టాభిరామ్ భారతప్రభుత్వానికి విజ్ఞప్తిచేశారు.