Suryaa.co.in

Family

నాన్న ఉంటే భరోసా..నాన్న ఉంటే ధైర్యం

మనం గెలిచినప్పుడు పది మందికి చెప్పుకుని ఆనందపడే వ్యక్తి, అలాగే మనం ఓడిపోయినప్పుడు మళ్ళీ గెలుస్తావులేరా అని ప్రోత్సహించే వ్యక్తి బహుశా ఈ ప్రపంచంలో నాన్న ఒక్కడేనేమో!!..

నాన్న ఉంటే భరోసా..నాన్న ఉంటే ధైర్యం
క్రొవ్వొత్తిలా కరుగుతూ వెలుగునిచ్ఛే వాడు నాన్న !!
రాళ్ళ దెబ్బలు తిని పళ్ళు ఇచ్ఛే చెట్టులాంటి వాడు నాన్న..!!

వేలు పట్టి నడిపించేవాడు !! వేలు ఖర్చు పెట్టి చదివించేవాడు !!
మన విజయం కొరకు తపించేవాడు !!
నాన్న చేసిన త్యాగాలు, నాన్న గొప్పతనం
నాన్న బాధ్యత, ఎన్ని చెప్పుకున్నా తక్కువే..!!

నాన్న అంటే మెరిసే మేఘం..
నాన్న అంటే కురిసే వాన..
నాన్న అంటే ఆకాశం..
నాన్న అంటే నమ్మకం…
నాన్నని మర్చిపోతాం గానీ,
నాన్న లేని జీవితం ఊహకు కూడా అందదు..తన కన్నీళ్ళు తాగి..అమృతం పంచిస్తాడు…
కష్టాలన్నీ తానొక్కడే అనుభవించి,
తియ్యని ఫలాలను అందిస్తాడు..

చీకట్లను దిగమింగుకొని…
వెలుగులు రువ్విస్తాడు…
నాన్న అంటే, నా అనుకొనే ధైర్యం…
నాదే అనేంత సైన్యం…
అలాంటి నాన్నకు ఏమి ఇవ్వగలం?
నాన్నతనం గురించి ఎంతని చెప్పగలం?
నాన్న అంటే ఏమిటో
నాన్నగా మారితేనే తెలుస్తుంది.

సే:వల్లూరి సూర్యప్రకాష్
బ్యాంక్ కాలనీ కరీంనగర్

LEAVE A RESPONSE