– బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు
– వెబక్స్ వీడియో కాన్ఫరెన్స్
విజయవాడ: వైసీపీ ప్రభుత్వం పై బిజెపి ముప్పేట దాడి ప్రారంభించింది. ఛార్జిషీట్ల దాఖలు పేరుతో అభియోగ పత్రాల స్వీకరణ శక్తి కేంద్రాల్లో పర్యటించిన బిజెపి నేతలకు ప్రజలు ఎదురు వచ్చి ఫిర్యాదులు ఇవ్వడంతో ఇదే జోష్ కొనసాగించాలని బిజెపి రాష్ట్ర శాఖ నిర్ణయించింది. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు జిల్లా అ ధ్యక్షులు, ఇంఛార్జిలతో సహా రాష్ట్ర పదాదికారులతో వెబక్స్ వీడియో కాన్పెరెన్సు నిర్వహించారు. మండలాలు, గ్రామాల్లో పర్యటించిన బిజెపి నేతలతో ఆయన ఈ సందర్భంగా వారి అనుభవాలును అడిగి తెలుసుకున్నారు.
అసెంభ్లీ స్ధాయిలో నిర్వహించే ఛార్జిషీట్లు దాఖలు కు సంబందించి నిర్వహించే కార్యక్రమం ప్రభావంతంగా నిర్వహించాలని అందుకు అనుగుణంగా కార్యక్రమాలు పూర్తి చేసుకోవాలని ప్రతి జిల్లాకు ముఖ్య అతిధిలుగా రాష్ట్ర ,జాతీయ నేతలను పంపించడం జరుగుతుందన్నారు. 12,13,14 తేదీలలో అంటే మూడు రోజుల పాటు అసెంభ్లీస్ధాయి ల్లో ఛార్జి షీట్లు దాఖలు చేయాలని సోమువీర్రాజు పార్టీ శ్రేణులకు సూచించారు. అదేవిధంగా మండలాల్లో పర్యటనలు పూర్తి చేసుకోవడంతో పాటు అనుకున్న విధంగా ఒకే రోజు కాకుండా అవసరమైతే రెండురోజులు పాటు కసరత్తు చేసి అసెంభ్లీస్ధాయి చార్జి షీట్లు దాఖలు చేసే కార్యక్రమం పై పూర్తి స్ధాయిలో జిల్లా కమిటీలు భాద్యతలు తీసుకోవలసిన అవసరం ఉందన్నారు.
మాజీ ఎమ్మెల్సీ, బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పివిఎన్ మాధవ్ మాట్లాడుతూ అసెంభ్లీ స్ధాయిలో ఛార్జిషీట్ నమోదులో బిజెపి లీగల్ సెల్ సభ్యులకు భాద్యతలు ఇస్తే మెరుగైన విధంగా ఛార్జిషీట్ ఫార్మెట్ ప్రకారం చేసే వీలుకులుగుతుందన్నారు. అసెంభ్లీ స్ధాయిలో ప్రభావంతమైన ఆరోపణలు తో కూడిన ఛార్జిషీట్ తయారు కావాలన్నారు. ఎన్నికలయ్యే వరకు ఈ అంశాలు ప్రస్తావించే వీలుంటుంది కాభట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాలని మాధవ్ సూచించారు.
బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు వేటుకూరి సూర్యనారాయణ రాజు, విష్ణు వర్ధన్ రెడ్డి , బిట్ర శివన్నారాయణ తదితరులు పలు అంశాలను ఈ సందర్భంగా ప్రస్తావించారు. జిల్లా భాద్యులతో అసెంభ్లీల్లో ఏఏ తేదీల్లో ఛార్జిషీట్లు దాఖలు చేసేది ఇప్పటి వరకు మండలాల స్ధాయిలో నిర్వహించిన సమావేశాలు వంటి విషయాల పై పార్టీ నివేదికలు ఈ సమావేశంలో తీసుకుంది.